AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ షాక్.. హెడ్ కోచ్ తొలగింపు? సంచలన నిర్ణయం తీసుకున్న క్రికెట్ బోర్డు

ఇంగ్లండ్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించే దిశగా ఈసీబీ అడుగులు వేస్తోందని నివేదికలు చెబుతున్నాయి. టెస్ట్ క్రికెట్‌లో వరుస నిరాశాజనక ఫలితాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే వైట్‌బాల్ జట్ల కోచ్‌గా ఆయన కొనసాగనున్న అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

బిగ్ షాక్.. హెడ్ కోచ్ తొలగింపు? సంచలన నిర్ణయం తీసుకున్న క్రికెట్ బోర్డు
Ind Vs Eng
SN Pasha
|

Updated on: Jul 12, 2026 | 6:07 PM

Share

ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ జట్టులో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రస్తుత ఆల్-ఫార్మాట్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌ను టెస్ట్ జట్టు ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి తప్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఆయనను పూర్తిగా కోచింగ్ వ్యవస్థ నుంచి తప్పించడం కాకుండా, పరిమిత ఓవర్ల జట్ల హెడ్ కోచ్‌గా కొనసాగించే అవకాశాలు ఉన్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వారం రోజుల వ్యవధిలోనే ఈ వార్త వెలువడటం విశేషం. స్టోక్స్–మెక్‌కల్లమ్ జోడీ ఆధ్వర్యంలో ఇంగ్లండ్ టెస్ట్ జట్టు దూకుడు ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.

అయితే ఇటీవల కాలంలో జట్టు ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోవడంతో మెక్‌కల్లమ్‌పై ఒత్తిడి పెరిగినట్లు సమాచారం. అంతేకాకుండా మైదానం వెలుపల ఆయన ప్రవర్తనకు సంబంధించిన కొన్ని వివాదాలు కూడా చర్చకు దారితీశాయి. దీంతో టెస్ట్ జట్టు కోచింగ్ వ్యవస్థలో మార్పులు అవసరమనే అభిప్రాయం ఈసీబీలో బలపడినట్లు తెలుస్తోంది. మెక్‌కల్లమ్‌ను టెస్ట్ జట్టు ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు ఈసీబీ త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆయన సేవలను కొనసాగించాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం.

Brendon Mccullum

Brendon Mccullum

ఇంగ్లండ్ టెస్ట్ జట్టు ఈ ఏడాది వరుసగా నిరాశాజనక ఫలితాలు నమోదు చేసింది. స్వదేశంలో భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను సమం చేసుకోవడంలో మాత్రమే సఫలమైన ఇంగ్లండ్, ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌ను కోల్పోయింది. అనంతరం స్వదేశంలోనే న్యూజిలాండ్ చేతిలో కూడా ఓటమి పాలవడం జట్టు ప్రదర్శనపై తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ వరుస వైఫల్యాలే కోచింగ్ వ్యవస్థలో మార్పులకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈసీబీ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో మెక్‌కల్లమ్ భవిష్యత్తుపై స్పష్టత రావాలంటే బోర్డు అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సి ఉంది. ఒకవేళ ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, “బాజ్‌బాల్” యుగానికి ముగింపు పలికినట్లే అవుతుందని క్రికెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Follow Us