AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాంకింగ్‌ సంక్షోభం.. RBI కీలక నిర్ణయం! ఏం మారనుందంటే..?

ఆర్‌బీఐ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌కు యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ నిరాకరించింది. బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరత్వం, నష్టభయ నియంత్రణే దీనికి ప్రాథమిక కారణం. అయితే, ఈ నిర్ణయం ఆర్థిక సమ్మిళిత లక్ష్యాలు, చిన్న రుణాలపై ఆధారపడిన గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలను అందించే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల విస్తరణపై ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బ్యాంకింగ్‌ సంక్షోభం.. RBI కీలక నిర్ణయం! ఏం మారనుందంటే..?
Rbi
SN Pasha
|

Updated on: Apr 16, 2026 | 7:30 AM

Share

భారత బ్యాంకింగ్ రంగంలో కీలక పరిణామంగా RBI ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌కు యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ నిర్ణయాన్ని నిపుణులు బ్యాంకింగ్ రంగానికి ఒక ముఖ్యమైన సంకేతంగా భావిస్తున్నారు. ఇటీవలి బ్యాంకింగ్ వ్యవస్థలో ఏర్పడిన అస్థిరత, పెరుగుతున్న నష్టభయాల నేపథ్యంలో ఆర్‌బిఐ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ప్రధానంగా మైక్రోఫైనాన్స్, చిన్న రుణాలపై దృష్టి పెడతాయి. ఈ విభాగాల్లో డిఫాల్ట్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉండటంతో, నిరర్థక ఆస్తులు (NPAలు) పెరిగే అవకాశంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో RBI తీసుకున్న నిర్ణయం, బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరత్వాన్ని కాపాడటంపై దృష్టి సారించినదిగా భావిస్తున్నారు. ముఖ్యంగా రిస్క్ మేనేజ్‌మెంట్‌ను బలోపేతం చేయడం, నష్టాలను నియంత్రించడం వంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ నిర్ణయం ఆర్థిక సమ్మిళిత లక్ష్యాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు, బలహీన వర్గాలకు బ్యాంకింగ్ సేవలను అందించడంలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

అలాంటి బ్యాంకుల విస్తరణకు అడ్డంకులు ఏర్పడితే, ఆ వర్గాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. మొత్తంగా ఈ నిర్ణయం బ్యాంకింగ్ వ్యవస్థను పరిరక్షించే చర్యగా కనిపిస్తున్నప్పటికీ, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల భవిష్యత్తు, అలాగే ఆర్థిక సమ్మిళిత లక్ష్యాలపై దాని ప్రభావం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us