AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ స్క్రీన్ మీద బిగ్ చేంజ్‌... ఆడియన్స్‌ టేస్ట్ మారుతోందా..?

బిగ్ స్క్రీన్ మీద బిగ్ చేంజ్‌… ఆడియన్స్‌ టేస్ట్ మారుతోందా..?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 11, 2026 | 2:59 PM

Share

వరుస యాక్షన్, హింసాత్మక చిత్రాల తర్వాత ప్రేక్షకులు ఇప్పుడు కుటుంబ కథలు, బలమైన భావోద్వేగాలతో కూడిన సినిమాలవైపు మొగ్గు చూపుతున్నారు. ‘మా ఇంటి బంగారం’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి చిత్రాల విజయంతో టాలీవుడ్‌లో ఫ్యామిలీ డ్రామాలకు మళ్లీ డిమాండ్ పెరిగింది. కోలీవుడ్, మలయాళంలోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుండటంతో మేకర్స్ ఇప్పుడు ఎమోషనల్ కథలపై దృష్టి సారిస్తున్నారు.

మన ఆడియన్స్ వరుస యాక్షన్, వయలెన్స్ సినిమాలతో కాస్త బోర్ ఫీల్ అయ్యారు. ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్‌లో కేవలం భారీ యాక్షన్ మాత్రమే కాదు.. స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్ట్ ఉన్న సబ్జెక్ట్స్ అయితేనే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడతారని మేకర్స్ రియలైజ్ అయ్యారు. అందుకే ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఫ్యామిలీ డ్రామాల మీద కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు. స్టార్ హీరోల నుంచి యంగ్ డైరెక్టర్స్ వరకు అందరూ ఇలాంటి కుటుంబ కథల మీదే దృష్టి పెడుతున్నారు. తెలుగులో కుటుంబ కథలకు, సెంటిమెంట్ డ్రామాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. దానికి తగ్గట్టే ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘మా ఇంటి బంగారం’ లాంటి అచ్చమైన తెలుగు ఫ్యామిలీ డ్రామాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కుటుంబ బాంధవ్యాలు, ఎమోషన్స్‌తో పాటు కావాల్సినంత వినోదాన్ని కలగలిపి తెరకెక్కిస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్నాయి. కోలీవుడ్‌లో కూడా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. రాధిక నటించిన తాయి కిళవి ఇచ్చిన ఇన్‌స్పిరేషన్‌తో మేకర్స్ ఫీల్ గుడ్ కథలనే నమ్ముకుంటున్నారు. భార్యాభర్తల బంధం, కుటుంబ విలువల నేపథ్యంలో వచ్చిన ‘గట్ట కుస్తీ 2’ లాంటి సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్ కావడంతో.. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఫ్యామిలీ డ్రామాల మీదే కాన్సన్‌ట్రేట్ చేస్తోంది. ఫ్యామిలీ సినిమాలకు కాస్త యాక్షన్‌ కూడా తోడైతే ఆ క్రేజ్‌ నెక్ట్స్ లెవల్‌లో ఉంటుందని ప్రూవ్ చేస్తున్నాయి లేటెస్ట్ హిట్స్‌. అర్జున్‌, అభిరామి, ప్రీతీ ముకుందన్ లీడ్ రోల్స్‌లో నటించిన బ్లాస్ట్ సినిమా సక్సెస్‌కు కొత్త డెఫినియేషన్ ఇచ్చింది. దీంతో ఇదే జానర్‌లో మరిన్ని సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ప్యూర్ ఫ్యామిలీ ఎమోషన్స్‌కి థ్రిల్లర్ ఎలిమెంట్స్ జోడించి మలయాళంలో తెరకెక్కుతున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ‘దృశ్యం 3’. జార్జ్ కుట్టి కుటుంబం చుట్టూ తిరిగే ఈ అద్భుతమైన కథ కోసం పాన్ ఇండియా ఆడియన్స్‌ ఎదురుచూశారు. ఆఫ్టర్ రిలీజ్ ఆ రేంజ్‌లో సక్సెస్‌ టాక్ రాకపోయినా… వసూళ్ల పరంగా మాత్రం దృశ్యం 3 మంచి నెంబర్స్‌ను రికార్డ్ చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nikhil Siddhartha: వెయ్యి మంది పిల్లలంటే మాటలు కాదు.. నిజంగా నిఖిల్ చాలా గ్రేట్!

B. V. Nandini Reddy: జాక్‌పాట్ కొట్టిన నందినిరెడ్డి..ఈసారి బాలీవుడ్ పై గురి!

Lenin Review: అయ్యగారి ప్రోగ్రెస్ కార్డ్ ! లెనిన్ హిట్టా.. ఫట్టా..?

Follow Us