సమోసా కోసం.. లోకోపైలెట్ ట్రైన్ ఆపాడా? నెట్టింట వీడియో వైరల్.. ఎంతవరకు నిజం?
మధ్యప్రదేశ్‌లో సమోసాల కోసం లోకో పైలట్ రైలును ఆపాడంటూ వైరల్ అయిన వీడియోపై భారతీయ రైల్వే వివరణ ఇచ్చింది. ట్రాక్ మరమ్మతుల కారణంగా గూడ్స్ రైలు నిలిచిపోవడంతో డెమూ రైలు ఆగిందని, అదే సమయంలో లోకో పైలట్ సమోసాలు కొనుగోలు చేశారని తెలిపింది. సమోసాల కోసమే రైలును నిలిపారన్న ప్రచారం అవాస్తవమని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
జిహ్వచాపల్యం ఎంతటిపనినైనా చేయిస్తుంది అనడానికి ఉదాహరణ ఈ ఘటన. మధ్యప్రదేశ్‌లో సమోసాలు తినాలన్న కోరికతో ఓ లోకో పైలట్ ఏకంగా నడుస్తున్న రైలునే మధ్యలో ఆపేసి అందరినీ ముక్కున వేలేసుకునేలా చేశాడు. ఇండోర్-మహూ మధ్య నడిచే డెమూ రైలుకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మహూ–ఇండోర్ మార్గంలోని రావు రంగ్వాసా రోడ్ వద్దకు రాగానే లోకో పైలట్ ప్రతిరోజూ రైలును నిలిపివేస్తున్నాడట. రైలు దిగి చకచకా వెళ్లి సమీపంలోని దుకాణంలో వేడివేడి సమోసాలు కొనుగోలు చేస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. సమోసాల ముచ్చట కోసం ఈ రైలు రోజూ దాదాపు 10 నిమిషాలు ఆలస్యంగా నడుస్తోందని స్థానికులు మండిపడుతున్నారు. దీనిని గమనించిన కొందరు ప్రయాణికులు, స్థానికులు ఆ దృశ్యాన్ని మొబైల్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న ఈ వీడియోక్లిప్‌ను భారతీయ రైల్వే ఖండించింది. ఈ ఆరోపణలపై ఇండియన్ రైల్వేస్ రత్లాం డివిజన్ స్పందించింది. లోకో పైలట్ ఆహారం కొనడానికి రైలును ఆపలేదని క్లారిటీ ఇచ్చింది. ట్రాక్ మరమ్మతుల కోసం గూడ్స్ రైలు ఆగిందని తెలిపింది. అదే సమయంలో ఆ ప్రాంతంలో సమోసాలు, కచోరీలు అమ్ముతున్నారని.. వాటిని లోకోపైలెట్ కొనుగోలు చేశారని చెప్పింది. కానీ ఈ విషయాన్ని తప్పుదారి పట్టిస్తూ.. వీటిని కొనడానికే రైలును ఆపినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో రైల్వేశాఖ క్లారిటీ ఇచ్చింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కలను సాకారం చేసిన.. రూ.10 కాయిన్లతో రూ.1.10 లక్షల బైక్!
పెట్రోల్‌లో ఇథనాల్ మిక్సింగ్‌తో వాహనాలు చెడిపోతాయా? నిజమెంత?
సమోసా కోసం.. లోకోపైలెట్ ట్రైన్ ఆపాడా? నెట్టింట వీడియో వైరల్
కలను సాకారం చేసిన.. రూ.10 కాయిన్లతో రూ.1.10 లక్షల బైక్!
ఫామ్ నుంచి తప్పించుకున్న 900 పాములు
టైరు పంక్చర్ అయి బోల్తాపడ్డ రిక్షా.. ఎగబడిన జనం
పానీపూరీ కోసం 12 ఏళ్ల పోరాటం..
బెంగళూరు ఓపెన్ జిమ్‌లో వింత దృశ్యం..
అమర్నాథ్ భక్తులకు నిరాశ.. ఇక మంచు లింగం కనిపించదా!

