ICC T20 Rankings : లేటెస్ట్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్-10 లో ఏ దేశం ఏ స్థానంలో ఉందో తెలుసా?
ICC T20 Rankings : ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌ల్లో వరుస ఓటములతో టీమ్ ఇండియా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో నంబర్ 1 స్థానాన్ని కోల్పోయింది. నాలుగేళ్ల ఆధిపత్యానికి ముగింపు పలుకుతూ ఇంగ్లండ్ అగ్రస్థానాన్ని దక్కించుకోగా, భారత్ రెండో స్థానానికి పడిపోయింది.

ICC T20 Rankings : యూకే పర్యటనలో వరుస పరాజయాలను చవిచూస్తున్న భారత క్రికెట్ జట్టుకు ఐసీసీ గట్టి షాక్ ఇచ్చింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో ఘోరంగా సిరీస్‌లు ఓడిపోవడంతో టీమిండియా ప్రపంచ నంబర్-1 టీ20 ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఇప్పటివరకు ఒక వెలుగు వెలిగిన భారత్.. తాజా ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి పడిపోయింది. మరోవైపు, భారత్‌పై 4-0తో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్ జట్టుకు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారీ ప్రయోజనం చేకూరింది. భారత్‌ను కిందకు నెట్టేసి ఇంగ్లండ్ ప్రపంచంలోనే నంబర్-1 టీ20 జట్టుగా అవతరించింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ జట్లు టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ పొజిషన్‌లో ఉండటానికి ఒకరితో ఒకరు తీవ్రంగా పోటీ పడుతున్నారు. దీని వెనుక ఒలింపిక్ అర్హత అనే ఒక పెద్ద కారణం దాగి ఉంది. డిసెంబర్ 31, 2026 నాటికి ఆసియా, ఆఫ్రికా, యూరప్ ఖండాలలో ఏ జట్టు అయితే టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలుస్తుందో, ఆ జట్టుకు నేరుగా ఒలింపిక్స్ టికెట్ లభిస్తుంది. ఈ నిబంధన కారణంగా కనీసం ఈ ఏడాది చివరి నాటికైనా తమ తమ ఖండాలలో టాప్ ర్యాంక్ సాధించాలనే పట్టుదలతో అన్ని దేశాలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి.
టాప్-10 టీ20 జట్ల వివరాలు.. ఏ దేశం ఏ స్థానంలో ఉందంటే?
తాజా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం టాప్ స్థానాల్లో మార్పులు జరిగాయి. భారత్‌ను ఓడించిన ఇంగ్లండ్ మొదటి స్థానానికి చేరగా, భారత్ రెండో స్థానానికి పరిమితమైంది. అయితే మిగిలిన టాప్-10 జట్ల స్థానాల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. ఆస్ట్రేలియా జట్టు మూడో స్థానంలో, న్యూజిలాండ్ నాల్గో స్థానంలో, దక్షిణాఫ్రికా ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి. ఇక సాంప్రదాయ ప్రత్యర్థి పాకిస్తాన్ ప్రస్తుతం ఆరో స్థానంలో ఉండగా, వెస్టిండీస్ ఏడో స్థానంలో, బంగ్లాదేశ్ ఎనిమిదో స్థానంలో, శ్రీలంక తొమ్మిదో స్థానంలో, ఆఫ్ఘనిస్తాన్ పదో స్థానంలో స్థిరంగా ఉన్నాయి.
నాలుగేళ్ల రారాజు స్థానానికి బ్రేక్
భారత జట్టు దాదాపు సాడే నాలుగేళ్ల తర్వాత టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం నుంచి కిందకు పడిపోవడం గమనార్హం. ఫిబ్రవరి 2022 నుండి భారత్ ప్రపంచంలోనే నంబర్-1 టీ20 జట్టుగా తిరుగులేని వైభవాన్ని ప్రదర్శించింది. ఈ సుదీర్ఘ కాలంలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి దిగ్గజాల కెప్టెన్సీలో టీమిండియా 2024 మరియు 2026 లలో వరుసగా రెండు టీ20 వరల్డ్ కప్ సిరీస్‌లను గెలుచుకుని ప్రపంచ విజేతగా నిలిచింది.
కానీ, 2026 టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. కెప్టెన్‌గా అయ్యర్ చేపట్టిన మొదటి యూకే పర్యటనే అతనికి పెద్ద శాపంగా మారింది. దురదృష్టవశాత్తూ కెప్టెన్‌గా ఆడిన మొదటి 7 మ్యాచ్‌లలో ఆయన ఒక్కటంటే ఒక్క విజయాన్ని కూడా అందుకోలేకపోయారు. ఐర్లాండ్‌తో 0-2, ఇంగ్లండ్‌తో 0-4తో సిరీస్‌లను కోల్పోవడంతో, భారత్ తన ప్రతిష్టాత్మక నంబర్-1 కిరీటాన్ని వదులుకోవాల్సి వచ్చింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
