టెంకాయి, రూపాయితోనే మూడు ముళ్లు.. కట్నం గొడవే లేని ఆదర్శ గ్రామాలు!
వరకట్న నిర్మూలనకు రాజస్థాన్‌లోని బురానియా కుటుంబం, బిహార్‌లోని థరు తెగ ప్రజలు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒక రూపాయి, ఒక కొబ్బరికాయతోనే పెళ్లిళ్లు జరుపుతూ కట్నానికి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఆడపిల్లలకు విద్యే నిజమైన కట్నమని వారు నమ్ముతున్నారు. థరు తెగలో కట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరంగా పరిగణించబడుతుండగా, అక్కడ ఇప్పటివరకు వరకట్న వేధింపుల కేసులు నమోదుకాలేదు.
వరకట్న దురాచారానికి వ్యతిరేకంగా రాజస్థాన్‌కు చెందిన ఒక కుటుంబం, బిహార్‌కు చెందిన ఒక తెగ శతాబ్దాలుగా అద్భుతమైన సందేశాన్ని ఇస్తున్నాయి. పెళ్లి ఖర్చులంటే లక్షలాది రూపాయలు అవసరమవుతున్న ఈ రోజుల్లో.. రాజస్థాన్‌లోని సీకర్ జిల్లా మద్ని-మందా ప్రాంతానికి చెందిన బురానియా కుటుంబం కేవలం ఒక రూపాయి, ఒక కొబ్బరికాయ ఇచ్చి పెళ్లిళ్లు పూర్తి చేస్తోంది. ఇటీవల రాజస్థాన్ పోలీసు శాఖలో పనిచేస్తున్న సరోజ్ అనే యువతికి, సుభాష్ బురానియాతో వివాహం జరిగింది. కట్నకానుకలు ఇవ్వకూడదని పెళ్లికి ముందే ఇరుపక్షాలు నిర్ణయించుకున్నాయి. గతంలో తమ కుమార్తె పింకీ పెళ్లిని కూడా బురానియా కుటుంబం ఇలాగే జరిపించింది. ఆడపిల్లలను బాగా చదివించి, వారి కాళ్లమీద వారు నిలబడేలా చేయడమే అతిపెద్ద కట్నమని ఈ కుటుంబం బలంగా నమ్ముతోంది. మరోవైపు బిహార్‌లోని పశ్చిమ చంపారణ్ జిల్లాకు చెందిన ‘థరు’ తెగ ప్రజలు కూడా శతాబ్దాలుగా కట్న రహిత సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. వీరిలో కట్నం ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరమే. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే సమాజం నుండి బహిష్కరిస్తారు. అందువల్ల ఆ తెగ ప్రజలెవ్వరూ ఈ నియమాలను ఉల్లంఘించడానికి ధైర్యం చేయరు. థరు తెగ ప్రజలు పెళ్లిని రెండు కుటుంబాలను, రెండు హృదయాలను కలిపే పవిత్ర బంధంగా భావిస్తారు. అందుకే వివాహం చేయడం కోసం వరకట్నం తీసుకుని దాన్నొక వ్యాపారంలా మార్చాలని వారు చూడరు. ఇంకా అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 1966లో అక్కడ గోబర్హియా పోలీసు స్టేషన్ ఏర్పాటైనప్పటి నుండి ఇప్పటివరకు ఒక్క వరకట్న వేధింపుల కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సమాధిలో 2,300 ఏళ్ల నాటి మద్యం లభ్యం
డాన్స్ రాకపోతే రాదని చెప్పాలి కానీ.. పెళ్లి చెడగొట్టుకుంటావా సామీ!
నువ్వేం చేయాలో నీకు తెలుసు.. బై శిక్షణ ఇస్తూ.. విమానం నుంచి దూకేసిన ఇన్‌స్ట్రక్టర్
టెంకాయి, రూపాయితోనే మూడు ముళ్లు.. కట్నం గొడవే లేని ఆదర్శ గ్రామాలు
సమాధిలో 2,300 ఏళ్ల నాటి మద్యం లభ్యం
డాన్స్ రాకపోతే రాదని చెప్పాలి. కానీ పెళ్లి చెడగొట్టుకుంటావా సామీ
నువ్వేం చేయాలో నీకు తెలుసు.. విమానం నుంచి దూకేసిన ఇన్‌స్ట్రక్టర్
పెట్రోల్ బంకులో దారుణం.. పెట్రోలు కొట్టించుకొని..
గంటల దొంగ.. దొరికాడు ఇలా..!
అర్ధరాత్రి వీధుల్లో యువకులు.. దేనికో తెలుసా!

