డాన్స్ రాకపోతే రాదని చెప్పాలి కానీ.. పెళ్లి చెడగొట్టుకుంటావా సామీ!
మార్కాపురం జిల్లాలో పెళ్లి వేడుకలో జరిగిన చిన్న వివాదం పెళ్లి రద్దుకు దారితీసింది. ఊరేగింపు సందర్భంగా జరిగిన వాగ్వాదంతో వధువు కుటుంబం పెళ్లిని నిలిపివేసి వెనుదిరిగింది. పెద్దలు రాజీ ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో ఇరుపక్షాలు పరస్పర లావాదేవీలు ముగించుకుని విడిపోయాయి. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ రోజుల్లో పెళ్లిళ్లు పెటాకులవడానికి పెద్ద కారణాలేమీ అక్కర్లేదనిపిస్తోంది… చిన్న చిన్న కారణాలకే పెళ్లయిన వారు విడాకులంటూ కోర్టుకెక్కుతుంటే.. కాసేపట్లో పెళ్లిపీటలెక్కాల్సిన జంట చిన్న కారణంతో పెళ్లి పెటాకులై వధువు తరపువారు పెళ్లి మండపంనుంచి తిరిగి వెళ్లిపోగా.. వరుడు పెళ్లి ఖర్చును తల్చుకుని లబోదిబోమన్నాడు. ఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాచర్ల మండలం చిన్నగానిపల్లి గ్రామానికి చెందిన యువకుడికి, కంభం మండలం తురిమెళ్లకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఆదివారం ఉదయం ముహూర్తం కావడంతో, శనివారం రాత్రి వధువు కుటుంబ సభ్యులు వరుడి ఊరికి చేరుకున్నారు. రాత్రి వేళ వధూవరులను వాహనంపై ఊరేగిస్తుండగా ఇరువైపులా బంధువులు, యువకులు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో వధూవరులను కూడా డ్యాన్స్ చేయాలని కోరగా, వధువు సిద్ధమైంది. అయితే వరుడు మాత్రం తాను చేయనని భీష్మించుకు కూర్చున్నాడు. అంతేకాకుండా.. వధువును కూడా డాన్స్ చేయవద్దంటూ అందరి ముందూ గట్టిగా మందలించాడు. పెళ్లికి ముందే వరుడు అంతలా కోప్పడటం వధువు తండ్రికి నచ్చలేదు. కాబోయే భర్త ఇప్పుడే ఇలా ఉంటే, పెళ్లయ్యాక కూతురి భవిష్యత్తు ఏంటని ఆలోచించిన తండ్రి, వెంటనే వధువును వాహనం పైనుంచి కిందకు దించేశారు. ‘పెళ్లీ వద్దు గిళ్లీ వద్దు’ అంటూ వధువు తరఫు వారు సొంతూరికి తిరుగుపయనమయ్యారు. దీంతో పెళ్లి పెద్దలు రంగంలోకి దిగి.. ఇరువురి మధ్య సంధి కుదర్చడానికి ప్రయత్నించారు. కానీ, అది కుదరకపోవడంతో.. ఇరుపక్షాలు కూర్చొని కట్నకానుకల లావాదేవీలు సెటిల్ చేసుకున్నారు. అప్పటికే పెళ్లి కోసం భారీగా ఖర్చు చేసిన వరుడి తరఫు వారు లబోదిబోమంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నువ్వేం చేయాలో నీకు తెలుసు.. బై శిక్షణ ఇస్తూ.. విమానం నుంచి దూకేసిన ఇన్‌స్ట్రక్టర్
పెట్రోల్ బంకులో దారుణం.. పెట్రోలు కొట్టించుకొని..
డాన్స్ రాకపోతే రాదని చెప్పాలి. కానీ పెళ్లి చెడగొట్టుకుంటావా సామీ
నువ్వేం చేయాలో నీకు తెలుసు.. విమానం నుంచి దూకేసిన ఇన్‌స్ట్రక్టర్
పెట్రోల్ బంకులో దారుణం.. పెట్రోలు కొట్టించుకొని..
గంటల దొంగ.. దొరికాడు ఇలా..!
అర్ధరాత్రి వీధుల్లో యువకులు.. దేనికో తెలుసా!
వామ్మో... ఈ శునకం ట్యాలెంట్ మామలుగా లేదు!
సమోసా కోసం.. లోకోపైలెట్ ట్రైన్ ఆపాడా? నెట్టింట వీడియో వైరల్

