బెంగళూరులో ఓ ఆన్లైన్ డెలివరీ ఘటన కలకలం రేపింది. పార్సెల్ డెలివరీకి వచ్చిన డెలివరీ బాయ్, ఓ యువతి ఇంటిలోకి బలవంతంగా చొరబడి అసభ్యకరంగా ప్రవర్తించాడు. తెలివిగా ఆ యువతి తన ఫోన్లో ఘటనను రికార్డు చేసింది. మహిళల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తిన ఈ ఘటనపై పోలీసులు, డెలివరీ సంస్థలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.