Biryani Leaf Benefits: ఈ బిర్యానీ ఆకు కేవలం ఆకు మాత్రమే కాదండోయ్.. బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయి!!

బిర్యానీ ఆకు దీన్నే బే ఆకు అని అంటారు. ఈ బే ఆకును ఎక్కువగా బిర్యానీ, పులావ్, ఫ్రైడ్ రైస్, మసాలా కూరలు వంటి వాటిల్లో మాత్రమే ఉపయోగిస్తారు. అందుకే దీనికి బిర్యానీ ఆకు అని పేరొచ్చింది. ఇది ఆకే కాదా.. కేవలం రుచిని మాత్రమే ఇస్తుంది అనుకుంటే మాత్రం పొరపాటే. ఈ ఆకుతో ఉండే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదండోయ్. బే ఆకుల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు శరీరాన్ని హెల్దీగా చేస్తాయి. ఆకు వలన ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందంటే..

Biryani Leaf Benefits: ఈ బిర్యానీ ఆకు కేవలం ఆకు మాత్రమే కాదండోయ్.. బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయి!!
Biryani Leafs
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Oct 04, 2023 | 7:00 PM

బిర్యానీ ఆకు దీన్నే బే ఆకు అని అంటారు. ఈ బే ఆకును ఎక్కువగా బిర్యానీ, పులావ్, ఫ్రైడ్ రైస్, మసాలా కూరలు వంటి వాటిల్లో మాత్రమే ఉపయోగిస్తారు. అందుకే దీనికి బిర్యానీ ఆకు అని పేరొచ్చింది. ఇది ఆకే కాదా.. కేవలం రుచిని మాత్రమే ఇస్తుంది అనుకుంటే మాత్రం పొరపాటే. ఈ ఆకుతో ఉండే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదండోయ్. బే ఆకుల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు శరీరాన్ని హెల్దీగా చేస్తాయి. ఆకు వలన ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందంటే మీరు నమ్ముతారా. బిర్యానీ ఆకులో ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జీవ క్రియను మెరుగు పరుస్తుంది:

బే ఆకు రుచిని, సువాసనను మాత్రమే కాదు.. తిన్న ఆహారాన్ని అరుగుదల చేసే శక్తి కూడా ఇందులో ఉంది. బిర్యానీ ఆకును తరచూ మన వంటల్లో చేర్చడం వల్ల రుచి పెరగడమే కాకుండా.. జీవ క్రియను పెంచుతుంది. దీంతో ఆహారం నిల్వ ఉండకుండా త్వరగా జీర్ణం అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇన్ ఫెక్షన్స్, ఎలర్జీని తగ్గిస్తుంది:

అప్పుడప్పుడు బాడీ ఇన్ ఫెక్షన్స్, ఎలర్జీ వంటి వాటికి గురవుతూ ఉంటాయి. ఇలాంటి వారు తమ ఆహారంలో బిర్యానీ ఆకును చేర్చుకుంటే.. వాటి నుంచి దూరం అవ్వొచ్చు.

ఒత్తిడి, ఆందోళన దూరం అవుతుంది:

బే ఆకును తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి వాటి నుంచి ఉపశనం లభిస్తుంది.

బోలెడన్ని ఔషధ గుణాలు:

బే ఆకులో పొటాషియం, క్యాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, విటమిన్లు ఏ, బి6, సీ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి.

కొవ్వును కరిగించి, బరువు తగ్గిస్తుంది:

బిర్యానీ ఆకు బరువు తగ్గించడంలో కూడా బాగా హెల్ప్ చేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో బే ఆకులు ఉపయోగ పడతాయి. అలాగే ఈ ఆకుల్లో ఉండే ఫైబర్ పేగు కదలికలను మెరుగు పరిచి, వెయిల్ లాస్ అవ్వడంలో కీలకంగా పాత్ర పోషిస్తుంది.

జలుబు, దగ్గు నుంచి రిలీఫ్:

సాధారణ వ్యాధులను తగ్గించడంలో బే ఆకులు బాగా హెల్ప్ అవుతాయి. బే ఆకులను మరిగించే నీటిలో వేసి.. ఆవిరి పట్టడం వల్ల జలుబు, దగ్గు లక్షణాల నుంచి రిలీఫ్ దొరుకుతుంది. బిర్యానీ ఆకుల టీ తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది.

రక్త హీనత తగ్గుతుంది:

బే ఆకుల్లో ఉండే కాపర్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటివి పోషకాలు.. రక్త హీనత, హిమోగ్లోబిన్ సమస్యలను తొలగించడంలో హెల్ప్ అవుతాయి. అంతే కాకుండా రక్తాన్ని శుద్ధి చేసి.. శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.