AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్‌!

రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్‌!

Phani CH
|

Updated on: Jul 12, 2026 | 7:10 PM

Share

హనీమూన్‌ను వినూత్నంగా జరుపుకోవాలనుకున్న నూతన దంపతులు నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ ఫస్ట్ ఏసీ కూపేను పూలు, బెలూన్లతో అలంకరించి హనీమూన్ గదిలా మార్చారు. ఈ వీడియో వైరల్ కావడంతో రైల్వే అధికారులు స్పందించారు. భద్రతా నిబంధనలు ఉల్లంఘించి ప్రైవేట్ డెకరేటర్లను కోచ్‌లోకి అనుమతించిన ఘటనపై టికెట్ కలెక్టర్‌ను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు.

సాధారణంగా పెళ్లయిన కొత్త జంట హనీమూన్‌ కోసం మంచి టూరిస్ట్ ప్లేసులకు వెళ్తారు. కానీ ఈ జంట రొటీన్‌కు భిన్నంగా ఉండాలనుకొని వినూత్నంగా ప్లాన్‌ చేశారు. అందుకోసం రన్ అవుతున్న రైలునే ఎంచుకుంది. రైలు ప్రయాణాన్ని చిరస్మరణీయంగా మార్చుకోవాలనే తాపత్రయంతో.. తాము ప్రయాణిస్తున్న ఫస్ట్ ఏసీ కూపేను ఏకంగా ఫస్ట్ నైట్ బెడ్‌రూమ్‌లా మార్చేసింది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ లో జూలై 6న ఈ విచిత్ర ఘటన జరిగింది. సదరు జంట ఆన్‌లైన్ ద్వారా ప్రైవేట్ డెకరేటర్లను బుక్ చేసుకుంది. రైలు స్టేషన్‌లో ఆగిన సమయంలో లోపలికి వచ్చిన డెకరేటర్లు.. పూలు, బెలూన్లతో ఆ కూపేను లగ్జరీ హనీమూన్ రూమ్‌లా ముస్తాబు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో రైల్వే అధికారుల దృష్టికి చేరింది. రైల్వే నిబంధనల ప్రకారం.. టికెట్ లేని ప్రైవేట్ వ్యక్తులు, బయటివారు కోచ్‌ల్లోకి ప్రవేశించడం తీవ్రమైన భద్రతా లోపం కిందకు వస్తుంది. ఇంత జరుగుతున్నా డ్యూటీలో ఉన్న టికెట్ కలెక్టర్ గమనించకపోవడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గానూ సదరు టీసీని తక్షణమే సస్పెండ్ చేస్తూ దక్షిణ మధ్య రైల్వే ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి అంతర్గత విచారణకు ఆదేశించామని, భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టెంకాయి, రూపాయితోనే మూడు ముళ్లు.. కట్నం గొడవే లేని ఆదర్శ గ్రామాలు!

సమాధిలో 2,300 ఏళ్ల నాటి మద్యం లభ్యం

డాన్స్‌ రాకపోతే రాదని చెప్పాలి కానీ.. పెళ్లి చెడగొట్టుకుంటావా సామీ!

నువ్వేం చేయాలో నీకు తెలుసు.. బై శిక్షణ ఇస్తూ.. విమానం నుంచి దూకేసిన ఇన్‌స్ట్రక్టర్‌

పెట్రోల్‌ బంకులో దారుణం.. పెట్రోలు కొట్టించుకొని..

Follow Us