AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఇంట్లోని తులసి మొక్క ఎండిపోతోందా? పచ్చగా, ఏపుగా పెరగడానికి ఈ 5 చిట్కాలు పాటించండి!

తులసిని హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మొక్కగా భావిస్తారు. అయితే వాతావరణ మార్పుల వల్ల తులసి మొక్క తరచుగా ఎండిపోతుంటుంది. తులసి మొక్క పెరుగుదల ఆగిపోవడానికి గల కారణాలు, దానిని తిరిగి ఎలా చిగురింపజేయాలో తెలిస్తే మీ ఇంట్లోని తులసి కోట ఎప్పుడూ పచ్చగా, కళకళలాడుతూ ఉంటుంది. అదేలాగో ఇప్పుడు చూద్దాం..

మీ ఇంట్లోని తులసి మొక్క ఎండిపోతోందా? పచ్చగా, ఏపుగా పెరగడానికి ఈ 5 చిట్కాలు పాటించండి!
Tulsi Plant Care Tips
Jyothi Gadda
|

Updated on: Apr 16, 2026 | 7:39 AM

Share

తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం. ఇది కేవలం ఆధ్యాత్మిక సంకేతమే కాదు, గొప్ప ఔషధ గుణాలున్న మొక్క కూడా. కానీ చాలామంది తులసి మొక్క త్వరగా ఎండిపోతోందని ఆందోళన చెందుతుంటారు. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కొన్ని సార్లు తులసి మొక్క ఎండిపోవడం లేదా ఆకులు రాలిపోయి మొండిగా తయారవ్వడం జరుగుతుంది. తులసి మొక్క మళ్ళీ చిగురించడానికి మీరు చేయాల్సిన పనులు ఇవే. ఈ సులభమైన గార్డెనింగ్ టిప్స్ పాటిస్తే మీ తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా ఉంటుంది.

తులసిని ఎప్పుడూ పచ్చగా ఉంచుకోవడానికి సరైన మోతాదులో నీరు, సూర్యరశ్మి అవసరం. తులసి మొక్కకు ప్రతిరోజూ నీరు పోయడం ఆచారంగా వస్తోంది. అయితే, కుండీలోని మట్టి మరీ తడిగా ఉంటే నీరు పోయడం ఆపాలి. మట్టి పైపొర ఎండినట్లు అనిపించినప్పుడు మాత్రమే నీరు పోయాలి. డ్రైనేజీ రంధ్రాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి, లేదంటే నీరు నిలిచి వేర్లు కుళ్ళిపోతాయి. అలాగే, తులసి మొక్కపై పూల గుత్తులు (మంజురులు) వచ్చినప్పుడు, మొక్క తన శక్తిని విత్తనాల తయారీకే ఖర్చు చేస్తుంది. దీనివల్ల ఆకులు ఎండిపోవడం మొదలవుతుంది. కాబట్టి, ఆ గుత్తులను ఎప్పటికప్పుడు తుంచేయడం వల్ల మొక్క కొత్త కొమ్మలతో గుబురుగా పెరుగుతుంది.

తులసికి కనీసం 4 నుండి 6 గంటల పాటు ఎండ తగలాలి. ఎండ సరిగ్గా తగలని చోట మొక్క ఎదుగుదల మందగిస్తుంది. అయితే వేసవిలో తీవ్రమైన ఎండ తగలకుండా కొద్దిగా నీడ ఉండేలా చూసుకోవడం మంచిది. కెమికల్ ఎరువులకు బదులుగా ఆవు పేడ ఎరువు లేదా ఇంట్లోనే తయారు చేసిన కంపోస్ట్ ఎరువును నెలకు ఒకసారి వేయాలి. ఇది మొక్కకు కావాల్సిన నైట్రోజన్‌ను అందించి ఆకులు పచ్చగా ఉండేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

తులసికి నల్లటి పురుగులు లేదా ఫంగస్ పట్టినప్పుడు, లీటరు నీటిలో కొద్దిగా వేప నూనె కలిపి ఆకులపై స్ప్రే చేయాలి. ఇది మొక్కను రోగాల నుండి కాపాడుతుంది. తులసి మొక్కను కేవలం భక్తితో పూజించడమే కాకుండా, ఇలాంటి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అది మీ ఇంట్లో ఏడాదంతా పచ్చదనంతో పాటు ఆరోగ్యకరమైన గాలిని కూడా అందిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..