Beauty Tips: ఫేస్ వాష్ ని బయట కొంటున్నారా.. ఇకపై అవసరం లేదు.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!!
అందంగా కనిపించాలని, ఉండాలని అనుకోని వారుండరు. అందులోనూ శరీరంలో ముఖ్యంగా కనిపించేది ఫేస్. చూడగానే ఫేస్ అందంగా కనిపిస్తే.. ఎదుటివారికి మనపై ఉండే ఇంప్రెషనే మారిపోతుంది. అందుకే ముఖాన్ని అందంగా కనిపించేలా చేయాలని ఆరాట పడుతూంటారు. దీంతో బ్యూటీ పార్లర్ లకి, బయట దొరికే క్రీమ్స్, లోషన్స్, ఫేస్ వాష్ లు కొంటూ అంటారు. ఇప్పుడైతే టైమ్ అన్నింటినీ బయట నుంచే తెచ్చుకుంటున్నారు కానీ.. పూర్వం అయితే అన్నింటినీ ఇంట్లోనే తయారు చేసుకుని.. ముఖాన్ని కాపాడుకునే వారు. ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవాలంటే రోజుకు రెండు సార్లైనా ఫేస్ ని క్లీన్..
అందంగా కనిపించాలని, ఉండాలని అనుకోని వారుండరు. అందులోనూ శరీరంలో ముఖ్యంగా కనిపించేది ఫేస్. చూడగానే ఫేస్ అందంగా కనిపిస్తే.. ఎదుటివారికి మనపై ఉండే ఇంప్రెషనే మారిపోతుంది. అందుకే ముఖాన్ని అందంగా కనిపించేలా చేయాలని ఆరాట పడుతూంటారు. దీంతో బ్యూటీ పార్లర్ లకి, బయట దొరికే క్రీమ్స్, లోషన్స్, ఫేస్ వాష్ లు కొంటూ అంటారు. ఇప్పుడైతే టైమ్ అన్నింటినీ బయట నుంచే తెచ్చుకుంటున్నారు కానీ.. పూర్వం అయితే అన్నింటినీ ఇంట్లోనే తయారు చేసుకుని.. ముఖాన్ని కాపాడుకునే వారు. ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవాలంటే రోజుకు రెండు సార్లైనా ఫేస్ ని క్లీన్ చేసుకోవాలి. లేకపోతే ముఖంపై దుమ్ము, ధూళి, డెడ్ స్కిన్ సెల్స్ అనేవి అలానే ఉండి.. ముఖాన్ని అందవిహీనంగా మార్చేస్తాయి. అయితే అప్పటికప్పుడు ఫేస్ లో గ్లోని తీసుకు రావడానికి మార్కెట్లో లభ్యమయ్యే క్లెన్సర్లు, ఫేస్ వాష్ లను ఉపయోగిస్తూంటారు. వీటిలో ఎక్కువగా రసాయనాలను కలుపుతారు. వీటి వలన పింపుల్స్, ఇతర స్కిన్ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. కాబట్టి ఇలాంటి కెమికల్స్ కలిపిన ప్రోడెక్ట్స్ వాడ కుండా.. ఇంట్లో లభించే వాటితోనే క్లీన్ చేసుకోవడం వల్ల చర్మం హెల్దీగా, గ్లోగా ఎక్కువ కాలం ఉంచుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
దోసకాయ రసం:
మీ ముఖాన్ని శుభ్ర పరుచుకోవడానికి కెమికల్స్ ఉన్న ఫేస్ వాష్ కంటే.. దోస కాయ రసం బాగా ఉపయోగ పడుతుంది. దోస కాయ రసం ముఖంలోని మురికిని, అదనపు జిడ్డును తొలగించి.. ఫేస్ ని ఫ్రెష్ గా ఉంచేలా చేస్తుంది. దోసకాయ రసంలో, నాలు చుక్కల నిమ్మ రసాన్ని కలిపి కాటన్ సహాయంతో ముఖం అంతా పట్టించి.. తర్వాత నీళ్లతో కడుక్కోవాలి.
తేనె:
చర్మాన్ని గ్లోగా ఉంచడంలో తేనె బాగా హెల్ప్ చేస్తుంది. ఇది చర్మంపై ఉండే బ్యాక్టీరియా, మురికిని శుభ్రం చేసి స్కిన్ ని మెరిసేలా చేస్తుంది. కొద్దిగా తేనెను తీసుకుని ముఖానికి బాగా పట్టించి.. రెండు, మూడు నిమిషాలు మృదువుగా మసాజ్ చేయాలి. ఓ పది నిమిషాలు ఆగి.. నీటితో ముఖం క్లీన్ చేసుకోవడమే.
పెరుగు:
పెరుగు కూడా ముఖా సౌందర్యాన్ని రెట్టింపు చేయడంలో బాగా హెల్ప్ చేస్తుంది. పెరుగు ముఖంపై ట్యానింగ్, మచ్చలను తొలగిస్తుంది. కొద్దిగా పెరుగును తీసుకుని దీన్ని ముఖం అంతా పట్టించి.. సున్నితంగా మర్దనా చేసుకుని కాసేపు ఆగి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే ఫేస్ పై ఉంటే ట్యాన్ పోతుంది.
పాలు:
పాలు అద్భుతమైన క్లెన్సర్ గా పని చేస్తాయి. పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ని ఈజీగా తొలగించి, ముఖాన్ని శుభ్ర పరుస్తుంది. అంతే కాకుండా ఫేస్ ని మృదువుగా, షైనీగా చేస్తుంది. ఇందుకోసం కాటన్ సహాయంలో ముఖానికి పాలను పట్టించి, కాసేపు మృదువుగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీటితో ముఖాన్ని క్లీన్న చేసుకోవాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.