బెంగళూరు ఓపెన్ జిమ్‌లో వింత దృశ్యం..
బెంగళూరులో ఓ పబ్లిక్ పార్క్‌లో చీరకట్టులో ఉన్న వృద్ధురాలు ఓపెన్ జిమ్ పరికరాన్ని అత్యంత వేగంగా ఉపయోగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనతో ఓపెన్ జిమ్‌లలో భద్రతా ప్రమాణాలపై చర్చ మొదలైంది. పరికరాల వద్ద వినియోగ సూచనలు, పర్యవేక్షణ ఉండాలంటూ కొందరు డిమాండ్ చేస్తుండగా, వ్యక్తిగత జాగ్రత్త కూడా అవసరమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
బెంగళూరులోని ఒక పబ్లిక్ పార్కులో చీరకట్టులో ఉన్న ఓ వృద్ధురాలు ఓపెన్ జిమ్ పరికరంతో అత్యంత వేగంగా వ్యాయామం చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సుమారు 10 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో.. ఆ వృద్ధురాలు అక్కడున్న ‘ఎయిర్ స్వింగ్ మెషీన్’ను వేగంగా అటూ ఇటూ ఊపుతూ వ్యాయామం చేస్తూ కనిపిస్తుంది. అది చూసి ఆ పార్కులోని అక్కడి పిల్లలు, స్థానికులు ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. బెంగళూరుకు చెందిన యూజర్ ఈ వీడియోను నెట్టింట పంచుకున్నారు. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో పబ్లిక్ పార్కుల్లోని ఓపెన్ జిమ్ పరికరాల వద్ద కనీస భద్రతా మార్గదర్శకాలు లేకపోవడంపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పర్యవేక్షణ లేకుండా వృద్ధులు ఇలాంటి పరికరాలను వాడటం ప్రమాదకరమని, ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. బెంగళూరు కార్పోరేషన్ అధికారులు .. ప్రతి ఓపెన్ జిమ్ పరికరం పక్కన స్పష్టమైన వినియోగ సూచనల బోర్డులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీబీఎంపీ వెంటనే స్పందించి భద్రతా చర్యలు చేపట్టాలని కొందరు కోరుతుండగా.. ఎన్ని బోర్డులు పెట్టినా ‘కామన్ సెన్స్’ ముఖ్యమని, పరికరాలను వాడేటప్పుడు ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలని మరికొందరు వాదిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Amarnath Ice Lingam: అమర్‌నాథ్ భక్తులకు నిరాశ.. ఇక మంచు లింగం కనిపించదా!
అప్పు చేసి కడుతున్నాను బ్రో.. నిర్మాణంలో ఉన్న ఇంటికి ఆసక్తికర ఫ్లెక్సీ.. చూస్తే నవ్వాగదు
ఏంటి? పవన్ సినిమాలో ఛాన్స్ వస్తే వదులుకుందా?
V. V. Vinayak: ఆ సినిమా చేసి తప్పు చేశా.. వినాయక్ భావోద్వేగం
Naga Durga: బిగ్ బాస్ బంపర్ ఆఫర్.. కానీ.. ఇడుపు కాయితం ఫేమ్ నాగ దుర్గ షాకింగ్ రీజన్
బెంగళూరు ఓపెన్ జిమ్‌లో వింత దృశ్యం..
అమర్‌నాథ్ భక్తులకు నిరాశ.. ఇక మంచు లింగం కనిపించదా!
అప్పు చేసి కడుతున్నాను బ్రో.. ఇంటికి ఆసక్తికర ఫ్లెక్సీ..
ఇంటి పెరట్లో వింత శబ్దాలు.. వెళ్లి చూసిన ఓనర్ వెన్నులో వణుకు!
సముద్ర తీరంలో వింత వస్తువులు.. అంతరిక్షం నుంచి వచ్చినట్టుగా
మొబైల్ టార్చ్‌లైట్ వెలుగులో బస్సు నడిపిన డ్రైవర్
దేవుడా.. ఈ నగరానికి ఏమైంది.. ఓవైపు కోతులు..మరోవైపు శునకాల బీభత్సం

