Fashion Tips: మీరు ఫ్యాషన్ గా కనిపించాలనుకుంటున్నారా.. అయితే ఈ వస్తువులు మీ దగ్గర ఉండాల్సిందే!

ప్రస్తుతం ఇప్పుడున్న ఫ్యాషన్ ప్రపంచంలో అందరితో పాటు మనం కూడా ముందుకు వెళ్లాలంటే దానికి మన లుక్ కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ఫ్యాషన్ గా కనిపించడం తప్పేం కాదు. చిన్న చిన్న టిప్స్ ను పాటిస్తే ఫ్యాషన్ గా ఉండొచ్చు. అందరినీ ఎట్రాక్ట్ చేయవచ్చు. ఫ్యాషన్ గా ఉండటానికి వయసుతో సంబంధం ఉండదు. బట్టలు, హెయిర్ స్టైల్స్, హ్యాండ్ బ్యాగ్స్, వాచెస్, జ్యువెలరీ, యాక్సెసరీస్ వంటి వాటిని యూనిక్ గా ఎంచుకుంటూ ఉంటే మనమే ఫ్యాషన్ గా..

Fashion Tips: మీరు ఫ్యాషన్ గా కనిపించాలనుకుంటున్నారా.. అయితే ఈ వస్తువులు మీ దగ్గర ఉండాల్సిందే!
Fashion
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 12, 2023 | 9:55 PM

ప్రస్తుతం ఇప్పుడున్న ఫ్యాషన్ ప్రపంచంలో అందరితో పాటు మనం కూడా ముందుకు వెళ్లాలంటే దానికి మన లుక్ కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ఫ్యాషన్ గా కనిపించడం తప్పేం కాదు. చిన్న చిన్న టిప్స్ ను పాటిస్తే ఫ్యాషన్ గా ఉండొచ్చు. అందరినీ ఎట్రాక్ట్ చేయవచ్చు. ఫ్యాషన్ గా ఉండటానికి వయసుతో సంబంధం ఉండదు. బట్టలు, హెయిర్ స్టైల్స్, హ్యాండ్ బ్యాగ్స్, వాచెస్, జ్యువెలరీ, యాక్సెసరీస్ వంటి వాటిని యూనిక్ గా ఎంచుకుంటూ ఉంటే మనమే ఫ్యాషన్ గా కనిపిస్తాం. ఫ్యాషన్ గా ఉండాలనుకునే వారికి ఈ టిప్స్ కూడా బాగా హెల్ప్ చేస్తాయి. మరి అవేంటో ఓ లుక్ వేసేయండి.

సన్ గ్లాసెస్:

సన్ గ్లాసెస్ మన అందాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. అంతే కాకుండా కళ్లకు కూడా రక్షణగా ఉంటాయి. వీటిని పెట్టుకోవడం వల్ల మరింత ఫ్యాషన్ గా ఉంటారు. సన్ గ్లాసెస్ ని ఎండలో వెళ్తున్నప్పుడు, బైక్ లపై వెళ్లేటప్పుడు కూడా పెట్టుకోవచ్చు. సన్ గ్లాసెస్ లో చాలా రకాలు ఉంటాయి. వాటిలో మనకు బాగా సూట్ అయ్యేవి.. బ్యూటీని పెంచేవి ఎంచుకుంటే మనమే ఫ్యాషన్ గా కనిపిస్తాం.

ఇవి కూడా చదవండి

వాచెస్:

మనల్ని క్లాసీ లుక్ లో, ఫ్యాషన్ గా కనిపించేలా చేయడంలో వాచెస్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందులోనూ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరూ వాచెస్ ని పెట్టుకుంటున్నారు. వాచెస్ అంటే చాలా మందికి ఇష్టం కూడా. కొంత మంది దగ్గర వాచెస్ కు సంబంధించి మంచి కలెక్షన్ ఉంటుంది. వాచెస్ ని ఎంచుకునే ముందు.. మీకు సూట్ అయ్యే వాటిని ఎంచుకుంటే అది మీ లుక్ నే మార్చేస్తుంది. బ్రాండెడ్ వాచెస్ అయితే లుక్కే మారిపోతుంది.

హ్యాండ్ బ్యాగ్స్:

హ్యాండ్ బ్యాగ్స్ అనేవి కూడా ఫ్యాషన్ ని ఎలివేట్ చేస్తాయి. కొంత మంది లేడీస్ దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అనేది చాలా ఉంటుంది. డ్రెస్సెస్, శారీస్, జీన్స్ ఇలా దేనికి తగ్గట్టుగా మంచి హ్యాండ్ బ్యాగ్ ను వేర్ చేస్తే మీరే ఎట్రాక్షన్ గా, ఫ్యాషన్ గా కనిపిస్తారు. ఒక్కటే కాకుండా.. ఓ రెండు, మూడింటిని మీ బడ్జెట్ లో కాస్త క్లాసీగా కనిపించే వాటిని ఎంచుకోవచ్చు. వాటిని అకేషన్ బట్టి.. మారుస్తూ ఉంటే సరి. మీరు బయటకు వెళ్లేటప్పుడు కావాల్సిన వస్తువులు పట్టేలా మీ హ్యాండ్ బ్యాగ్ ను ఎంచుకోండి. అప్పుడు ఇబ్బంది ఉండదు.

జ్యువెలరీ:

మనం పెట్టుకునే జ్యువెలరీ కూడా మనల్ని ఫ్యాషన్ గా కనిపించేలా చేస్తాయి. బ్యాంగిల్స్, రింగ్స్, చెవి కమ్మలు, నెక్ పీస్ వంటివి మనల్ని మరింత ఫ్యాషన్ గా కనిపించేలా చేస్తాయి. కాబట్టి మీకు సూట్ అయ్యే జ్యువెలరీ తీసుకుంటే బెటర్.

చెప్పులు:

కాళ్లకు వేసుకునే చెప్పులు కూడా మన స్టైల్ ని మార్చేస్తాయి. చెప్పుల్లో చాలా రకాలు ఉంటాయి. జీన్స్ వంటి వాటిపై షూస్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. దుప్పటా, డ్రెస్సెస్ మీదకు సింపుల్ వేర్ సూట్ అవుతుంది. ఇలా మీ బట్టలను బట్టి మీ చెప్పులను మార్చుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..