AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Durga: ఆ హీరో అంటే పిచ్చి ఇష్టం.. ఆయనతో సినిమా ఛాన్స్ వస్తే ఎగిరి గంతేస్తా.. నాగదుర్గ..

ఫోక్ డ్యాన్సర్ నాగ దుర్గ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలంగాణ పల్లె పాటలతో యూట్యూబ్, సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడే అదే ఫాలోయింగ్ తో వెండితెరకు కథానాయికగా పరిచయం కాబోతుంది. ఇప్పటికే తమిలంలో లవ్ ఓ లవ్ చిత్రంలో నటించింది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Naga Durga: ఆ హీరో అంటే పిచ్చి ఇష్టం.. ఆయనతో సినిమా ఛాన్స్ వస్తే ఎగిరి గంతేస్తా.. నాగదుర్గ..
Naga Durga
Rajitha Chanti
|

Updated on: Jul 12, 2026 | 6:51 PM

Share

ఫోక్ డ్యాన్సర్ నాగ దుర్గ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ పాటలతో యూట్యూబ్, సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఇడుపు కాయితం సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయం కాబోతుంది. అంతకుముందు లవ్ ఓ లవ్ సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టింది. ఈ మూవీని తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమా ప్రమోషనల్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగదుర్గ.. తన సినీ ప్రయాణం, వ్యక్తిగత ఆకాంక్షలపై మాట్లాడారు. ప్రస్తుతం సినిమాలలో కథానాయికలకు సమాన ప్రాధాన్యత చాలా తక్కువగా లభిస్తోందని, ఎక్కువ సినిమాలు హీరో డామినేషన్ తోనే వస్తున్నాయని నాగదుర్గ అభిప్రాయం వ్యక్తం చేశారు. సినిమా కథలో ఒక పాత్ర చేస్తుంటే, ఆ పాత్రకు సరైన వెయిటేజ్, కథలో దాని అవసరం స్పష్టంగా ఉండాలని ఆమె చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss : బిగ్ బాస్‌లోకి యంగ్ హీరో భార్య.. వారానికి లక్షలకుపైనే రెమ్యునరేషన్.. ఫాలోయింగ్ మాములుగా లేదుగా..

తన అభిమాన హీరో ప్రభాస్ అని, ఆయనతో సినిమా ఆఫర్ వస్తే క్లౌడ్ 9 లో ఉంటానని, ఆనందంతో ఎగిరి గంతేస్తానని ఆమె వెల్లడించారు. ఇది చాలామందికి తెలిసిన విషయమేనని, తమిళనాడులో కూడా ఈ విషయం తెలుసని నవ్వుతూ చెప్పారు. నాగదుర్గ స్థాపించిన నాగదుర్గ నాట్యాలయం గురించి మాట్లాడుతూ, అది చాలా బాగా నడుస్తోందని తెలిపారు. ప్రస్తుతం 150-200 మంది విద్యార్థులు తన వద్ద శిక్షణ పొందుతున్నారని, ప్రతి వారాంతం క్లాసులు జరుగుతాయని చెప్పారు. తనే స్వయంగా క్లాసులు తీసుకుంటానని, ఒకవేళ ఏదైనా సమస్య ఎదురైతే విద్యార్థులు అర్థం చేసుకుంటారని పేర్కొన్నారు. తాను లేకపోతే నాట్యాలయానికి అర్థం లేదని భావిస్తానని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి :Tollywood : పెదరాయుడు సినిమా చిన్నోడు గుర్తున్నాడా.. ? ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరో.. ఫోటోస్ చూశారా..

తన కెరీర్ లక్ష్యాల గురించి అడగ్గా, ఒక ఫోక్ డాన్సర్ గా, క్లాసికల్ డాన్సర్ గా, హీరోయిన్ గా తన గోల్స్ ను వివరించారు. సినిమాల్లో ఈ అమ్మాయి బాగుంది, బాగా చేసింది అనే పేరు కంటే, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది, గ్రేట్ పర్ఫార్మెన్స్ అనిపించుకోవాలని ఉందన్నారు. కేవలం 50-100 సినిమాలు కాకుండా, 10 సినిమాలు చేసినా మంచి సినిమాలు చేయాలని, వివిధ జానర్లలో నటించాలని తన కోరిక అని తెలిపారు.

తనకు స్ఫూర్తినిచ్చిన వారిలో నటి స్నేహ, సాయి పల్లవి ఉన్నారని చెప్పారు. స్నేహ గారు కూడా వివిధ రకాల పాత్రలు చేసి, వైవిధ్యమైన నటనను ప్రదర్శించారని, అట్లాగే సాయి పల్లవి గారి స్క్రిప్ట్ ఎంపిక చాలా గొప్పదని పేర్కొన్నారు. లక్, ఫేట్, టాలెంట్ అన్నీ కలిసి వస్తే ఏదైనా బాగుంటుందని నాగదుర్గ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇడుపు కాయితం టైటిల్ వివాదంపై కూడా ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: అప్పట్లో ఈ సాంగ్ ట్రెండ్ సెట్టర్.. 90’s కుర్రాళ్ల మతులు పోగొట్టిన పాట.. ఇప్పటికీ క్రేజ్ మామూలుగా లేదుగా.

ప్రభాస్ ఫోటో..

Naga Durga, Prabhas

Naga Durga, Prabhas

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఒక గది.. ఐదుగురు మనుషులు.. ప్రతి సీన్ వణుకుపుట్టిస్తుంది.. ఓటీటీని షేక్ చేస్తున్న మైండ్ బ్లోయింగ్ మూవీ..

Follow Us
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ రీసెంట్ గ్యాంబ్లింగ్ యాక్షన్ థ్రిల్లర్
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ రీసెంట్ గ్యాంబ్లింగ్ యాక్షన్ థ్రిల్లర్
అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. టాలీవుడ్ విలన్..
అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. టాలీవుడ్ విలన్..
పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే..
పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే..
ఈ రాశి వారికి నవరాత్రి ఉత్సవాలు వరం.. బంగారం లాంటి భవిష్యత్తు
ఈ రాశి వారికి నవరాత్రి ఉత్సవాలు వరం.. బంగారం లాంటి భవిష్యత్తు
శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా..
శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా..
బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్.. నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్
బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్.. నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్
చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి
పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి
5 నిమిషాల్లో చేసుకుని.. తినేకొద్దీ తినాలనిపించే కొత్తిమీర కారం
5 నిమిషాల్లో చేసుకుని.. తినేకొద్దీ తినాలనిపించే కొత్తిమీర కారం
అప్పుడే ఆమెకు పడిపోయా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ మూములుగా లేదుగా
అప్పుడే ఆమెకు పడిపోయా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ మూములుగా లేదుగా