V. V. Vinayak: ఆ సినిమా చేసి తప్పు చేశా.. వినాయక్ భావోద్వేగం
దర్శకుడు వి.వి. వినాయక్ తన సినీ ప్రయాణంలోని ఆసక్తికర అనుభవాలను పంచుకున్నారు. ‘ఛత్రపతి’ హిందీ రీమేక్, ‘అదుర్స్’పై వచ్చిన విమర్శలు, ప్రేక్షకుల అభిరుచిని అంచనా వేయడంలోని సవాళ్ల గురించి మాట్లాడారు. అలాగే ‘అదుర్స్’ సినిమాపై దిగ్గజ దర్శకుడు కె. విశ్వనాథ్ చేసిన ప్రశంసలు తన జీవితంలో గొప్ప అవార్డుగా భావిస్తున్నానని వినాయక్ భావోద్వేగంగా తెలిపారు.
ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎదురైన అనుభవాలను, విజయాలను, కొన్ని సవాళ్లను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సినిమా రంగంలో నో చెప్పడం ఎంత కష్టమో, ఒక కథ నచ్చకపోతే దానిని తీయడం తనకు ఎంత టార్చరస్ గా ఉంటుందో వివరించారు. ఛత్రపతి హిందీ రీమేక్‌పై ఆయన మాట్లాడుతూ, దానిని అనుకోకుండా చేసిన ప్రాజెక్ట్‌గా చెప్పుకొచ్చారు. సురేష్, విజయేంద్ర ప్రసాద్ వంటి ప్రముఖులు ఇందులో భాగస్వాములయ్యారని గుర్తుచేసుకున్నారు. ఏ దర్శకుడు కూడా తన సినిమా ఆడకూడదని తీయడని, ప్రతి ఒక్కరూ విజయం కోసమే కృషి చేస్తారని వినాయక్ స్పష్టం చేశారు. అయితే, ప్రేక్షకుల స్పందనను అంచనా వేయడం ఎప్పుడూ కష్టమైన పనే అన్నారు. ఎడిటింగ్ గదిలో నవ్వు తెప్పించిన సన్నివేశాలు థియేటర్‌లో ప్రేక్షకులను నవ్వించకపోవచ్చని, లేదా ఇక్కడ చిన్నది అనుకున్నది అక్కడ పెద్ద హిట్ కావచ్చని ఆయన ఉదాహరణలతో వివరించారు. ఈ విషయంలో, ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ చెప్పినట్టు, ఎడిటింగ్ రూమ్‌లో చూసిన సినిమాలోని తప్పులు తెలియవని, థియేటర్‌లో కూర్చున్నప్పుడే అవి తెలుస్తాయని వినాయక్ ప్రస్తావించారు. వంద శాతం హిట్లు తీసిన దర్శకులు ఎవరూ ఉండరని, ఇది సినీ పరిశ్రమలో ఒక అనిశ్చిత అంశమని వినయాన్ అన్నారు. తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన అదుర్స్ సినిమా గురించి వినాయక్ వివరంగా మాట్లాడారు. ఎన్టీఆర్ అద్భుతమైన నటన, కథలోని సాహసం ఆ చిత్రానికి పెద్ద కమర్షియల్ విజయాన్ని అందించాయని అన్నారు. బ్రహ్మానందం టైమింగ్, కామెడీ సినిమాకు పెద్ద ఎసెట్‌గా నిలిచాయన్నారు. అయితే, ఈ సినిమా విడుదలైన తర్వాత బ్రాహ్మణుల పాత్రల చిత్రీకరణపై వచ్చిన విమర్శలను వినాయక్ గుర్తుచేసుకున్నారు. ఒక టీవీ చర్చలో మరో దర్శకుడు తన సినిమాను విమర్శించినప్పుడు తాను బాధపడ్డానని, తన ఉద్దేశ్యం ఎవరినీ కించపరచడం కాదని ఆయన వివరించారు. ఈ విమర్శలకు సమాధానంగా, హీరో పౌరోహిత్యం చేసే మరో సినిమాను కూడా తాను తీశానని గుర్తు చేశారు. ఈ విమర్శల ప్రస్తావనలో వినాయక్, దివంగత లెజెండరీ దర్శకుడు కె. విశ్వనాథ్ ప్రశంసలను సంతోషంగా పంచుకున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తర్వాత డైరెక్టర్ విశ్వనాథ్‌ని.. దర్శకుడు దశరథ్ తో కలిసి తాను కలవడానికి వెళ్లానని.. అప్పుడు విశ్వనాథ్ అదుర్స్ సినిమా గురించి తనతో ఆనందంగా చెప్పారన్నారు. తాను భోజనం చేసేటప్పుడు ప్రతిరోజు అదుర్స్ సినిమాను టీవీలో చూస్తారని, ఎంత నవ్వుకుంటానో చెప్పలేనంటూ… అదుర్స్ గురించి విశ్వనాథ్ తనతో పంచుకున్నారన్నారని గుర్తు చేసుకున్నారు. విశ్వనాథ్ లాంటి మహోన్నత వ్యక్తి నుంచి వచ్చిన ఆ ప్రశంస తన జీవితంలో గొప్ప అవార్డుగా భావిస్తున్నానని వినాయక్ అన్నారు. ఆ ప్రశంస విమర్శలకు ఒక తిరుగులేని సమాధానం కూడా అని ఆయన చెప్పుకొచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Naga Durga: బిగ్ బాస్ బంపర్ ఆఫర్.. కానీ.. ఇడుపు కాయితం ఫేమ్ నాగ దుర్గ షాకింగ్ రీజన్
Naga Vamsi: బుక్‌మైషో బండారం బయటపెట్టిన నాగ వంశీ..
బిగ్ స్క్రీన్ మీద బిగ్ చేంజ్… ఆడియన్స్ టేస్ట్ మారుతోందా..?
ఇంటి పెరట్లో వింత శబ్దాలు.. వెళ్లి చూసిన ఓనర్ వెన్నులో వణుకు!
సముద్ర తీరంలో వింత వస్తువులు.. అంతరిక్షం నుంచి వచ్చినట్టుగా
మొబైల్ టార్చ్‌లైట్ వెలుగులో బస్సు నడిపిన డ్రైవర్
దేవుడా.. ఈ నగరానికి ఏమైంది.. ఓవైపు కోతులు..మరోవైపు శునకాల బీభత్సం
ప్రాచీన శివాలయానికి జాతీయ హోదా!
చైనాలో గుడ్డు కూర ధర ఎంతో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ..

