Garlic and Ginger Soup: అల్లం-వెల్లుల్లి సూప్ ని ఇలా చేయండి.. ఎంతో టేస్ట్ తో పాటు హెల్దీ కూడా!

చలి కాలం మొదలవుతుంది. దీంతో వేడి వేడిగా తినాలని, తాగాలని అనిపిస్తూ ఉంటుంది. మరి నోటి రుచి, హెల్దీగా ఉండాలంటే సూప్ ఈజ్ బెస్ట్ అంటున్నారు ఆహార నిపుణులు. అందులోనూ చలి కాలంలో బాడీలో వేడి తగ్గకుండా ఉండాలంటే జింజర్-గార్లిక్ సూప్ చాలా బెస్ట్. ఈ సూప్స్ తాగితే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. అంతే కాకుండా సీజనల్ గా వచ్చే జ్వరం, జలుబు, దగ్గు నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. బాడీలో రోగ నిరోధక శక్తిని..

Garlic and Ginger Soup: అల్లం-వెల్లుల్లి సూప్ ని ఇలా చేయండి.. ఎంతో టేస్ట్ తో పాటు హెల్దీ కూడా!
Soups
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Oct 13, 2023 | 6:36 AM

చలి కాలం మొదలవుతుంది. దీంతో వేడి వేడిగా తినాలని, తాగాలని అనిపిస్తూ ఉంటుంది. మరి నోటి రుచి, హెల్దీగా ఉండాలంటే సూప్ ఈజ్ బెస్ట్ అంటున్నారు ఆహార నిపుణులు. అందులోనూ చలి కాలంలో బాడీలో వేడి తగ్గకుండా ఉండాలంటే జింజర్-గార్లిక్ సూప్ చాలా బెస్ట్. ఈ సూప్స్ తాగితే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. అంతే కాకుండా సీజనల్ గా వచ్చే జ్వరం, జలుబు, దగ్గు నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. బాడీలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఈ సూప్. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చలి కాలంలో వేడి వేడిగా తాగితే హాయిగా ఉంటుంది. కేవలం 10, 15 నిమిషాల్లో ఈ సూప్ రెడీ అవుతుంది. మరి ఈ అల్లం-వెల్లలి సూప్ ని ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

అల్లం – వెల్లుల్లి సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:

అల్లం, వెల్లుల్లి, నెయ్యి లేదా నూనె, కొత్తి మీర, మిరియాల పొడి లేదా మిరియాలు, క్యారెట్ ముక్కలు, నీళ్లు, ఉప్పు, కార్న్ ఫ్లోర్.

ఇవి కూడా చదవండి

సూప్ తయారీ విధానం:

ముందుగా అల్లం, వెల్లుల్లి తీసుకుని రోట్లో వేసి దంచి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మిరియాలను కూడా వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో కార్న ఫ్లోర్, కొద్దిగా నీళ్లు వేసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు సాస్ పాన్ తీసుకుని అందులో నెయ్యి వేసుకుని.. వేడెక్కాక.. దంచిన అల్లం, వెల్లుల్లిని వేసి చిన్న మంటపై ఓ రెండు నిమిషాలు వేయించుకోవాలి. ఆ తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసి మరొ కొద్ది సేపు వేయించుకోవాలి. మీకు తగిన విధంగా నీళ్లు పోసుకుని అందులో ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ నీటిని ఓ పది నిమిషాలు మధ్యస్థ మంటలపై మరిగించాలి. ఇలా మరిగిన తర్వాత ఇందు లో కార్న్ ఫ్లోర్ నీటిని వేయాలి. ఇప్పుడు ఈ సూప్ ని మీడియం మంటపై మూడు నిమిషాలు దగ్గర ఉండి కలుపుతూ ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొత్తి మీర వేసి చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అల్లం – వెల్లుల్లి సూప్ రెడీ అవుతుంది. దీన్ని చలి కాలం, వర్షా కాలంలో తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

రేపు మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం