Eggs Disadvantages: మీరు ఈ సమస్యలతో బాధ పడుతున్నారా.. అయితే కోడిగుడ్డుకి దూరంగా ఉండాల్సిందే!!

కోడి గుడ్డు.. పోషకాల గని. పిల్లలైనా, పెద్దలైనా రోజుకు ఒక కోడి గుడ్డు తినాలని ఆహార నిపుణులు చెబుతూంటారు. బలహీనంగా ఉన్నవారు రోజూ ఎగ్ తినడం వల్ల దృఢంగా తయారవుతారు. కోడి గుడ్డు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. హెల్దీగా ఉన్నవారు రోజుకు మూడు కోడి గుడ్లైనా తినవచ్చని చెబుతున్నారు. మూడు గుడ్లు తిన్నవారు మాత్రం ఖచ్చితంగా ఎక్సర్ సైజ్ చేయాల్సిందే. ఎగ్ లో ఎన్నో విటమిన్లు, మినరల్స్, పోషకాలు ఉన్నాయి. రోజూ ఒక్క గుడ్డు తినడంతో ఎన్నో అనారోగ్య..

Eggs Disadvantages: మీరు ఈ సమస్యలతో బాధ పడుతున్నారా.. అయితే కోడిగుడ్డుకి దూరంగా ఉండాల్సిందే!!
Eggs
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 01, 2023 | 9:29 PM

కోడి గుడ్డు.. పోషకాల గని. పిల్లలైనా, పెద్దలైనా రోజుకు ఒక కోడి గుడ్డు తినాలని ఆహార నిపుణులు చెబుతూంటారు. బలహీనంగా ఉన్నవారు రోజూ ఎగ్ తినడం వల్ల దృఢంగా తయారవుతారు. కోడి గుడ్డు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. హెల్దీగా ఉన్నవారు రోజుకు మూడు కోడి గుడ్లైనా తినవచ్చని చెబుతున్నారు. మూడు గుడ్లు తిన్నవారు మాత్రం ఖచ్చితంగా ఎక్సర్ సైజ్ చేయాల్సిందే. ఎగ్ లో ఎన్నో విటమిన్లు, మినరల్స్, పోషకాలు ఉన్నాయి. రోజూ ఒక్క గుడ్డు తినడంతో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కోడి గుడ్డు తింటే బలంగా, ఆరోగ్యంగా ఉండవచ్చు. నో డౌట్ అయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వారు మాత్రం దీనికి దూరంగా ఉండాల్సిందే. లేదంటే ఈ సమస్యలు మరింత తీవ్ర తరం అవుతాయట. మరి ఎలాంటి వారు కోడి గుడ్లకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడేవారు:

కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడేవారు.. కోడి గుడ్డుకు దూరంగా ఉండాలి. ఎందుకుంటే కోడి గుడ్డులో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు కోడి గుడ్డుకు దూరంగా ఉంటేనే మంచిది. దీని వల్ల డయాబెటీస్, పలు రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

గుండె సమస్యలు ఉన్నవారు:

గుండె సమస్యలతో ఇబ్బంది పడేవారు సైతం కోడి గుడ్లకు దూరంగా ఉంటే బెటర్. ఎందుకంటే కోడి గుడ్లలో కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది ఎక్కువ అయితే.. గుండె రక్తం సరఫరా సరిగ్గా ఉండదు. కాబట్టి గుండె సమస్యలు ఉన్న వారు కోడి గుడ్లకు దూరంగా ఉండాలి.

మూత్ర పిండాల సమస్యలు ఉన్నవారు:

మూత్ర పిండాల సమస్యలు ఉన్నవారు కూడా కోడి గుడ్లను తీసుకోకూడదు. కిడ్నీ సంబంధిత ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడేవారు కోడి గుడ్లు తినడం వల్ల ఈ సమస్యలు మరింతగా ఎక్కువ అవుతాయి.

అధిక బరువు ఉన్నవారు:

అధిక బరువుతో ఇబ్బంది పడేవాళ్లు కూడా కోడి గుడ్డు తినక పోవడం బెటర్. ఒక వేళ గుడ్డు తినాలనుకునే వారు ఎగ్ వైట్ తినడం బెటర్. ఎందుకుంటే ఎగ్ ఎల్లోలోనే ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉంటుంది. దీంతో మీరు మరింత బరువు పెరిగేందుకు ఛాన్స్ ఉంది.

జీర్ణ సమస్యలు ఉన్నవారు:

జీర్ణ సమస్యలు గ్యాస్, అజీర్తి, కడుపులో నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు కూడా కోడి గుడ్డుకి దూరంగా ఉండాలి. లేదంటో ఆ సమస్యలు మరింత ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!