Gunugu Pulu Benefits: గునుగు పూలతో బతుకమ్మనే కాదు.. ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు!
బతుకమ్మను తయారు చేయడంలో ముఖ్యంగా ఉపయోగించే పూలలో గునుగు పూలు కూడా ఒకటి. గునుగు పూలంటే తెలియని వారుండరు. గునుగు పూలతో బతుకమ్మకే అందం వస్తుంది. తెల్లగా పిండి ఆరబోసినట్టు గునుగు పూలను దూరం నుంచి చూస్తేనే అందంగా కనిపిస్తాయి. పల్లెటూర్లలో ఎక్కువగా ఇవి లభ్యమవుతాయి. గునుగు పూలకు ఎంతో చరిత్ర ఉంది. పూర్వం నుంచి బతుకమ్మను పేర్చుకోవడానికి గునుగు పూలను ఉపయోగిస్తున్నారు. అయితే గునుగు పూలతో కేవలం..
బతుకమ్మను తయారు చేయడంలో ముఖ్యంగా ఉపయోగించే పూలలో గునుగు పూలు కూడా ఒకటి. గునుగు పూలంటే తెలియని వారుండరు. గునుగు పూలతో బతుకమ్మకే అందం వస్తుంది. తెల్లగా పిండి ఆరబోసినట్టు గునుగు పూలను దూరం నుంచి చూస్తేనే అందంగా కనిపిస్తాయి. పల్లెటూర్లలో ఎక్కువగా ఇవి లభ్యమవుతాయి. గునుగు పూలకు ఎంతో చరిత్ర ఉంది. పూర్వం నుంచి బతుకమ్మను పేర్చుకోవడానికి గునుగు పూలను ఉపయోగిస్తున్నారు. అయితే గునుగు పూలతో కేవలం బతుకమ్మనే తయారు చేస్తారనుకుంటే మాత్రం పొరపాటే. గునుగు పూలతో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడమే కాకుండా.. ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. గునుగు పూల శాస్త్రీయ నామం.. సెలోసియా. వీటిల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా వీటిని ఉపయోగించేవారు. గునుగు పూలతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రక్త పోటును కంట్రోల్ చేయవచ్చు:
ఆయుర్వేదంలో కూడా గునుకు పూలను విరివిగా ఉపయోగిస్తారు. ఆయుర్వేద ప్రకారం గునుగు పూలు రక్తం ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. దీంతో రక్త పోటు కంట్రోల్ చేసుకోవచ్చు.
గాయాలకు త్వరగా తగ్గుతాయి:
అప్పుడప్పుడు గాయాలు తగులుతూ ఉంటాయి. అలాంటప్పుడు ట్యాబ్లెట్స్ కాకుండా.. గునుగు పూల పేస్ట్ ని గాయాలు ఉన్న చోట రాస్తే త్వరగా మానుతాయి. గాయాలు తగిలినప్పుడు గునుగు పూలు ఫస్ట్ ఎయిడ్ గా పని చేస్తాయి
క్షయ వ్యాధి నివారణకు:
క్షయ వ్యాధి నివారణకు గునుగు పూలు చక్కగా పని చేస్తాయి. పూర్వం క్షయ వ్యాధికి గునుగు పూలను విరివిగా వాడే వారు. అంతే కాకుండా దగ్గు, డయేరియా వంటి వాటిని కూడా తగ్గించుకోవచ్చు.
చర్మ సమస్యలు:
గునుగు పూలు చర్మ సమస్యల నివారణకు చక్కగా పని చేస్తుంది. చర్మంపై మచ్చలు, డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగిస్తుంది.
జీర్ణ సమస్యలు ఉండవు:
గ్రామాల్లో గునుగు పూల ఆకులను కూరగా వండుకుని తినేవారు. ఎందుకంటే ఈ ఆకుల్లో యాంటీ డయాబెటిక్, బ్యాక్టీరియా, మైక్రోబయట గుణాలను కలిగి ఉండేవి. అంతే కాకుండా మల బద్ధకం, జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే గునుగు ఆకులతో చేసిన కూర తింటే నార్మల్ డెలివరీ తింటే అవుతుందని పెద్దలు అంటూండేవారు. రక్త విరోచనాలు, అతి స్రావం, రక్త స్రావం తగ్గుతుంది.
కంటి సమస్యలకు:
కంటి సంబంధిత సమస్యలు తగ్గించుకునేందుకు మందుల తయారీలో గునుగ గింజలను ఉపయోగిస్తూంటారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.