AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Instant Vada: పిండి రుబ్బకుండా అప్పటికప్పుడు వడలు చేయాలా? అయితే ఈ పొడిని తయారు చేసుకోండి!

టిఫిన్ గా, స్నాక్ గా, డిన్నర్ గా ఏ టైమ్ లో నైనా తినే ఐటెమ్ వడలు. వీటినే గారెలు అని కూడా అంటారు. అలా వేడి వేడి గారెల్లో కోడి కూర వేసుకుని తింటే ఆహా అనాల్సిందే. ఆ కాంబినేషనే వేరు. కోడి కూరలో గారె ముంచుకుని తింటే.. తినేకొద్దీ తినాలనిపిస్తుంది. ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినా కూడా వీటినే స్నాక్స్ గా వేస్తారు. అయితే ఇప్పుడున్న హడావిడిలో అప్పటికప్పుడు గారెలు వేసుకోవాలంటే కాస్త ప్రాసెస్ ఉంటుంది. మినప పప్పు నాన బెట్టుకుని.. రుబ్బి వేసుకోవాలంటే..

Instant Vada: పిండి రుబ్బకుండా అప్పటికప్పుడు వడలు చేయాలా? అయితే ఈ పొడిని తయారు చేసుకోండి!
Vada Podi Recipe
Chinni Enni
| Edited By: |

Updated on: Oct 10, 2023 | 7:15 AM

Share

టిఫిన్ గా, స్నాక్ గా, డిన్నర్ గా ఏ టైమ్ లో నైనా తినే ఐటెమ్ వడలు. వీటినే గారెలు అని కూడా అంటారు. అలా వేడి వేడి గారెల్లో కోడి కూర వేసుకుని తింటే ఆహా అనాల్సిందే. ఆ కాంబినేషనే వేరు. కోడి కూరలో గారె ముంచుకుని తింటే.. తినేకొద్దీ తినాలనిపిస్తుంది. ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినా కూడా వీటినే స్నాక్స్ గా వేస్తారు. అయితే ఇప్పుడున్న హడావిడిలో అప్పటికప్పుడు గారెలు వేసుకోవాలంటే కాస్త ప్రాసెస్ ఉంటుంది. మినప పప్పు నాన బెట్టుకుని.. రుబ్బి వేసుకోవాలంటే సమయం ఎక్కువ పడుతుంది. ఇలా కాకుండా అప్పటికప్పుడు వేసుకోవాలంటే.. వడ పిండిని ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోవచ్చు. దీన్ని అప్పటికప్పుడు మిక్స్ చేసుకుని గారెలు వేసుకోవచ్చు. మరి ఆ వడ పిండిని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

వడ పొడికి కావాల్సిన పదార్థాలు:

మినపప్పు, వంట సోడా, ఉప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తి మీర, జీలకర్ర, నూనె.

ఇవి కూడా చదవండి

వడ పొడి తయారీ విధానం:

ముందుగా మినపప్పును శుభ్రంగా కడిగి.. తడి లేకుండా ఆర బెట్టుకోవాలి. ఆరిన తర్వాత వీటిని ఒక కళాయిలో బాగా వేయించుకోవాలి. ఈ పప్పు చల్లారాక.. మిక్సీలో వేసి వీలైనంత మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పిండికి గాలి తగలకుండా.. ఓ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. దాదాపుగా ఈ పిండి మూడు నుంచి 4 నెలల వరకూ నిల్వ ఉంటుంది. ఈ పిండితో తయారు చేసుకున్న వడలు కూడా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి.

ఇప్పుడు ఈ పొడితో ఎలా వడలు తయారు చేసుకోవాలో చూద్దాం. మీకు కావాల్సినంత క్వాంటిటీ పిండి తీసుకుని అందులో తగినన్ని నీళ్లు పోసుకుని, కలుపుకుని ఓ అరగంట సేపు పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పిండిలో వంట సోడా, ఉప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తి మీర, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. నెక్ట్స్ వడల మాదిరి ఒత్తుకుని వేడి నూనెలో వేసుకుని.. రెండు వైపులా బాగా వేయించుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే వడలను అప్పటికప్పుడు ఇలా రెడీ చేసుకోవచ్చు. గెస్టులు వచ్చినా నో ప్రాబ్లమ్. ఇవి క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. వీటిని చట్నీ, సాంబార్, కోడి కూరతో ఎలా తిన్నా సూపర్ గా ఉంటాయి. ఓ సారి మీరు కూడా ఇలా చేసి చూడండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

ఖడ్గం సినిమాలో ఆ సీన్ ఎందుకు పెట్టామంటే..
ఖడ్గం సినిమాలో ఆ సీన్ ఎందుకు పెట్టామంటే..
మారిన టోల్ ఛార్జీ రూల్స్.. కట్టకపోతే ఆ సేవలు బంద్
మారిన టోల్ ఛార్జీ రూల్స్.. కట్టకపోతే ఆ సేవలు బంద్
కేతు సంచారంతో ఈ రాశుల వారికి ఇక స్వర్ణయుగమే..! మీ రాశి ఉందా..?
కేతు సంచారంతో ఈ రాశుల వారికి ఇక స్వర్ణయుగమే..! మీ రాశి ఉందా..?
హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..