AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spinach Leaves Benefits: బచ్చలి కూరలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే!

ఆకు కూరల్లో బచ్చలి కూర కూడా ఒకటి. ఆకు కూరలు అనగానే చాలా మందికి తోట కూర, పాల కూర, గోంగూర మాత్రమే గుర్తొస్తాయి. కానీ బచ్చలి కూర అంత తొందరగా గుర్తుకు రాదు. ఆకు కూరలు తింటే ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే. అయినా కూడా వీటికి దూరంగానే ఉంటారు. నాన్ వెజ్ కంటే ఆకు కూరలు, కూర గాయలు, పప్పుల్లోనే పోషకాలు అనేవి ఎక్కువగా లభిస్తాయి. వెజిటేరియన్ ఫుడ్ ని సరిగ్గా తీసుకుంటే ఆరోగ్యం, అందం మన సొంతం అవుతుంది..

Spinach Leaves Benefits: బచ్చలి కూరలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే!
Spinach Leaves
Chinni Enni
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 04, 2023 | 4:00 PM

Share

ఆకు కూరల్లో బచ్చలి కూర కూడా ఒకటి. ఆకు కూరలు అనగానే చాలా మందికి తోట కూర, పాల కూర, గోంగూర మాత్రమే గుర్తొస్తాయి. కానీ బచ్చలి కూర అంత తొందరగా గుర్తుకు రాదు. ఆకు కూరలు తింటే ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే. అయినా కూడా వీటికి దూరంగానే ఉంటారు. నాన్ వెజ్ కంటే ఆకు కూరలు, కూర గాయలు, పప్పుల్లోనే పోషకాలు అనేవి ఎక్కువగా లభిస్తాయి. వెజిటేరియన్ ఫుడ్ ని సరిగ్గా తీసుకుంటే ఆరోగ్యం, అందం మన సొంతం అవుతుంది. అందుకే ఇటీవల కాలంలో చాలా మంది వెజిటేరియన్ కి షిఫ్ట్ అవుతున్నారు.

ఇక బచ్చలి కూర విషయానికొస్తే.. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం, విటమిన్లు ఏ, సి, ఐరన్, బీటా కెరాటిన్, నీరు శాతం అధికంగా ఉంటాయి. ఆకలిని అరికట్టడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, శరీరానికి రక్షణగా నిలవడంలో బచ్చలి కూర బాగా ఉపయోగ పడుతుంది. ఇంకా బచ్చలి కూరతో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎముకలను స్ట్రాంగ్ గా చేస్తుంది:

ఇవి కూడా చదవండి

బచ్చలి కూరలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్ ఎముకలు స్ట్రాంగ్ గా ఉండేందుకు సహాయం చేస్తాయి. అంతే కాకుండా ఎముక కణ జాలాన్ని తొలగించి, తిరిగి పునర్నిస్తుంది. ఎముకలు బలహీనంగా ఉండటాన్ని, బోలు ఎముకల వ్యాధి రాకుండా నిరోధిస్తుంది బచ్చలి కూర.

ఆకలిని తగ్గించడమే కాదు బరువు తగ్గుతారు:

ఆకలిని అరికట్టడంలో బచ్చలి కూర బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉండే థైలాకోయిడ్ పదార్థాలు ఆకలిని తగ్గిస్తుంది. కొద్దిగా తిన్న కడుపు నిండిన భావన కలిగిస్తుంది. కాబట్టి బచ్చలి కూరను మీ ఆహారంలో చేర్చుకుంటే ఖచ్చితంగా బరువు తగ్గుతారు.

రక్త హీనత ఉండదు:

చాలా మంది రక్త హీనతతో బాధ పడుతూంటారు. అలాంటి వారికి బెటర్ ఆప్షన్ బచ్చలి కూర అని చెప్పవచ్చు. దీన్ని పప్పుతో కూడా వండి తీసుకోవచ్చు. కాబట్టి హ్యాపీగా తినేయవచ్చు. బలహీనంగా, తల తిరిగే సమస్యలతో బాధ పడుతున్న వారు బచ్చలి కూర తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

గర్భిణీలు తింటే మంచిది:

గర్భిణీలు బచ్చలి కూరను తినడం వల్ల పుట్టే శిశువులకు చాలా మంచి చేస్తుంది. శిశువు మెదడును అభివృద్ధి చెందడంలో, పుట్టుక సమయంలో కలిగే లోపాలను నివారిస్తుంది బచ్చలి కూర. కాబట్టి గర్భిణులు ఖచ్చితంగా బచ్చలి కూరను తినాలి.

ఇంకా బచ్చలి కూర.. ఊపిరి తిత్తులు సక్రమంగా పని చేయడంలో, మెదడు, నరాల ఆరోగ్యానికి, క్యాన్సర్ రాకుండా చూడటంలో, మలబద్దకపు నివారణలో, చర్మ సమస్యలు రాకుండా, చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడంలో బాగా పని చేస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.