AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: నిలబడి నీటిని తాగుతున్నారా.. వాటర్ ను ఎలా తీసుకోవాలో తెలుసుకోండి!!

మానవ జీవనాధారంలో నీరు ముఖ్య పాత్ర పోషిస్తాయి. నీరు లేకపోతే ఏ పని ముందుకు వెళ్లదు. నిద్ర, నీరు అందాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ఉండాలన్నా.. యాక్టీవ్ గా ఉండాలన్నా నీరు తాగడం చాలా ముఖ్యం. కనీసం రోజూ 2 నుంచి 3 లీటర్ల నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ సరిపడ నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. శరీరంలో తగిన నీరు లేకపోతే డీహైడ్రేషన్ కు గురై, ప్రాణాలే పోయే ప్రమాదం ఉంది కాబట్టి తగిన..

Health Tips: నిలబడి నీటిని తాగుతున్నారా.. వాటర్ ను ఎలా తీసుకోవాలో తెలుసుకోండి!!
Water
Chinni Enni
| Edited By: |

Updated on: Oct 01, 2023 | 9:24 PM

Share

మానవ జీవనాధారంలో నీరు ముఖ్య పాత్ర పోషిస్తాయి. నీరు లేకపోతే ఏ పని ముందుకు వెళ్లదు. నిద్ర, నీరు అందాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ఉండాలన్నా.. యాక్టీవ్ గా ఉండాలన్నా నీరు తాగడం చాలా ముఖ్యం. కనీసం రోజూ 2 నుంచి 3 లీటర్ల నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ సరిపడ నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. శరీరంలో తగిన నీరు లేకపోతే డీహైడ్రేషన్ కు గురై, ప్రాణాలే పోయే ప్రమాదం ఉంది కాబట్టి తగిన నీటిని తాగాలి. అయితే నీళ్లను ఎలా పడితే అలా తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. సరైన మార్గంలో నీరు తాగక పోవడం వల్ల గొంతు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇటీవల ఓ అధ్యయనం పేర్కొంది. ఈ అధ్యయనం ప్రకారం నీరు తాగేటప్పుడు పలు సూచనలు పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్లాస్టిక్ బాటిల్స్ లో నీరు తాగకూడదు:

చాలా మంది ఇప్పుడు నీరు తాగడానికి ప్లాస్టిక్ బాటిల్సే వినియోగిస్తున్నారు. ఇలా ప్లాస్టిక్ బాటిల్స్ లో నిల్వ చేసిన నీరు తాగకూడదని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ప్లాస్టిక్ వ్యర్థాలు పెరుగుతాయి. దాదాపు 80 శాతం మంది బ్లడ్ లో మైక్రో ప్లాస్టిక్ కాలుష్యం ఉందని తేలింది. ఇవి కాస్తా శరీరంలోని పలు అవయవాలను దెబ్బ తీస్తున్నాయి. కాబట్టి ప్లాస్టిక్ బాటిల్స్ లో ఉండే నీరు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

తగినంత నీరు తీసుకోవాలి:

దాహం వేసినప్పుడే నీరు తాగుతున్నారు కానీ.. అర గంటకు లేదా గంటకు అయినా ఓ సారైనా నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా తాగడం వల్ల శరీరం డీ హైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటుంది. యాక్టీవ్ గా ఉంటారు. కాబట్టి తగినంత నీరు తీసుకోవాలి.

ఒకేసారి నీటిని తాగవద్దు:

నీటిని తాగమంటున్నారు.. మంచిది కదా అని ఒకేసారి ఎక్కువ మోతాదులో నీటిని తాగ కూడదు. ఇలా చేయడం వల్ల వాపు, రెస్ట్ లెస్ వంటి సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది.

ఆహారం తీసుకునేటప్పుడు ఎక్కువగా నీరు తాగకూడదు:

ఆహారం తినేటప్పుడు ఎక్కువగా నీటిని తాగ కూడదు. ఇలా తాగడం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాదు. దీంతో జీర్ణ సమస్యలను ఫేస్ చేయాలి. మధ్యలో ఒక్కసారి తాగితే సరిపోతుంది.

ఫ్రిజ్ లో నుంచి తీసిన నీటిని వెంటనే తాగకూడదు:

చాలా మంది ఫ్రిజ్ లో నుంచి బాగా కూలింగ్ ఉన్న నీటిని ఎక్కువగా తాగేస్తూంటారు. ఇలా చేయడం చాలా తప్పు. చల్లటి నీటిని తాగడం వల్ల ఆహారాన్ని జీర్ణం చేసే సామర్థ్యం తగ్గిపోతుంది.

నిలబడి నీళ్లు తాగకూడదు:

చాలా మందికి ఈ విషయం తెలీదు. నీళ్లను ఎప్పుడూ నిలబడి, వేగంగా తాగకూడదు. కూర్చుని రిలాక్స్ గా తాగాలి. నిలబడి నీళ్లను తాగితే కడుపుపై ప్రభావం పడుతుంది. దీంతో జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్