AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్‌పై అభిశంసన అస్త్రం.. పొంచి ఉన్న పదవి గండం!

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్‌‌ను పదవి నుండి తొలగించేందుకు ప్రతిపక్ష డెమోక్రాట్లు ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ సభ్యురాలు యాస్మిన్ అన్సారీ నేతృత్వంలో మరో ఎనిమిది మంది చట్టసభ్యులు మద్దతు తెలిపిన ఈ ఏడు పేజీల తీర్మానం, హెగ్సెత్‌పై ఐదు తీవ్రమైన ఆరోపణలను మోపారు.

అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్‌పై అభిశంసన అస్త్రం.. పొంచి ఉన్న పదవి గండం!
Pete Hegseth, Donald Trump
Balaraju Goud
|

Updated on: Apr 15, 2026 | 6:28 PM

Share

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్‌‌ను పదవి నుండి తొలగించేందుకు ప్రతిపక్ష డెమోక్రాట్లు ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ సభ్యురాలు యాస్మిన్ అన్సారీ నేతృత్వంలో మరో ఎనిమిది మంది చట్టసభ్యులు మద్దతు తెలిపిన ఈ ఏడు పేజీల తీర్మానం, హెగ్సెత్‌పై ఐదు తీవ్రమైన ఆరోపణలను మోపారు. అయితే, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఆయనకు అనుకూలంగా సంఖ్యాబలం లేదు. ఫలితంగా, హెగ్సెత్ పదవి కొనసాగుతుందా లేదా అనే దానిపై సందేహాలు కొనసాగుతున్నాయి.

అమెరికాకు చెందిన ఆక్సియోస్ వార్తా సంస్థ ప్రకారం, హెగ్సెత్‌పై ఐదు తీవ్రమైన ఆరోపణలతో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని హౌస్ ఆఫ్ డెమోక్రాట్స్ నిర్ణయించింది. రక్షణ మంత్రిని కేబినెట్ నుండి తొలగించాలంటే సెనేట్, హౌస్ రెండింటిలోనూ మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం.

హెగ్సెత్‌పై ఉన్న ప్రధాన ఆరోపణలు:

  1. అనధికారిక యుద్ధం: కాంగ్రెస్ అనుమతి లేకుండా ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించారని, దీనివల్ల అమెరికా సైనిక సిబ్బంది ప్రాణాలను ఆయన ప్రమాదంలో పడేశారని ప్రధాన ఆరోపణ.
  2. పౌర మౌలిక సదుపాయాలపై దాడులు: హెగ్సెత్ ఆదేశాల మేరకు అమెరికా సైన్యం ఇరాన్‌లోని పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుందని, ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని డెమోక్రాట్లు పేర్కొన్నారు.
  3. సిగ్నల్‌గేట్ వివాదం: అత్యంత కీలకమైన గూఢచార సమాచారం లీక్ అవ్వడానికి (సిగ్నల్‌గేట్) హెగ్సెత్ నిర్లక్ష్యమే కారణమని తీర్మానం ఆరోపించింది.
  4. సమాచార నియంత్రణ: పెంటగాన్ నుంచి కాంగ్రెస్ ఉభయ సభలకు అందాల్సిన సమాచారాన్ని అడ్డుకున్నారని, వ్యవస్థను తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు.
  5. సైన్యంలో వైవిధ్యానికి విఘాతం: సైన్యంలో వైవిధ్యాన్ని దెబ్బతీస్తూ, పదవిని దుర్వినియోగం చేస్తున్నారని డెమోక్రాట్లు మండిపడుతున్నారు.

ఇదిలావుంటే, నిబంధనల ప్రకారం, రక్షణ మంత్రిని తొలగించాలంటే సెనేట్, హౌస్ రెండింటిలోనూ మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. అంటే సెనేట్‌లో 75 మంది, హౌస్‌లో సుమారు 325 మంది సభ్యుల మద్దతు ఉండాలి. ప్రస్తుతం డెమోక్రాట్లకు ఆ సంఖ్య లేదు. అయితే, ఇరాన్ యుద్ధానికి హెగ్సెత్ కారణమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అసహనం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

గతంలో మాజీ అంతర్గత వ్యవహారాల కార్యదర్శి క్రిస్టీ నోమ్, అటార్నీ జనరల్ పోమ్ బాండి వంటి అధికారులపై ఇలాంటి చర్యలు ప్రారంభమైనప్పుడు, చర్చకు ముందే ట్రంప్ వారిని తొలగించారు. ఇప్పుడు రిపబ్లికన్ సభ్యులు కూడా డెమోక్రాట్లతో చేతులు కలిపితే, హెగ్సెత్ పదవి కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఆయన భద్రతపై నీలి నీడలు కమ్ముకున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us