AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liquid Lipstick Tips: లిక్విడ్ లిప్ స్టిక్ ని యూజ్ చేస్తున్నారా.. ఇలా వాడితే ఎక్కువ సేపు అలానే ఉంటుంది!

లిప్ స్టిక్ అంటే ఇష్టపడని ఆడవారు ఉండరు. మేకప్ వేసుకోకపోయినా.. లిప్ స్టిక్ మాత్రం తప్పనిసరిగా వేసుకుంటారు. అందాన్ని రెట్టింపు చేయడంలో లిప్ స్టిక్ కూడా ఒకటి. లిప్ స్టిక్స్ లో ఒక్కటేంటి ఎన్నో రకాలు వచ్చాయి. అయితే వాటిలో మీకు సూట్ అయ్యే లిప్ స్టిక్స్ ని ఎంచుకుంటే మరింత అందగా కనిపిస్తారు. చాలా మంది లిక్విడ్ లిప్ స్టిక్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వీటిని సరిగ్గా వేసుకోకపోతే మాత్రం చూడటానికి అంత బాగోదు.. చిరాకుగా కనిపిస్తుంది. లిక్విడ్ లిప్ స్టిక్..

Liquid Lipstick Tips: లిక్విడ్ లిప్ స్టిక్ ని యూజ్ చేస్తున్నారా.. ఇలా వాడితే ఎక్కువ సేపు అలానే ఉంటుంది!
Lipstick 5
Chinni Enni
| Edited By: Ram Naramaneni|

Updated on: Oct 01, 2023 | 9:30 PM

Share

లిప్ స్టిక్ అంటే ఇష్టపడని ఆడవారు ఉండరు. మేకప్ వేసుకోకపోయినా.. లిప్ స్టిక్ మాత్రం తప్పనిసరిగా వేసుకుంటారు. అందాన్ని రెట్టింపు చేయడంలో లిప్ స్టిక్ కూడా ఒకటి. లిప్ స్టిక్స్ లో ఒక్కటేంటి ఎన్నో రకాలు వచ్చాయి. అయితే వాటిలో మీకు సూట్ అయ్యే లిప్ స్టిక్స్ ని ఎంచుకుంటే మరింత అందగా కనిపిస్తారు. చాలా మంది లిక్విడ్ లిప్ స్టిక్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వీటిని సరిగ్గా వేసుకోకపోతే మాత్రం చూడటానికి అంత బాగోదు.. చిరాకుగా కనిపిస్తుంది. లిక్విడ్ లిప్ స్టిక్ వేసుకునే వారు కొన్ని రకాల టిప్స్ ని పాటించాలి. ఇవి పాటిస్తే కనుక.. పెదాలు అందంగా కనిపిస్తాయి. మరి అవేంటో ఒకసారి చూద్దాం.

లిప్స్ కి మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి:

ఎలాంటి లిప్ స్టిక్ యూజ్ చేసినా.. ముందు మాయిశ్చ రైజర్ మాత్రం ఖచ్చితంగా వాడాలి. లేకపోతే పెదాలపై మచ్చలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాయిశ్చ రైజర్ తప్పని సరి. దీంతో పెదాలు హైడ్రేట్ అవ్వడమే కాకుండా.. లిప్ స్టిక్ కూడా సరిగ్గా సెట్ అవుతుంది. అయితే లిక్విడ్ లిప్ స్టిక్ వేసుకునేటప్పుడు మాత్రం మాయిశ్చరైజర్ అవసరం లేదు. నేరుగా పెదాలపై లిక్విడ్ లిప్ స్టిక్ ని యూజ్ చేయవచ్చు. లిక్విడ్ లిప్ స్టిక్.. గరుకుగా ఉన్న పెదాలకు మాత్రమే బాగా సూట్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

లిప్ లైనర్:

లిప్ లైనర్ యూజ్ చేయడం వల్ల పెదాల ఆకృతి బాగా కనిపిస్తుంది. ముందుగా మీరు ఎంచుకున్న లిప్ స్టిక్ కలర్ ను బట్టి.. లిప్ లైనర్ ని ఎంచుకోవాలి. దాన్ని పెదాల చుట్టూ సన్నగా వేసుకోవాలి. ఆ తర్వాత లిప్ స్టిక్ ని వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ పెదాలు అందంగా కనిపిస్తాయి.

టిష్యూ:

లిక్విడ్ లిప్ స్టిక్ వేసుకున్నప్పుడు ఒక్కోసారి ఎక్కువగా అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు టిష్యూ పేపర్ ని ఉపయోగించవచ్చు. టిష్యూ పేపర్ పెదాల మధ్యలో ఉంచి నొక్కాలి. ఇలా చేస్తే లిప్ స్టిక్ పేపర్ లోకి వెళ్తుంది. అంతే కానీ క్లాత్ తో తుడవడం, రుద్దడం వంటివి చేయకూడదు.

మీకు సూట్ అయ్యే కలర్ ని ఎంచుకోవాలి:

లిప్ స్టిక్స్ ఏవైనా సరే మీకు సూట్ అయ్యే, నేచురల్ కలర్స్ ని ఎంచుకోండి. అప్పుడే అది నేచురల్ గా కనిపిస్తుంది. మీ స్కిన్ టోన్ కి మ్యాచ్ అయ్యే కలర్స్ తీసుకోవాలి. అలాగే లిప్ లైనర్స్ కూడా లిప్ స్టిక్స్ సూట్ అయ్యే వాటిని ఎంచుకుంటే బెటర్.

ఓ స్ట్రోక్ ఇస్తే సరిపోతుంది:

లిక్విడ్ లిప్ స్టిక్స్ లో క్రీమీ పిగ్మెంటేషన్ ఉంటుంది. కాబట్టి దీని ఓవర్ గా అప్లే చేయకూడదు. కేవలం అలా ఓ స్ట్రోక్ ఇస్తే సరిపోతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!