Cardamom Tea: టీలో రెండు యాలకులు వేసి బాగా మరిగించి ఓ గుక్క తాగారంటే..
టీ అంటే ఇష్టపడని వారెంరుంటారు చెప్పండి. గుమగుమలాడే వేడివేడి టీ గొంతులో పడందే కొందరికీ రోజు ప్రారంభంకాదు. నిద్రలేచిన వెంటనే పరిమళాలు వెదజల్లే టీని తాగితే ఆ రోజంతా వారికి హాయిగా గడిచిపోతుంది.అయితే కొందరు టీని తయారు చేసేటప్పుడు రుచి కోసం కొన్ని ఏలకుల పలుకులు జోడిస్తుంటారు. మరి కొందరు కేవలం ఏలకులతోనే టీ తయారు చేసుకుని తాగుతారు. అసలెందుకు టీలో ఏలకులు వేసుకుంటారో మీరెప్పుడైనా ఆలోచించారా? అసలు మీరు ఎప్పుడైనా ఏలకుల టీ తాగారా? ఈ టీ తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు..
Updated on: Oct 02, 2023 | 8:48 PM

టీ అంటే ఇష్టపడని వారెంరుంటారు చెప్పండి. గుమగుమలాడే వేడివేడి టీ గొంతులో పడందే కొందరికీ రోజు ప్రారంభంకాదు. నిద్రలేచిన వెంటనే పరిమళాలు వెదజల్లే టీని తాగితే ఆ రోజంతా వారికి హాయిగా గడిచిపోతుంది.

అయితే కొందరు టీని తయారు చేసేటప్పుడు రుచి కోసం కొన్ని ఏలకుల పలుకులు జోడిస్తుంటారు. మరి కొందరు కేవలం ఏలకులతోనే టీ తయారు చేసుకుని తాగుతారు. అసలెందుకు టీలో ఏలకులు వేసుకుంటారో మీరెప్పుడైనా ఆలోచించారా? అసలు మీరు ఎప్పుడైనా ఏలకుల టీ తాగారా? ఈ టీ తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఏలకుల టీ జీర్ణక్రియకు హితోధికంగా సహాయపడుతుంది. ఆహారం తిన్న తర్వాత ఏలకుల టీ తాగడం వల్ల ఆహారం వేగంగా జీర్ణమవుతుంది. గ్యాస్ హార్ట్ బర్న్ సమస్య కూడా పరార్ అవుతుంది.

ఏలకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో ఎలాంటి నొప్పి లేకుండా కాపాడుతుంది. పీరియడ్స్ సమయంలో తలెత్తే కడుపు నొప్పి సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

ఏలకులలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఫ్రీ రాడికల్స్‌ను నిరోధించడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అంతేకాకుండా ఏలకుల టీ జలుబు, దగ్గు వంటి వ్యాధుల చికిత్సలో చాలా సహాయపడుతుంది. అంతేకాకుండా యాలకుల టీ శ్వాసకోశ సమస్యలను నయం చేయడానికి కూడా సహాయపడుతుంది.

ఏలకులలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఫలితంగా గుండె జబ్బుల సమస్య చాలా వరకు నియంత్రణలో ఉంటుంది. ఏలకులు కూడా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఏలకుల పరిమళం శరీరాన్ని అలసట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఆందోళన, ఒత్తిడిని సైతం తగ్గిస్తుంది.




