AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది కదా సినిమా అంటే..! రూ.10లక్షలు పెడితే.. రూ.10కోట్లలకు పైగా కలెక్షన్స్..

కొన్ని సినిమాలు ఇండస్ట్రీలోనే చిరస్థాయిగా నిలిచిపోతుంటాయి. అలాగే మరికొన్ని సినిమాలు ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుంటాయి. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి భారీ కలెక్షన్స్ సొంతం చేసుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. వాటిలో ఈ సినిమా ఒకటి. ఈ సినిమా ఇండస్ట్రీనే షేక్ చేసింది.

ఇది కదా సినిమా అంటే..! రూ.10లక్షలు పెడితే.. రూ.10కోట్లలకు పైగా కలెక్షన్స్..
Movie
Rajeev Rayala
|

Updated on: May 20, 2026 | 8:28 AM

Share

కొన్ని సినిమాలు ఇండస్ట్రీని షేక్ చేస్తుంటాయి. ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు వంద సినిమాలు వస్తే ఒక్కటో రెండో సినిమాలు భారీ హిట్ అవుతున్నాయి. కానీ ఒకప్పుడు మాత్రం పది సినిమాలు విడుదలైతే 7 సినిమాలు సూపర్ హిట్ అయ్యేవి.. వాటిలో కనీసం 5 సినిమాలు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాలు ఖచ్చితంగా ఉంటాయి. దర్శకనిర్మాతలు కూడా ప్రేక్షకులను మెప్పించే కథలతో సినిమాలు చేస్తున్నారు. కలెక్షన్స్ ను దృష్టిలో పెట్టుకోకుండా.. కథను మాత్రమే నమ్మి సినిమాలు తెరకెక్కించేవారు దర్శకనిర్మాతలు.. వాటిలో ఈ సినిమా ఒకటి.. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ హిట్ అవ్వడమే కాదు కలెక్షన్స్ కూడా భారీగా రాబట్టింది ఈ సినిమా.. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.?

ఇది కూడా చదవండి : మూడు పెళ్లిళ్లు చేసుకొని తప్పు చేశా.. టైం అంతా వేస్ట్.. ఇప్పుడు బుద్దొచ్చింది

సినిమా ఇండస్ట్రీలోనే ఈ సినిమా ఓ సెన్సేషన్.. ఈ సినిమాలో స్టార్ హీరో నటించారు. 10లక్షలు పెట్టి తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా రూ. 10కోట్లకు పైగా వసూల్ చేసి సంచలన విజయాన్ని అందుకుంది. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.? ఆ సినిమా మరేదో కాదు స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన సినిమా అది. కమల్ హాసన్ ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు. అంతే కాదు తమిళ్, తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేసి భారీ హిట్స్ అందుకున్నారు. హిందీలో కమల్ హాసన్ నటించిన సినిమా ఇది.. అదే ఇండస్ట్రీని షేక్ చేసిన ఏక్ దుజే కే లియే.

ఇది కూడా చదవండి :RK Roja: ఒక్కహీరో కూడా నాకు లవ్ ప్రపోజ్ చేయలేదు.. కారణం ఏంటో చెప్పిన రోజా

బాలచందర్ దర్శకత్వం తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఈ సినిమా ఓ సెన్సేషన్.. ఈ సినిమా కోసం డిస్టిబ్యూటర్స్ , బయ్యర్స్ ఎగబడ్డారు.. అప్పటికే సౌత్ లో స్టార్ హీరోగా రాణించిన కమల్.. ఈ సినిమాతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చారు. కమల్ హాసన్ సరసన రతి అగ్నిహోత్రి కథానాయికగా నటించారు. అలాగే ఈ సినిమాలో రాకేష్ బేడీ కీలక పాత్రలో కనిపించారు. అయితే ఏక్ దుజే కే లియే సినిమా క్లైమాక్స్ మార్చాలని చాలా మంది డిమాండ్ చేశారు. సినిమా చివరిలో హీరో, హీరోయిన్ చనిపోతారు. దాంతో ఫ్యాన్స్ కాస్త నిరాశపడ్డారు. దాంతో క్లైమాక్స్ చేంజ్ చేయాలని చాలా డిమాండ్స్ వచ్చాయి. కాగా రూ. 10లక్షలు పెట్టి తెరకెక్కించిన ఈ సినిమా రూ. 10కోట్లు వసూల్ చేసింది అప్పట్లోనే రూ. 10కోట్లు అంటే భారీ కలెక్షన్స్.. ఈ సినిమా ఇప్పటికీ చాలా మంది ఫేవరెట్ మూవీ.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :భర్తను దర్శకుడిని చేద్దాం అనుకుంది.. కానీ బెడిసికొట్టింది.. సంపాదించిందంతా పోగొట్టుకొని చివరకు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us