AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పు చేసి కడుతున్నాను బ్రో.. నిర్మాణంలో ఉన్న ఇంటికి ఆసక్తికర ఫ్లెక్సీ.. చూస్తే నవ్వాగదు

అప్పు చేసి కడుతున్నాను బ్రో.. నిర్మాణంలో ఉన్న ఇంటికి ఆసక్తికర ఫ్లెక్సీ.. చూస్తే నవ్వాగదు

Phani CH
|

Updated on: Jul 11, 2026 | 4:05 PM

Share

సిద్ధిపేట జిల్లా దుబ్బాకకు చెందిన అనిల్ కుమార్ తన ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పును సరదాగా చెప్పేందుకు ఇంటికి వినూత్న ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. బ్రహ్మానందం ఫొటోతో ‘అప్పుచేసి కడుతున్న బ్రో..’ అనే క్యాప్షన్ రాయడంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మధ్యతరగతి వారి ఇల్లు కట్టే కష్టాన్ని హాస్యంగా చూపించిన ఈ ఆలోచన నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

చాలామందికి సొంత ఇల్లు కట్టుకోవడం అనేది జీవితకాలం కల. కానీ, రూపాయి రూపాయి పోగేసి.. కాస్త అప్పు చేసి ఇల్లు కట్టే సగటు మధ్యతరగతి వ్యక్తి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అలాంటి ఓ సగటు మధ్యతరగతి వ్యక్తి తాను ఇల్లు కడుతూ పడిన కష్టాలు తెలిసేలా తన ఇంటికి వినూత్నంగా ఓ ఆసక్తికర ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. అది చూసిన వారంతా తెగ నవ్వుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన అనిల్ కుమార్ వృత్తిరీత్యా ఫ్లెక్సీ మాస్టర్. సొంత ఇల్లు నిర్మించుకోవాలనేది అతని పెద్ద ఆశయం. ఎట్టకేలకు అడుగులు ముందుకు వేసి, అనుకున్నట్లుగానే ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాడు. అయితే, ఈ నిర్మాణంలో అతను చేసిన ఒక వెరైటీ ప్రయోగం అందరినీ ఆకట్టుకుంటోంది. నవ్వుల రేడు, ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం విలక్షణమైన ఎక్స్‌ప్రెషన్‌తో ఉన్న ఒక పెద్ద ఫ్లెక్సీని తన నిర్మాణంలో ఉన్న ఇంటికి తగిలించాడు. దానిపై “అప్పుచేసి కడుతున్న బ్రో..” అంటూ రాసిన ఒకే ఒక్క లైన్ ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ విషయమై అనిల్ కుమార్ ఏం చెప్పాడో తెలుసా? “ఇల్లు కట్టడం ప్రతీ ఒక్కరి డ్రీమ్. నేను కూడా ఇల్లు కడుతున్నాను కానీ, దీని కోసం కొంత అప్పు చేయాల్సి వచ్చింది. సాధారణంగా ఇల్లు ఎంత బాగుందో చూస్తారు కానీ, దాని వెనుక ఉన్న ఆర్థిక ఇబ్బందులను ఎవరూ గుర్తించరు. అందుకే నా కష్టాన్ని కాస్త సరదాగా మార్చి ఇలా బ్రహ్మానందం గారి ఫ్లెక్సీతో కొటేషన్ పెట్టాను. ఇది ఇంతలా వైరల్ అవుతుందని అస్సలు అనుకోలేదు” అని నవ్వుతూ చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా.. మధ్యతరగతి వాడి ఇంటి కష్టాన్ని ఇంత క్రియేటివ్‌గా, నవ్వు తెప్పించేలా చెప్పిన అనిల్ ఐడియాకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏంటి? పవన్‌ సినిమాలో ఛాన్స్ వస్తే వదులుకుందా?

V. V. Vinayak: ఆ సినిమా చేసి తప్పు చేశా.. వినాయక్ భావోద్వేగం

Naga Durga: బిగ్ బాస్‌ బంపర్ ఆఫర్.. కానీ.. ఇడుపు కాయితం ఫేమ్ నాగ దుర్గ షాకింగ్ రీజన్

Naga Vamsi: బుక్‌మైషో బండారం బయటపెట్టిన నాగ వంశీ..

బిగ్ స్క్రీన్ మీద బిగ్ చేంజ్‌… ఆడియన్స్‌ టేస్ట్ మారుతోందా..?

Follow Us