AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే మొబైల్ నంబర్‌తో రెండు UPI అకౌంట్లు వాడొచ్చా.. ఈ సూపర్ ట్రిక్స్ గురించి తెలుసుకోండి..

గూగుల్ పేలో ఒక బ్యాంక్.. ఫోన్ పేలో మరో బ్యాంక్ అకౌంట్ వాడొచ్చా? స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఒక్కరికీ తరచూ వచ్చే డౌట్ ఇదీ. ఒకే నంబర్‌తో రెండు లేదా అంతకంటే ఎక్కువ UPI అకౌంట్లను అత్యంత సురక్షితంగా నిర్వహించవచ్చని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. అది ఎలా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఒకే మొబైల్ నంబర్‌తో రెండు UPI అకౌంట్లు వాడొచ్చా.. ఈ సూపర్ ట్రిక్స్ గురించి తెలుసుకోండి..
How To Use Two Upi Accounts With One Mobile Number
Krishna S
|

Updated on: Aug 07, 2026 | 1:48 PM

Share

నేటి డిజిటల్ యుగంలో టీ కొట్టు నుంచి పెద్ద మాల్స్ వరకు ప్రతీచోటా యూపీఐ చెల్లింపులే రాజ్యమేలుతున్నాయి. గూగుల్ పే , ఫోన్ పే, పేటీఎం వంటి యాప్‌ల ద్వారా డిజిటల్ లావాదేవీలు చేయడం మన రోజువారీ జీవితంలో భాగమైపోయింది. అయితే చాలామందికి ఒకే మొబైల్ నంబర్‌కు రెండు వేర్వేరు బ్యాంక్ ఖాతాలు లింక్ అయి ఉంటాయి. మరి అలాంటప్పుడు ఒకే నంబర్‌తో రెండు UPI అకౌంట్లు, వాడటం సాధ్యమేనా? దీనికి బ్యాంకింగ్ చట్టాలు ఏం చెబుతున్నాయి? ఒకే నంబర్‌తో రెండు ఖాతాలను ఎలా నిర్వహించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకే నంబర్‌తో రెండు UPI అకౌంట్లు సాధ్యమేనా?

అవును.. ఖచ్చితంగా సాధ్యమే. ఒకే మొబైల్ నంబర్‌కు మీ రెండు బ్యాంక్ అకౌంట్లు లింక్ అయి ఉంటే, మీరు సులభంగా ఆ రెండు అకౌంట్లకు UPI సేవలను యాక్టివేట్ చేసుకోవచ్చు. దీనికి రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి.

ఒకే UPI యాప్‌లో రెండు బ్యాంక్ అకౌంట్లను యాడ్ చేయడం: ఉదాహరణకు ఫోన్ పే లేదా గూగుల్ పేలోనే బ్యాంక్ 1, బ్యాంక్ లింక్ చేయడం.

వేర్వేరు UPI యాప్‌లలో వేర్వేరు అకౌంట్లను ప్రాథమిక ఖాతాగా పెట్టుకోవడం: ఉదాహరణకు గూగుల్ పేలో ఒక బ్యాంక్ అకౌంట్, ఫోన్ పేలో మరో బ్యాంక్ అకౌంట్ ప్రైమరీగా సెట్ చేయడం.

ఒకే యాప్‌లో రెండు బ్యాంక్ ఖాతాలను ఎలా లింక్ చేయాలి?

మీరు ఉపయోగిస్తున్న UPI యాప్‌లో రెండు అకౌంట్లను లింక్ చేయడానికి ఈ క్రింది సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి..

యాప్ ఓపెన్ చేయండి: ముందుగా మీ మొబైల్ లో ఉన్న UPI యాప్‌ను ఓపెన్ చేసి, ప్రొఫైల్ సెక్షన్‌లోకి వెళ్లండి.

Add Bank Account ఎంచుకోండి: Payment Methods లేదా Bank Accounts ఆప్షన్‌లో ఉన్న Add Bank Accountపై క్లిక్ చేయండి.

బ్యాంక్‌ను ఎంచుకోండి: మీ రెండవ ఖాతా ఏ బ్యాంక్‌లో ఉందో ఆ బ్యాంక్ పేరును సెలెక్ట్ చేసుకోండి.

SMS వెరిఫికేషన్: మీ మొబైల్ నంబర్ నుండి సెక్యూరిటీ ఎస్ఎంఎస్ వెరిఫై అవుతుంది.

UPI PIN సెట్ చేయండి: ఒకవేళ కొత్త అకౌంట్ అయితే మీ డెబిట్ కార్డ్ వివరాలు లేదా ఆధార్ కార్డ్ ఆధారంగా కొత్త UPI పిన్ క్రియేట్ చేసుకోండి.

ప్రైమరీ అకౌంట్ సెట్ చేసుకోండి: రెండు అకౌంట్లు యాడ్ అయిన తర్వాత, మీకు ఎవరైనా డబ్బులు పంపినప్పుడు ఏ అకౌంట్‌లో పడాలో దాన్ని Set as Primary Accountగా ఎంచుకోవాలి.

వేర్వేరు యాప్‌లలో వేర్వేరు అకౌంట్లు ఎలా వాడాలి?

ఒకే యాప్‌లో కన్ఫ్యూజ్ కాకుండా ఉండటానికి చాలామంది ఈ విధానాన్ని పాటిస్తారు.

Google Pay: మీ మొదటి బ్యాంక్ అకౌంట్‌ను ప్రైమరీగా సెట్ చేసుకోవచ్చు.

PhonePe: మీ రెండవ బ్యాంక్ అకౌంట్‌ను ప్రైమరీగా సెట్ చేసుకోవచ్చు.

దీనివల్ల Google Pay ద్వారా డబ్బులు వస్తే మొదటి అకౌంట్‌లోకి, PhonePe ద్వారా వస్తే రెండవ అకౌంట్‌లోకి జమ అవుతాయి.

గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు:

నంబర్ లింకింగ్ తప్పనిసరి: మీరు లింక్ చేయాలనుకుంటున్న రెండు బ్యాంక్ అకౌంట్లకు మీ ఒకే మొబైల్ నంబర్ రిజిస్టర్ అయి ఉండాలి.

UPI PIN జాగ్రత్త: రెండు బ్యాంక్ అకౌంట్లకు వేర్వేరు UPI PIN లు ఉంటాయి. ఒకే పిన్ ఉండదు కాబట్టి లావాదేవీలు చేసేటప్పుడు సరైన పిన్ నమోదు చేయాలి.

సిమ్ మొబైల్‌లోనే ఉండాలి: ఏ మొబైల్‌లో అయితే UPI యాప్ వాడుతున్నారో, రిజిస్టర్డ్ సిమ్ కార్డ్ అదే ఫోన్‌లో ఉండటం భద్రత దృష్ట్యా తప్పనిసరి.

ఈ చిన్న ట్రిక్స్ పాటించడం ద్వారా మీరు ఎలాంటి గందరగోళం లేకుండా ఒకే నంబర్‌తో రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాల నుంచి అత్యంత సురక్షితంగా UPI లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.

Follow Us