15 April, 2026
Subhash
రైళ్లలో ఎక్కువగా ప్రయాణించే వారికి గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్ర రైల్వే శాఖ. ఇకపై రైలు టిక్కెట్లు డిస్కౌంట్‌కే లభించనున్నాయి.
డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా మాత్రమే ఈ డిస్కౌంట్ లభిస్తుంది. రైల్వే శాఖలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెంపొందించే లక్ష్యంతో తాజాగా డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది ఇండియన్ రైల్వేస్.
ఈ ఆఫర్ అన్ రిజర్వుడ్ టిక్కెట్లకు మాత్రమే వర్తిస్తుంది. అది కూడా రైల్‌వన్ యాప్‌లో బుక్ చేసుకుంటేనే ఈ ఆఫర్ వర్తిస్తుందని గుర్తించుకోండి.
రైలు ప్రయాణికులు రైల్‌వన్ యాప్‌లో డిజిటల్ పేమెంట్ మోడ్‌లో ట్రైన్ టిక్కెట్స్ బుక్ చేసుకున్నట్లయితే 3 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
యూపీఐ, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్ ద్వారా రైల్‌వన్ యాప్ నుంచి టిక్కెట్లు బుక్ చేసుకుని 3 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.
నగదు రహిత సేవల్ని ప్రోత్సహించే లక్ష్యంతో రైల్వే శాఖ ఈ పని చేసింది. ఇది ప్రతి రోజూ తక్కువ దూరాలకు రైళ్లలో ప్రయాణించేవారికి ఉపయోగపడుతుందని రైల్వే విభాగం తెలిపింది.
ఈ ఆఫర్ ఈ ఏడాది జూలై 14 వరకే అందుబాటులో ఉంటుంది. ఈ పేమెంట్ విధానం ద్వారా తక్కువ ధరకే ప్రయాణికులు సులభంగా, తేలికగా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.
ఇది ఒక్క టిక్కెట్‌పై 3 శాతం డిస్కౌంట్‌లా కనిపించినప్పటికీ.. రోజూ ప్రయాణించే వారి కోసం కాబట్టి.. నెలవారీగా చూస్తే మంచి లాభమే ఉంటుందని రైల్వే వర్గాలు అంటున్నాయి.