పెట్రోల్‌లో ఇథనాల్ మిక్సింగ్‌తో వాహనాలు చెడిపోతాయా? నిజమెంత?
E20 పెట్రోల్ వల్ల వాహనాలు దెబ్బతింటాయన్న ప్రచారంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్రంగా స్పందించారు. ఒక్క ఆధారమైనా చూపాలని విమర్శకులకు సవాల్ విసిరారు. అయితే ARAI అధ్యయనం ప్రకారం పాత వాహనాల్లో కొన్ని రబ్బరు భాగాలపై ప్రభావం, మైలేజ్ తగ్గే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. దీంతో E20పై చర్చ, పాత వాహనదారుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
దేశవ్యాప్తంగా 20 శాతం ఇథనాల్ కలిపిన ‘E20’ పెట్రోల్ వినియోగంపై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. E20 పెట్రోల్ వాడటం వల్ల వాహనాలు త్వరగా పాడైపోతాయనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ.. స్వప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రజలపై రుద్దుతోందని విమర్శించింది. ఈ అపోహలు, విమర్శలపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గట్టిగా స్పందించారు. E20 ఇంధనం వల్ల వాహనాలు దెబ్బతిన్నట్లు ఒక్క ఆధారమైనా చూపించాలని ఆయన విమర్శకులకు సవాల్ విసిరారు.
ఇంధన దిగుమతులు తగ్గించి, పర్యావరణహిత ఇంధనాలను ప్రోత్సహించడంతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచేందుకే ఈ విధానాన్ని తెచ్చామన్నారు గడ్కరీ. తన కుటుంబ వ్యాపారాల కోసం దీనిని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. దేశంలోని 550 ఇథనాల్ ఉత్పత్తి యూనిట్లలో, ఏటా ఉత్పత్తి అయ్యే 1500 కోట్ల లీటర్లలో తన వాటా కేవలం 0.07 శాతం మాత్రమేనని, అంత స్వల్ప వాటా ఉన్న వ్యక్తి ప్రభుత్వ విధానాన్ని ఎలా ప్రభావితం చేయగలరని ప్రశ్నించారు. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) 18 నెలల పాటు విస్తృత అధ్యయనం నిర్వహించింది. అంతర్జాతీయ SAE ప్రమాణాల ప్రకారం 8 రకాల లోహాలు, 6 రకాల రబ్బర్లు, 4 రకాల ప్లాస్టిక్ భాగాలపై E20 ప్రభావాన్ని 7 దశల్లో పరీక్షించింది. E20 వల్ల ఇంధన వ్యవస్థలోని లోహపు విడిభాగాలపై పెద్దగా ప్రభావం చూపడం లేదని తేలింది. కొన్ని రకాల రబ్బరు విడిభాగాలపై E20 తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు గుర్తించారు. అయితే ప్రస్తుతానికి E20 కంటే E10 సురక్షితమని, పాత వాహనాలపై E20 తీవ్ర ప్రభావం చూపిస్తూ, మైలేజ్‌ను కూడా గణనీయంగా తగ్గిస్తోందని ARAI విశ్లేషించింది. ఇంకా అధికారికంగా విడుదల కాని ARAI నివేదిక ప్రకారం.. భవిష్యత్ వాహనాల్లో ఏ రకమైన మెటీరియల్స్ వాడాలో సూచించనున్నారు. ఒకవైపు వాహనాలు చెడిపోవని కేంద్రం చెప్తుండగా, మరోవైపు పాత వాహనదారుల్లో మైలేజ్, మెయింటెనెన్స్ పరంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టైరు పంక్చర్ అయి బోల్తాపడ్డ రిక్షా.. డబ్బాలు, బాటిళ్ళతో ఎగబడిన జనం
పానీపూరీ కోసం 12 ఏళ్ల పోరాటం..
బెంగళూరు ఓపెన్ జిమ్‌లో వింత దృశ్యం..
Amarnath Ice Lingam: అమర్‌నాథ్ భక్తులకు నిరాశ.. ఇక మంచు లింగం కనిపించదా!
అప్పు చేసి కడుతున్నాను బ్రో.. నిర్మాణంలో ఉన్న ఇంటికి ఆసక్తికర ఫ్లెక్సీ.. చూస్తే నవ్వాగదు
ఫామ్ నుంచి తప్పించుకున్న 900 పాములు
టైరు పంక్చర్ అయి బోల్తాపడ్డ రిక్షా.. ఎగబడిన జనం
పానీపూరీ కోసం 12 ఏళ్ల పోరాటం..
బెంగళూరు ఓపెన్ జిమ్‌లో వింత దృశ్యం..
అమర్‌నాథ్ భక్తులకు నిరాశ.. ఇక మంచు లింగం కనిపించదా!
అప్పు చేసి కడుతున్నాను బ్రో.. ఇంటికి ఆసక్తికర ఫ్లెక్సీ..
ఇంటి పెరట్లో వింత శబ్దాలు.. వెళ్లి చూసిన ఓనర్ వెన్నులో వణుకు!

