Periods Care: నెలసరి సరిగా రావడం లేదా.. ఆ సమయంలో ఇబ్బందిగా ఉందా.. ఈ ఆసనాలు వేస్తే పరార్ అవుతాయి!!
ఆడవారికి పీరియడ్స్ అనేవి చాలా ముఖ్యం. ఈ సైకిల్ సరిగ్గా లేకపోతే.. అనేక అనారోగ్య సమస్యలకు గురి కావాల్సి వస్తుంది. ఈ సమస్యలు మొదట్లో కనిపించకపోయినా.. దీర్ఘకాలికంగా మాత్రం ఎదుర్కొనవలసి ఉంటుంది. కాబట్టి ఆడవారిలో నెలసరి అనేది చాలా ఇంపార్టెంట్. అయితే చాలా మంది పీరియడ్స్ అంటే భయపడతారు. అందుకు కారణం ఆ సమయంలో వచ్చే నీరసం, అలసట, చిరాకు, పొత్తి కడుపులో నొప్పి, రక్త స్రావం, నొడుం నొప్పి ఇలా అనేక కారణాలు ఉంటాయి. దీంతో చాలా..
ఆడవారికి పీరియడ్స్ అనేవి చాలా ముఖ్యం. ఈ సైకిల్ సరిగ్గా లేకపోతే.. అనేక అనారోగ్య సమస్యలకు గురి కావాల్సి వస్తుంది. ఈ సమస్యలు మొదట్లో కనిపించకపోయినా.. దీర్ఘకాలికంగా మాత్రం ఎదుర్కొనవలసి ఉంటుంది. కాబట్టి ఆడవారిలో నెలసరి అనేది చాలా ఇంపార్టెంట్. అయితే చాలా మంది పీరియడ్స్ అంటే భయపడతారు. అందుకు కారణం ఆ సమయంలో వచ్చే నీరసం, అలసట, చిరాకు, పొత్తి కడుపులో నొప్పి, రక్త స్రావం, నొడుం నొప్పి ఇలా అనేక కారణాలు ఉంటాయి. దీంతో చాలా మంది నెలసరి సమయం వస్తుందంటే మాత్రం చాలా భయపడతారు. ఇంకొంత మందికి నెలసరి రెగ్యులర్ గా రాదు. రెండు నెలలకు లేదా మూడు నెలలకు కూడా వస్తుంది. ఇటువంటి వారికి గర్భం రావాలన్నా, నిలవాలన్నా కష్టమే. ఇలా పీరియడ్స్ కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే ఈ ఆసనాలు మీకు ఎంతో హెల్ప్ అవుతాయి. మీకున్న సమయంలో ఓ పది నిమిషాలు వీటికి కేటాయిస్తే.. అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. మరి ఇంకెందుకు లేట్ ఆ ఆసనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ధనురాసనం:
ధనురాసనం గురించి మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. ఎలా వేయాలో కూడా తెలుసుకున్నాం. ఈ ఆసనంతో కేవంల పీరియడ్స్ సమస్యలే కాకుండా ఇతర అనారోగ్య సమస్యల నుంచి కూడా బయట పడొచ్చు.
ఈ ఆసనాన్ని వేయాలంటే..
నిటారుగా కాకుండా.. తిరిగి పొట్ట భాగం కింద ఉండేలా పడుకోవాలి. ఆ తర్వాత మోకాళ్లను పైకి చేతులతో పట్టుకోవాలి. కేవలం పొట్ట మీదనే ఉండాలి. ఇలా కొన్ని సెకన్ల పాటు చేస్తే సరి.
భుజంగాసనం:
ఈ భుజంగాసనం గురించి కూడా మనం ఇది వరకే తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఆసనంతో నెలసరి సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. ఈ ఆసనం వల్ల నడుం నొప్పి, వెన్ను సమస్యలు ఉండవు.
ఈ ఆసనం వేయడం చాలా సింపుల్:
మీ పొట్టను నేలకు ఆనించి నిటారుగా పడుకోవాలి. ఇప్పుడు నాభి భాగంపై బరువు ఉంచి అరి చేతులను కిందకు ఆనించి పెట్టాలి. కాళ్లను నిటారుగా అలానే ఉంచాలి. పడగ విప్పిన నాగు పాము ఎలా అయితే ఉంటుందో ఈ ఆసనం కూడా అలానే వేయాలి.
మలాసనం:
ఆ ఆసనం వేయడం చాలా సింపుల్. ఆ ఆసనం వేయడం వల్ల కూడా రుతుక్రమ సమస్యలను దూరం పెట్టవచ్చు. దీని వల్ల మోకాళ్ల నొప్పులు, నడుం నొప్పులు ఉండవు.
ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే:
ముందుగా పాత స్టైల్ బాత్రూమ్ కు వెళ్లే ఆకారంలో కూర్చొవాలి. ఇప్పుడు మీ కాళ్లను, చేతులను వెడల్పుగా ఉంచాలి. మోకాళ్లపై చేతి ముంజేతులు ఉంచి నమస్కారం పెట్టాలి. అంతే ఈ ఆసనం వేయడం చాలా ఈజీ.
ఇలా రోజూ ఒకసారైనా ఈ ఆసనాలను మహిళలు వేయడం వల్ల రుతు క్రమంలో వచ్చే ఇబ్బందులకు దూరంగా ఉండొచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.