Apple Disadvantages: యాపిల్ ను రాత్రి పూట తింటున్నారా.. తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో చూడండి!!
రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ కు దూరంగా ఉండొచ్చన్న.. ట్యాగ్ లైన్ ఊరికే రాలేదు. రోజూ యాపిల్ తింటే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవడమే కాకుండా.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ మనం తినే ఆహారాల్లో యాపిల్ ను కూడా భాగం చేసుకోవాలని నిపుణులు కూడా చెబుతున్నారు. యాపిల్ సంపూర్ణ ఆహారమని చెబుతున్నారు. యాపిల్ లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఏ, సీ, కే, ఐరన్, ప్రోటీన్లు, పోటాషియం, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. యాపిల్..
రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ కు దూరంగా ఉండొచ్చన్న.. ట్యాగ్ లైన్ ఊరికే రాలేదు. రోజూ యాపిల్ తింటే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవడమే కాకుండా.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ మనం తినే ఆహారాల్లో యాపిల్ ను కూడా భాగం చేసుకోవాలని నిపుణులు కూడా చెబుతున్నారు. యాపిల్ సంపూర్ణ ఆహారమని చెబుతున్నారు. యాపిల్ లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఏ, సీ, కే, ఐరన్, ప్రోటీన్లు, పోటాషియం, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. యాపిల్ ను తినడం వల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
ముఖ్యంగా యాపిల్ తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. రొమ్ము, పెద్ద పేగు క్యాన్సర్ లకు సంబంధించిన కణాలు పెరగకుండా యాపిల్ నిరోధిస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలోనే కాకుండా, బరువును నియంత్రణలో ఉంచడంలో కూడా యాపిల్ మనకు బాగా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా యాపిల్ ను తినడం వల్ల క్రమం తప్పకుండా యాపిల్ ను తీసుకోవడం వల్ల క్షయ, కీళ్ల నొప్పులు, అనీమియా, ఆస్తమా, నిద్రలేమి, జలుబు, నాడీ సమస్యలు, ఊబకాయం, తలనొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
రాత్రి తింటే జీర్ణ సమస్యలు:
అయితే చాలా మంది తెలియక యాపిల్ ను రాత్రి పూట తింటూంటారు. ఫ్రూట్ సలాడ్ లో భాగం చేసుకుంటూ యాపిల్ ని తింటారు. జీర్ణ సమస్యలు, మల బద్దకంతో బాధ పడుతున్న వారు యాపిల్ ను రాత్రి పూట తినడం మంచిది కాదని ఆహార నిపుణులు చెబుతున్నారు. యాపిల్ రాత్రి పూట తినడం వల్ల తిన్నది సరిగ్గా అరగదు. దీంతో జీర్ణ వ్యవస్థ పనులకు ఆటంకంగా మారుతుంది. కాబట్టి యాపిల్ ను సాయంత్రం, రాత్రి పూట మినహాయించి ఏ సమయంలోనైనా తినవచ్చని సూచిస్తున్నారు.
ఉదయం తింటే లాభాలు ఎక్కువ:
అదే ఉదయం తింటే మాత్రం గ్యాస్, జీర్ణ సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఎందుకంటే యాపిల్ లో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది తింటే పొట్ట నిండిన భావన కలుగుతుంది. వేరే ఆహారాన్ని త్వరగా తీసుకోలేరు. కాబట్టి ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు.
డయాబెటీస్ ఉన్న వారికి యాపిల్ బెస్ట్:
డయాబెటీస్ తో బాధ పడుతున్న వారికి యాపిల్ బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకుంటే యాపిల్ ఎంత తిన్నా షుగర్ లెవల్స్ లో ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి మధు మేహంతో బాధ పడుతున్న వారు యాపిల్ ను హ్యాపీగా తినవచ్చు.
రక్త హీనత సమస్య ఉండదు:
యాపిల్ లో ఐరన్ కూడా ఉంటుంది కాబట్టి.. తరచూ తింటే రక్త హీనత సమస్య ఉండదు. ఉన్నవారు కూడా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మహిళలు రోజూ యాపిల్ ను తింటే అనే సమస్యలను తగ్గించుకోవచ్చు.
నిద్ర లేమి సమస్యలు ఉండవు:
నిద్ర లేమి సమస్యలతో ఇబ్బంది పడేవారు యాపిల్ ను తినడం వల్ల ఆ సమస్యను తగ్గించుకోవచ్చు. యాపిల్ తింటే చక్కగా నిద్ర పడుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.