- Telugu News Photo Gallery Bindi Allergy: Know These Simple Solution to Common Bindi Allergy Complaints
Beauty Tips: నుదుటి తిలకంతో అలర్జీ సమస్య తలెత్తితే.. ఇంట్లోనే ఇలా చేసి చూడండి!
భారతీయ మహిళల వేషధారణలో బొట్టు ముఖ్యమైన అంశం. బొట్టు లేకుంటే ముఖంలో వెలితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎర్రటి సింధూరం నుదుటిన ధరిస్తే ముత్తైదు కళ ముఖంలో తాండవిస్తుంది. అయితే చాలా మందికి నుదుటిన బొట్టు పెట్టుకుంటే అలర్జీ వస్తుంటుంది. అయితే టిప్స్ ఫాలో అవడం వల్ల ఈ సమస్య నుంచి తేలికగా బయటపడొచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. బొట్టు పెట్టుకోవడం వల్ల నుదిటి మధ్య భాగంలో దురద ఉంటే రాత్రి పడుకునే ముందు అలోవెరా జెల్‌ను నుదుటిపై రాసుకుని ..
Updated on: Oct 02, 2023 | 9:06 PM

భారతీయ మహిళల వేషధారణలో బొట్టు ముఖ్యమైన అంశం. బొట్టు లేకుంటే ముఖంలో వెలితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎర్రటి సింధూరం నుదుటిన ధరిస్తే ముత్తైదు కళ ముఖంలో తాండవిస్తుంది. అయితే చాలా మందికి నుదుటిన బొట్టు పెట్టుకుంటే అలర్జీ వస్తుంటుంది. అయితే టిప్స్ ఫాలో అవడం వల్ల ఈ సమస్య నుంచి తేలికగా బయటపడొచ్చంటున్నారు సౌందర్య నిపుణులు.

బొట్టు పెట్టుకోవడం వల్ల నుదిటి మధ్య భాగంలో దురద ఉంటే రాత్రి పడుకునే ముందు అలోవెరా జెల్‌ను నుదుటిపై రాసుకుని నిద్రపోండి. ఇది క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది దురద సమస్యను త్వరిత గతిన పరిష్కరిస్తుంది.

అదే విధంగా కొబ్బరి నూనె కూడా రాసుకోవచ్చు. అరచేతిలో కాస్త కొబ్బరినూనె వేసి.. వేలితో తీసుకుని నుదుటి భాగంలో మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దురద ఇట్టే మాయం అవుతుంది. బొట్టు పెట్టుకోవడం వల్ల అలెర్జీ వస్తే.. మీరు మాయిశ్చరైజర్‌ను కూడా ఉపయోగించవచ్చు. బొట్టు పెట్టుకునే ముందు.. కొద్దిగా సాధారణ మాయిశ్చరైజర్‌తో ఆ ప్రాంతాన్ని మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి ప్రయోజనం పొందుతారు.

బొట్టు పెట్టుకున్న తర్వాత తీవ్రమైన అలెర్జీ ఉంటే వేప ఆకులు, పసుపు పొడిని కూడా ఉపయోగించవచ్చు. వేప, పసుపులో యాంటిసెప్టిక్‌గా పనిచేస్తాయి. ఫలితంగా అలర్జీ సమస్య దూరమవుతుంది.

దీని కోసం ముందుగా వేప ఆకులను రుబ్బుకోవాలి. దానిలో కొద్దిగా పచ్చి పసుపు వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత నుదుటిపై అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల ఎటువంటి ఎలర్జీ అయినా ఇట్టే ఉపశమనం పొందవచ్చు.





























