Kalakand Sweet: అప్పటికప్పుడు ఇన్ స్టెంట్ గా కలాకండ్ ను ఇలా తయారు చేసుకోండి.. చాలా రుచిగా ఉంటుంది!!

పాలతో తయారు చేసే స్వీట్లలో కలాకండ్ కూడా ఒకటి. చాలా మందికి కలాకండ్ స్వీట్ అంటే చాలా ఇష్టం. ఎక్కడ కనిపించినా మెల్లగా.. ఒక్కోటి లాగించేస్తారు. ఈ స్వీట్ కనిపించిందంటే నోట్లోకి వెళ్లాల్సిందే. అంత ఇష్టం ఈ స్వీట్ అంటే. అయితే కలాకండ్ ని ఇంట్లో తయారు చేయాలంటే కాస్త శ్రమతో కూడుకున్న పనే అని చెప్పవచ్చు. సమయం కూడా ఎక్కువగా పడుతుంది. దీంతో చాలా మంది స్వీట్ షాపుల నుంచే కొనుక్కోని ఆశ్వాదిస్తూంటారు. కానీ మనం ఈ స్వీట్ ను ఇన్ స్టెంట్ గా..

Kalakand Sweet: అప్పటికప్పుడు ఇన్ స్టెంట్ గా కలాకండ్ ను ఇలా తయారు చేసుకోండి.. చాలా రుచిగా ఉంటుంది!!
Kalakand
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Oct 04, 2023 | 5:30 PM

పాలతో తయారు చేసే స్వీట్లలో కలాకండ్ కూడా ఒకటి. చాలా మందికి కలాకండ్ స్వీట్ అంటే చాలా ఇష్టం. ఎక్కడ కనిపించినా మెల్లగా.. ఒక్కోటి లాగించేస్తారు. ఈ స్వీట్ కనిపించిందంటే నోట్లోకి వెళ్లాల్సిందే. అంత ఇష్టం ఈ స్వీట్ అంటే. అయితే కలాకండ్ ని ఇంట్లో తయారు చేయాలంటే కాస్త శ్రమతో కూడుకున్న పనే అని చెప్పవచ్చు. సమయం కూడా ఎక్కువగా పడుతుంది. దీంతో చాలా మంది స్వీట్ షాపుల నుంచే కొనుక్కోని ఆశ్వాదిస్తూంటారు. కానీ మనం ఈ స్వీట్ ను ఇన్ స్టెంట్ గా అప్పటికప్పుడు.. తక్కువ సమయంలోనే ఈజీగా చేసుకోవచ్చు. అదెలాగా అని ఆశ్చర్య పోతున్నారా.. పాల పొడితో. మిల్క్ పౌడర్ ను ఉపయోగించి ఈ కలాకండ్ ను ఇన్ స్టెంట్ గా ఇంట్లో చేసుకోవచ్చు. మరి ఈ స్వీట్ ను ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.

ఇన్ స్టెంట్ కలాకండ్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

పాల పొడి, నెయ్యి, పంచదార, యాలకుల పొడి, పిస్తా లేదా బాదం లేదా జీడిపప్పు కొద్దిగా, కాచి చల్లార్చిన పాలు.

ఇవి కూడా చదవండి

కలాకండ్ తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నెలోకి పావు కప్పు పాలను తీసుకుని.. అందులోకి రెండు చుక్కల నిమ్మ రసం వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి కరిగాక నిమ్మ రసం కలిపి పెట్టుకున్న పాలను వేసుకుని వేడి చేయాలి. ఇలా వేడి చేస్తున్నప్పుడు పాలు విరుగుతాయి. ఈ సమయంలో కొద్ది కొద్దిగా మిల్క్ పౌడర్ ను వేస్తూ.. ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి.

ఇలా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత పంచదార పొడి వేసుకుని కలుపు కోవాలి. దీనిని కడాయికి అంటుకోకుండా.. అవసరమైతే నెయ్యి వేసుకుంటూ మరో రెండు, మూడు నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ట్రేలోకి తీసుకోవాలి. వాటిపై మీ దగ్గర ఏ డ్రై ఫ్రైట్స్ ఉంటే వాటిని చల్లుకోవాలి. అంతే ఎంతో టేస్టీ కలాకండ్ ని సింపుల్ గా మిల్క్ పౌడర్ తో చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.