May 18, 2026
Subhash
టికెట్ బుక్ చేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే.. కన్ఫర్మ్డ్ లోయర్ బెర్త్ పొందే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కొన్ని ట్రిక్స్ ఉపయోగిస్తే ఈ సీటు కన్ఫర్మ్ అవుతుంది.
రైల్వే ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్ రైలు బ్యాలెన్స్ , ప్రయాణికుల భద్రతను బట్టి సీట్లను కేటాయిస్తుంది. అందుకే అడిగిన వెంటనే లోయర్ బెర్త్ దొరకడం కష్టం. కోన్ని చిట్కాలు ఉపయోగించాలి.
టికెట్ బుక్ చేసేటప్పుడు ప్రయాణికుల వివరాలు ఇచ్చే చోట బెర్త్ ప్రిఫరెన్స్‌లో తప్పనిసరిగా 'Lower Berth' ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
బుకింగ్ పేజీలో "Book only if at least one lower berth is allotted" (కనీసం ఒక లోయర్ బెర్త్ వస్తేనే బుక్ అవ్వాలి) అనే ఆప్షన్‌ను టిక్ మార్క్ చేయండి.
వయసు పైబడిన వారు (పురుషులు 60 ఏళ్లు, మహిళలు 45 ఏళ్లు పైబడిన వారు) ఒంటరిగా లేదా ఇద్దరు కలిసి ప్రయాణిస్తున్నప్పుడు 'Senior Citizen Quota' కింద బుక్ చేస్తే లోయర్ బెర్త్ ఖాయం.
ప్రయాణ తేదీకి చాలా రోజుల ముందే (ARP - 120 రోజుల ముందు) టికెట్ బుక్ చేసుకుంటే లోయర్ బెర్త్‌లు ఖాళీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చివరి నిమిషంలో బుక్ చేస్తే దొరకడం కష్టం.
ఒకే టికెట్‌పై ఎక్కువ మంది (ఉదాహరణకు 4-6 గురు) బుక్ చేసినప్పుడు, సిస్టమ్ అందరికీ ఒకే చోట సీట్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. అటువంటప్పుడు లోయర్ బెర్త్ మిస్ అవ్వచ్చు.
ఆన్‌లైన్‌లో లోయర్ బెర్త్ రాకపోతే, రైలు ఎక్కిన తర్వాత TTEని కలిసి సమస్యను చెప్పండి. గర్భిణీలు లేదా వృద్ధుల కోసం ఏదైనా లోయర్ బెర్త్ ఖాళీగా ఉంటే వారు కేటాయించే అవకాశం ఉంటుంది.