AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: క్రికెట్‌తో పిచ్చెక్కించిన కుక్కలు.. కిక్కెక్కించే క్యాచ్‌లు చూస్తే మైండ్ బ్లాకే..!

Dogs Playing Cricket Video: సౌకర్యాలు లేవని నిరాశపడకుండా తమ వద్ద ఉన్న వనరులతోనే ఎంతో ఆనందంగా ఆడుకుంటున్న ఈ పిల్లల సృజనాత్మకత ప్రశంసనీయం. జంతువులు, మనుషుల నడుమ ఉన్న ఈ అనుబంధం, క్రీడాస్ఫూర్తి సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది.

Video: క్రికెట్‌తో పిచ్చెక్కించిన కుక్కలు.. కిక్కెక్కించే క్యాచ్‌లు చూస్తే మైండ్ బ్లాకే..!
Dogs Cricket Video
Venkata Chari
|

Updated on: Aug 07, 2026 | 1:31 PM

Share

Dogs Playing Cricket Video: క్రికెట్ ఆడాలనే కసి ఉంటే చాలు పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా మార్గం సుగమమవుతుంది. కొండ ప్రాంతంలో ప్లేయర్ల కొరత ఎదురవడంతో పల్లెటూరి కుర్రాళ్లు తమ పెంపుడు కుక్కలను ఫీల్డర్లుగా, వికెట్ కీపర్లుగా మార్చేసి మైండ్ బ్లోయింగ్ క్యాచ్‌లతో నెటిజన్లను కట్టిపడేస్తున్నారు.

పచ్చని పర్వతాల నడుమ ఉన్న ఒక మారుమూల గ్రామంలో పల్లెటూరి పిల్లలు సరదాగా క్రికెట్ ఆడుకోవడానికి సిద్ధమయ్యారు. స్టంప్స్ కోసం చెట్టు కొమ్మలు, మట్టి పిచ్‌ను సిద్ధం చేసుకున్నప్పటికీ జట్లకు సరిపడా ఆటగాళ్లు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ అడ్డంకికి ఆ పిల్లలు వెతికిన మార్గం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తమ ఇంట్లో ఉండే పెంపుడు కుక్కలు, చుట్టుపక్కల ఉండే జంతువులను ఫీల్డర్లుగా మార్చేసి ఆటను విజయవంతంగా మొదలుపెట్టారు.

ఇవి కూడా చదవండి

వికెట్ల వెనుక గ్లోవ్స్ లేని డోనీలు..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక కుక్క ఏకంగా వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తోంది. గ్లోవ్స్ లేకపోయినా, బ్యాటర్ మిస్ చేసిన ప్రతీ బంతిని ఎంతో ఏకాగ్రతతో గమనిస్తూ తన పళ్లతో క్యాచ్ పడుతోంది. బౌలర్ రనప్ తీసుకని బంతి విసిరిన క్షణం నుంచి వికెట్ల వెనుక ఆ జంతువు చూపిస్తున్న టైమింగ్, రిఫ్లెక్సెస్ చూసి క్రీడాభిమానులు నోరెళ్లబెడుతున్నారు.

సూపర్ మ్యాన్ క్యాచ్‌లతో షాక్‌తిన్న బ్యాటర్లు..

కేవలం కీపింగే కాకుండా ఫీల్డింగ్‌లోనూ ఈ విశ్వాసంగల జీవులు అద్భుతాలు చేస్తున్నాయి. బ్యాటర్ గాల్లోకి బాదిన షాట్‌ను ఒక కుక్క పరిగెత్తుకెళ్లి నమ్మశక్యం కాని రీతిలో నోటితో క్యాచ్ పట్టుకుని అవుట్ చేసింది. తన షాట్‌కు కుక్క అంతటి పర్ఫెక్ట్ క్యాచ్ పట్టడం చూసి క్రీజులో ఉన్న చిచ్చరపిడుగు నోరెళ్లబెట్టడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాకుండా కొండ రాళ్ల మధ్య దూకుతూ బంతిని పట్టుకుని తెచ్చి మళ్లీ బౌలర్‌కు అందించడం విశేషం.

నెటిజన్లను ఆకట్టుకుంటున్న వీడియో..

‘ముఫద్దల్ వోహ్రా’ అనే నెటిజన్ ఎక్స్ వేదికగా పంచుకున్న ఈ వీడియో కొన్ని గంటల్లోనే వేలాది లైకులు, లక్షలాది వ్యూస్‌తో ట్రెండింగ్‌గా మారింది. ఒకపక్క ఆవులు మేత మేస్తుంటే, మరోపక్క కుక్కల కీపింగ్, ఫీల్డింగ్ నడుమ పిల్లలు పరుగులు తీస్తున్న ఈ దృశ్యం పల్లెటూరి స్వచ్ఛమైన క్రీడాస్ఫూర్తికి అద్దం పడుతోంది. జంతువుల నుంచి వస్తున్న అద్భుతమైన ప్రతిస్పందనను చూసి ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా వీటిని ఫీల్డింగ్ కోచ్‌లుగా పెట్టుకోవచ్చంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
క్రికెట్‌తో పిచ్చెక్కించిన కుక్కలు, క్యాచ్‌లు చూస్తే మైండ్ బ్లాకే
క్రికెట్‌తో పిచ్చెక్కించిన కుక్కలు, క్యాచ్‌లు చూస్తే మైండ్ బ్లాకే
మీరు తినేదంతా బెల్లం కాదని మీకు తెలుసా..? కల్తీతో జాగ్రత్త!
మీరు తినేదంతా బెల్లం కాదని మీకు తెలుసా..? కల్తీతో జాగ్రత్త!
మొక్కజొన్న మినప గారెలు ఇలా చేశారంటే రెండు ప్లేట్లు లాగిస్తారు..
మొక్కజొన్న మినప గారెలు ఇలా చేశారంటే రెండు ప్లేట్లు లాగిస్తారు..
Ajinkya Rahane: రిటైర్మెంట్ ఇచ్చిన కొద్దిరోజులకే సంచలన నిర్ణయం
Ajinkya Rahane: రిటైర్మెంట్ ఇచ్చిన కొద్దిరోజులకే సంచలన నిర్ణయం
ఈ స్కిల్స్ మీ ఉద్యోగానికి శ్రీరామ రక్ష.. AI యుగంలో జెన్‌జీని..
ఈ స్కిల్స్ మీ ఉద్యోగానికి శ్రీరామ రక్ష.. AI యుగంలో జెన్‌జీని..
పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందా.. వెంటనే ఇలా చేయండి.. చట్టం..
పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందా.. వెంటనే ఇలా చేయండి.. చట్టం..
తెలంగాణపై ఢిల్లీ ఫోకస్‌.. బీజేపీ నెక్స్ట్‌ గేమ్‌ప్లాన్‌ ఇదే!
తెలంగాణపై ఢిల్లీ ఫోకస్‌.. బీజేపీ నెక్స్ట్‌ గేమ్‌ప్లాన్‌ ఇదే!
పిల్లల కోసం ప్రాణాలకు తెగించిన తల్లి పిల్లి.. ఏం చేసిందో చూస్తే
పిల్లల కోసం ప్రాణాలకు తెగించిన తల్లి పిల్లి.. ఏం చేసిందో చూస్తే
ముగియనున్న ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు.. ఎప్పటి వరకు అంటే..!
ముగియనున్న ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు.. ఎప్పటి వరకు అంటే..!
స్కూల్‌లో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి!
స్కూల్‌లో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి!