Sesame Seeds Benefits: బరువు తగ్గడానికి హెల్ప్ చేసే నువ్వులు.. ఇంకా ఎన్నో విధాలుగా హెల్ప్ అవుతాయి!

ప్రస్తుతం ఇప్పుడు అందరూ ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో బరువు తగ్గేందుకు రక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొంత మంది వైద్యులను సంప్రదించి.. మెడికేషన్ తీసుకుంటున్నారు. కానీ వీటితో దీర్ఘకాలికంగా అనేక సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. అదే నేచురల్ టిప్స్ ను పాటిస్తే కనుక ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా బరువు తగ్గొచ్చు. కానీ కాస్త సమయం పడుతుంది. బరువు పెరగడం సింపుల్ కానీ.. తగ్గడం చాలా కష్టం. బరువు తగ్గాలనుకునే వారు..

Sesame Seeds Benefits: బరువు తగ్గడానికి హెల్ప్ చేసే నువ్వులు.. ఇంకా ఎన్నో విధాలుగా హెల్ప్ అవుతాయి!
Sesame Seeds
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Oct 05, 2023 | 8:00 PM

ప్రస్తుతం ఇప్పుడు అందరూ ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో బరువు తగ్గేందుకు రక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొంత మంది వైద్యులను సంప్రదించి.. మెడికేషన్ తీసుకుంటున్నారు. కానీ వీటితో దీర్ఘకాలికంగా అనేక సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. అదే నేచురల్ టిప్స్ ను పాటిస్తే కనుక ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా బరువు తగ్గొచ్చు. కానీ కాస్త సమయం పడుతుంది. బరువు పెరగడం సింపుల్ కానీ.. తగ్గడం చాలా కష్టం. బరువు తగ్గాలనుకునే వారు జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. హెల్దీ డైట్ మెయిన్ టైన్ చేస్తూ చక్కగా ఎక్సర్ సైజ్ చేస్తే నెల రోజుల్లోనే మీకు మంచి ఫలితం కనిపిస్తుంది.

అలాగే బరువు తగ్గాలని ఒక్కసారే తిండిని తగ్గించకూడదు. కొద్ది కొద్దిగా తగ్గిస్తూ ఉండాలి. లేదంటే ప్రాణానికే ప్రమాదం. బరువు తగ్గేందుకు మనం చాలా రకాల టిప్స్ ను తెలుసుకున్నాం. ఇప్పుడు వంటింట్లో లభ్యమయ్యే నువ్వులు కూడా బరువు తగ్గేందుకు మనకు హెల్ప్ చేస్తాయి. నువ్వుల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి నల్లవి మరొకటి తెల్లవి. ఈ రెండింటిలో కూడా పోషకాలు, ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. క్యాల్షియం, ఐరన్, జింక్, ఫైబర్, మెగ్నీషియం, ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ లభ్యమవుతాయి. ఇక నువ్వులతో మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.

బరువు తగ్గుతారు:

ఇవి కూడా చదవండి

నువ్వుల్లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే నువ్వుల్లో ఉండే లిగ్నాన్స్ కూడా బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. ఇవి బాడీలో కొవ్వును కరిగిస్తుంది. నువ్వులతో చేసిన ఆహారం కొద్దిగా తిన్నా.. పొట్ట నిండిన ఫీలింగ్ కలుతుంది. దీంతో త్వరగా ఆకలి వేయదు. ఇతర ఆహారంపై కూడా ధ్యాస మల్లదు. కాబట్టి ఈజీగా బరువు తగ్గుతారు.

జీర్ణ శక్తి పెరుగుతుంది:

నువ్వులు తినడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. నువ్వుల్లో ఉండే ఫైబర్ తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తాయి. కాబ్టటి ఆహారం నిల్వ ఉండదు. కొవ్వు పేరుకుపోదు.. కాబట్టి ఉదర సమస్యలు ఉండవు. మలబద్ధకం సమస్య కూడా తగ్గతుంది. ప్రేగులు కూడా శుభ్ర పడతాయి.

మతి మరుపు ఉండదు:

నువ్వుల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నువ్వులు తింటే మతి మరుపు సమస్య తగ్గుతుంది. నాడీ వ్యవస్థ పని తీరు చక్కగా ఉంటుంది.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:

నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి.. బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీని వల్ల ఇతర వ్యాధులతో పోరాడే శక్తి శరీరానికి లభిస్తుంది.

గుండెకు మంచిది:

నువ్వుల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండె హెల్దీగా ఉండేలా చూస్తాయి. అలాగే ట్రై గ్లిజరైడ్స్ ని తగ్గిస్తాయి.

రక్త హీనత సమస్య తగ్గించుకోవచ్చు:

నువ్వుల్లో జింక్, ఐరన్ అనేవి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి నువ్వులు తింటే రక్త హీనత సమస్య దరి చేరకుండా చూసుకోవడమే కాకుండా.. రక్త హీనత సమస్యను కూడా తగ్గిస్తుంది.

పీరియడ్స్ లో నొప్పులను తగ్గిస్తుంది:

చాలా మందికి పీరియడ్స్ లో నడుము నొప్పి, పొత్తి కడుపులో నొప్పి వంటి వస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో నువ్వు, బెల్లం కలిపి తింటే ఆ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.