AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gond Katira: ఆరోగ్యాన్ని ఇచ్చే కటోరా పాయసం.. టేస్ట్ అదిరిపోతుంది అంతే!!

గోంధ్ కటోరా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కటోరాలో అనేక ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న విషయం తెలిసిందే. శరీరానికి చలువ చేసే వాటిల్లో గోంధ్ కటోరా కూడా ఒకటి. దీన్ని ఎక్కువగా బాలింతలు, గర్భిణీలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. కటోరా కడుపులో మంట, ఉబ్బరం వంటి వాటిని తగ్గిస్తుంది. అలాగే కిడ్నీలో రాళ్లను కూడా కరిగించడంలో బాగా హెల్ప్ చేస్తుంది. గోంధ్ కటోరాను ఎలా తీసుకున్నా మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కటోరాను నీటిలో వేస్తే జల్ గా మారే దాన్నే మనం తీసుకోవాలి. గోంధ్ కటోరాతో పాయసం కూడా తయారు..

Gond Katira: ఆరోగ్యాన్ని ఇచ్చే కటోరా పాయసం.. టేస్ట్ అదిరిపోతుంది అంతే!!
Gond Katira Payasam
Chinni Enni
| Edited By: |

Updated on: Jan 09, 2024 | 3:11 PM

Share

గోంధ్ కటోరా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కటోరాలో అనేక ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న విషయం తెలిసిందే. శరీరానికి చలువ చేసే వాటిల్లో గోంధ్ కటోరా కూడా ఒకటి. దీన్ని ఎక్కువగా బాలింతలు, గర్భిణీలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. కటోరా కడుపులో మంట, ఉబ్బరం వంటి వాటిని తగ్గిస్తుంది. అలాగే కిడ్నీలో రాళ్లను కూడా కరిగించడంలో బాగా హెల్ప్ చేస్తుంది. గోంధ్ కటోరాను ఎలా తీసుకున్నా మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కటోరాను నీటిలో వేస్తే జల్ గా మారే దాన్నే మనం తీసుకోవాలి. గోంధ్ కటోరాతో పాయసం కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పాయసం తాగితే శరీరాన్ని చల్లబరుస్తుంది. కటోరా పాయసాన్ని ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

గోంధ్ కటోరాకు కావాల్సిన పదార్థాలు:

గోంధ్ కటోరా, పటిక బెల్లం పొడి, పాలు, సగ్గుబియ్యం, కుంకుమ పువ్వు, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్.

ఇవి కూడా చదవండి

కటోరా పాయసం తయారీ విధానం:

కటోరా పాయసాన్ని తయారు చేసుకునే ముందు రోజు రాత్రే.. కటోరాను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో నాన బెట్టాలి. ఇలా చేయడం వల్ల కటోరా జెల్ గా మారుతుంది. ఉదయం ఒక గిన్నెలోకి వేడి నీళ్లు వేసికుని అరగంట ముందు సగ్గు బియ్యాన్ని నాన బెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి సగ్గు బియ్యం, నానబెట్టిన గోంధ్ కటోరా రెండు కలిపి వేసుకుని ఉడికించుకోవాలి. ఇవి బాగా ఉడికాక.. పాలు పోసి కలుపుకోవాలి. పాలు వేసుకున్నాక.. మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. నెక్ట్స్ మరో 5 నిమిషాలు ఉడికించు కోవాలి. పాయసం దగ్గర పడుతుంది అనే సమయంలో.. కుంకుమ పువ్వును పాలలో కలిపి వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. ఇది ఆప్షనల్ మాత్రమే. కావాలనుకున్న వారు యూజన్ చేసుకోవచ్చు.

పాయసం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవమే. ఇప్పుడు కటోరా పాయసంపై డ్రై ఫ్రూట్స్ వేసుకుని కలిపి సర్వ్ చేసుకోవడమే. దీన్ని దేవుడికి ప్రసాదంగా కూడా చేసుకుకోవచ్చు. అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కటోరా పాయసం రెడీ. ఈ పాయసాన్ని వేడి చేసినప్పుడు లేదా సమ్మర్ లో చేసుకుని తింటే చాలా చలువ చేయడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటుంది. కటోరా బాడీని కూల్ చేస్తుంది. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.. ఆరోగ్యంగా ఉండండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..