Eggplants Side Effects రక్త హీనతతో బాధ పడుతున్నారా.. అయితే వంకాయలకు దూరంగా ఉండండి!!
మనం ఉపయోగించే కూరగాయల్లో వంకాయలు కూడా ఒకటి. వంకాయలంటే చాలా మందికి ఇష్టం. వంకాయతో రోటి పచ్చడి చేసినా, పెరుగు పచ్చడి చేసినా కూరలైనా ఏమైనా చాలా టేస్టీగా ఉంటాయి. నాన్ వెజ్ కర్రీల్లో కూడా వంకాయ వేసుకుని వండుతూంటారు. వంకాయతో ఆ కర్రీకి మరింత రుచి యాడ్ అవుతుంది. వంకాయలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వంకాయను మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా చాలా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. వంకాయతో..
మనం ఉపయోగించే కూరగాయల్లో వంకాయలు కూడా ఒకటి. వంకాయలంటే చాలా మందికి ఇష్టం. వంకాయతో రోటి పచ్చడి చేసినా, పెరుగు పచ్చడి చేసినా కూరలైనా ఏమైనా చాలా టేస్టీగా ఉంటాయి. నాన్ వెజ్ కర్రీల్లో కూడా వంకాయ వేసుకుని వండుతూంటారు. వంకాయతో ఆ కర్రీకి మరింత రుచి యాడ్ అవుతుంది. వంకాయలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వంకాయను మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా చాలా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. వంకాయతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. కొన్ని రకాల సమస్యలతో బాధ పడే వారు మాత్రం వంకాయకు దూరంగా ఉంటేనే బెటర్ అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి వంకాయలను ఎవరు తీసుకోకుండా ఉంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
జీర్ణ సమస్యలు:
జీర్ణ సమస్యలు ఉన్న వారు వంకాయలకు దూరంగా ఉండాలి. లేదంటే జీర్ణ సంబంధిత సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. వంకాయ త్వరగా అరగదు. దీంతో కడుపు నొప్పి, ఉబ్బరం, గ్యాస్ ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి జీర్ణ సమస్యలు ఉన్న వారు వంకాయలను తినకూడదు.
జలుబుతో బాధ పడేవారు:
జలుబుతో బాధ పడేవారు కూడా వంకాయలను తినకూడదు. జలుబుతో ఉన్నప్పుడు వంకాయలను తింటే ఆ సమస్య మరింత ఎక్కువ అవుతుంది.
మానసిక సమస్యలు ఉన్నవారు:
ఒత్తిడి, ఆందోళన, నిరాశ, భయంతో ఉన్న వారు కూడా వంకాయలు తీసుకోకూడదు. ఒత్తిడితో బాధ పడేవారు వంకాయలను తినడం వల్ల ఆ సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది.
రక్త హీనత బాధ పడేవారు:
రక్త హీనత సమస్య ఉన్నవారు.. వంకాయలను తీసుకోవడం వల్ల బాడీలో రక్తం లెవల్స్ అనేవి తగ్గుతాయి. కాబట్టి ఈ ప్రాబ్లమ్ ఉన్నవారు వంకాయలకు దూరంగా ఉండాలి.
మొలలు సమస్య ఉన్నవారు:
మొలలు సమస్యతో ఇబ్బంది పడే వారు కూడా వంకాయలను తీసుకోకపోవడమే బెటర్.
మూత్ర పిండాల సమస్యలు ఉన్నవారు:
మూత్ర పిండాల సమస్యలు ఉన్నవారు కూడా వంకాయలకు దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే వంకాయలు తినడం వల్ల ఆ సమస్యలు మరింత ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది.
దురద సమస్యలు ఉన్నవారు:
దురద సమస్యలు ఉన్నవారు కూడా వంకాయలకు దూరంగా ఉండాలి. ఈ సమస్యతో ఇబ్బంది పడే వారు వంకాయలను తినడం వల్ల ఆ సమస్య మరింత ఎక్కువ అవుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.