Pink Salt Benefits: అందంగా కనిపించాలనుకుంటున్నారా.. అయితే ఈ పింక్ సాల్ట్ ని యూజ్ చేయండి!

అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి. అబ్బాయిలైనా.. అమ్మాయిలైనా అందంగా కనిపించాలనుకుంటారు. అందంగా కనిపించడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూంటారు. ఎవరి ఏం చెప్తే అది చేస్తారు. మార్కెట్ లోకి కొత్తగా ఏ క్రీమ్ వస్తే అది రాసుకుంటారు. కానీ పై పై మెరుగులకన్నా.. ఆరోగ్యంగా ఉంటేనే పైన బాడీ కూడా అందంగా కనిపిస్తుందన్న విషయం చాలా మందికి తెలీదు. శరీరంలో లోపల ఆర్గాన్స్ అన్నీ ఆరోగ్యంగా ఉంటేనే.. మనం కూడా బయటకు అందంగా..

Pink Salt Benefits: అందంగా కనిపించాలనుకుంటున్నారా.. అయితే ఈ పింక్ సాల్ట్ ని యూజ్ చేయండి!
Himalayan Pink Salt
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 30, 2023 | 10:23 PM

అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి. అబ్బాయిలైనా.. అమ్మాయిలైనా అందంగా కనిపించాలనుకుంటారు. అందంగా కనిపించడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూంటారు. ఎవరి ఏం చెప్తే అది చేస్తారు. మార్కెట్ లోకి కొత్తగా ఏ క్రీమ్ వస్తే అది రాసుకుంటారు. కానీ పై పై మెరుగులకన్నా.. ఆరోగ్యంగా ఉంటేనే పైన బాడీ కూడా అందంగా కనిపిస్తుందన్న విషయం చాలా మందికి తెలీదు. శరీరంలో లోపల ఆర్గాన్స్ అన్నీ ఆరోగ్యంగా ఉంటేనే.. మనం కూడా బయటకు అందంగా కనిపించగలం. ఈ విషయం అందరూ గుర్తించు కోవాలి. కాగా ఇంట్లో ఉన్న వాటితో కూడా మనం అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.

ఆరోగ్యాన్నే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు:

అందాన్ని రెట్టింపు చేయడంలో ఉప్పు మనకు బాగా ఉపయోగ పడుతుంది. ఉప్పు ఆరోగ్యానికి మంచిది కాదు కదా.. మరి ఉప్పుతో అందాన్ని పెంచడం ఏంటి? అనుకుంటున్నారా. నిజమే ఉప్పుతో కూడా బ్యూటీని రెట్టింపు చేసుకోవచ్చు. పింక్ సాల్ట్ గురించి చాలా మందికి తెలీదు. ఉప్పులో ఇదొక భాగం. ఈ పింక్ కలర్ రాళ్ల ఉప్పుతో ఆరోగ్యాన్నే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు. మరి ఈ పింక్ కలర్ సాల్ట్ తో ఎలాంటి బ్యూటీ బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

పింక్ సాల్ట్ లో సోడియం తక్కువగా ఉంటుంది:

పింక్ కలర్ రాళ్ల ఉప్పు అనేది హిమాలయ పరిసర ప్రాంతాల్లో లభిస్తుంది. అందుకే దీన్ని హిమాయల ఉప్పు అని కూడా అంటూంటారు. ఇది లేత గులాభి రంగులో ఉంటుంది. నార్మల్ ఉప్పుతో కంటే ఈ పింక్ కలర్ రాళ్ల ఉప్పులో సోడియం కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం వంటివి ఎక్కువగా ఉంటాయి. సాధారణ ఉప్పు కంటే ఈ పింక్ సాల్ట్ వాడటం వల్ల ప్రయోజనాలు ఎక్కువని నిపుణులు కూడా చెబుతున్నారు.

చర్మాన్ని లోపల నుంచి మెరిసేలా చేస్తుంది:

మరి ఈ పింక్ సాల్ట్ తో అందం ఎలా రెట్టింపు అవుతుంది అనే కదా ఆలోచిస్తున్నారు. ఈ ఉప్పును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చర్మంపై ఉన్న బ్యాక్టీరియా, క్రిములు, డెడ్ స్కిన్ సెల్స్ అవేవి పోతాయి. అలాగే చర్మ కణాల మధ్య ఇరుక్కుపోయిన దుమ్ము, ధూళి వంటి వాటిని తొలగిస్తుంది. చర్మాన్ని లోపల నుంచి మెరిసేలా చేస్తుంది హిమాలయ ఉప్పు. అందుకే ఈ రకమైన ఉప్పును తీసుకుంటే అందం కూడా రెట్టింపు అవుతుందని ఆహార నిపుణులు వెల్లడించారు.

ఈ ఉప్పును తీసుకోవడం వల్ల రక్త పోటు అదుపులో ఉంటుంది:

అలాగే ఈ పింక్ కలర్ రాళ్ల ఉప్పును తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. సాధారణంగా తెల్ల ఉప్పు వాడితే రక్త పోటు అనేది పెరుగుతుంది. కానీ పింక్ సాల్ట్ వాడటం వల్ల రక్త పోటు అదుపులో ఉంటుంది. అలాగే హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. జీవ క్రియను మెరుగు పరిచి, ఉదర సమస్యలు లేకుండా చేస్తుంది. హిమాలయ ఉప్పులో డిటాక్సిఫికేషన్ గుణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉన్న మలినాలను, వ్యర్థాలను బయటకు పంపుతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!