Health Tips: హెల్దీగా, అందంగా ఉండాలంటే రోజూ ఈ పనులు చేయండి!!
ఆరోగ్యంగా, అందంగా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ ఈ బిజీ లైఫ్ లో సరైన సమయం కుదరడం లేదు. సమయం లేని కారణంగా ఏది పడితే అది తినేసి అనారోగ్య సమస్యలను ఆహ్వానిస్తున్నారు. మీకున్న సమయంలోనే కొద్దిగా మార్పులు చేసుకుని టైమ్ సెట్ చేసుకుంటే ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. మొదటలో కాస్త ఇబ్బందిగా ఉన్నా.. రోజూ చేస్తే అదే అలవాటు అవుతుంది. ఆరోగ్యంగా, అందంగా ఉండాలని ఏవేవో పనులు చేస్తూ అనవసర ప్రాబ్లమ్స్ ని..
ఆరోగ్యంగా, అందంగా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ ఈ బిజీ లైఫ్ లో సరైన సమయం కుదరడం లేదు. సమయం లేని కారణంగా ఏది పడితే అది తినేసి అనారోగ్య సమస్యలను ఆహ్వానిస్తున్నారు. మీకున్న సమయంలోనే కొద్దిగా మార్పులు చేసుకుని టైమ్ సెట్ చేసుకుంటే ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. మొదటలో కాస్త ఇబ్బందిగా ఉన్నా.. రోజూ చేస్తే అదే అలవాటు అవుతుంది. ఆరోగ్యంగా, అందంగా ఉండాలని ఏవేవో పనులు చేస్తూ అనవసర ప్రాబ్లమ్స్ ని కొని తెచ్చుకుంటున్నారు. కానీ ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల హెల్దీ అయిన బ్యూటీ మన సొంతం అవుతుంది. ఒక్కొక్కసారి టైమ్ సెట్ అవ్వకపోవడం వల్ల కుదరక పోవచ్చు.. బ్రేక్ పడవచ్చు. అలాంటప్పుడు బయట ఫుడ్ తింటే ఓకే కానీ.. బావుంది కదా అని రోజూ తింటే మాత్రం ఆస్పత్రికి వెళ్లాల్సిందే. అయితే మనం ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నిద్ర:
మనిషి జీవితంలో ముఖ్యమైనది నిద్ర. మీ వయసు ఆధారంగా రోజూ ఖచ్చితంగా నిద్ర పోతే కనుక ఆరోగ్యంతో పాటు అందం కూడా మన సొంతం అవుతుంది. నిద్ర బాగా పట్టాలంటే ఒత్తిడిని తగ్గించుకోవాలి.
ఉదయాన్నే వాకింగ్ చేయాలి:
మీరు రోజంతా యాక్టీవ్ గా ఉండాలన్నా, బరువు నియంత్రణలో ఉండాలన్నా, ఆరోగ్యంతో పాటు అందంగా ఉండాలన్నా ఉదయం లేవగానే ఒక అరగంట వాకింగ్ చేయడం ఎంతో మంచిది.
బరువు నియంత్రణ:
మీరు బరువు పెరుగుతున్నారు అని మీకు అర్థమైతే.. వెంటనే నియంత్రణలోకి తీసుకురావాలి.
జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి:
జంక్ ఫుడ్ తినడం వల్ల ఒక్కటి కాదు చాల రకాల సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. బరువు పెరగడం, నిద్ర సరిగ్గా పట్టక పోవడం, కొలెస్ట్రాల్ పెరగడం ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వీలైనంత వరకూ జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి.
నీరు తాగాలి:
నీటిని అధికంగా తీసుకుంటూ ఉండాలి. ఎప్పుడూ బాడీని హైడ్రేట్ గా ఉంచుకోవాలి. దాహం వేసినప్పుడే కాకుండా.. గంట లేదా రెండు గంటలకు ఓసారైనా నీటిని తీసుకుంటూ ఉండాలి.
పోషకాహారం తీసుకోవాలి:
ఆరోగ్యంగా, అందంగా ఉండటం మన చేతుల్లోనే ఉంది. సమయాన్ని సరిగ్గా సెట్ చేసుకుని పాటిస్తే దేన్నైనా సాధించవచ్చు. కాబట్టి జంక్ ఫుడ్ కాకుండా.. పోషకాహారాన్ని తీసుకుంటూ ఉండాలి. మీరు తీసుకునే ఆహారంలో ఫైబర్, ప్రోటీన్, మినరల్స్, విటమిన్స్, ఉప్పు, చక్కెర తక్కువగా ఉన్న ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యంగా, అందంగా ఉంటారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.