Kitchen Tips: మీ కిచెన్ ని ఈ టిప్స్ తో క్లీన్ గా ఉంచుకోండి.. క్రిములు కూడా మాయం అవుతాయి!!
ఇంట్లోని అందరి ఆరోగ్యం ఇల్లాలి చేతిలో ఉంటుంది. ఎందుకంటే వంటింటి మహారాణి మహిళలే కాబట్టి. ఇంటి సభ్యుల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఇల్లాలి పాత్ర ముఖ్యం. ఇది సాధ్యం అవ్వాలంటే కిచెన్ ని ఎప్పుడూ నీటిగా క్లీన్ గా ఉంచుకోవాలి. వంట గది క్లీన్ గా ఉంటేనే బ్యాక్టీరియా, క్రిములు వంటివి దరి చేరకుండా ఉంటాయి. కిచెన్ ఎప్పుడూ క్లీన్ గా ఉంటేనే.. ఆ ఇంటి సభ్యులు కూడా ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఇప్పుడున్న బిజీ లైఫ్ కారణంగా కొంత మందికి కుదరదు. అలాంటి వారికి ఈ..
ఇంట్లోని అందరి ఆరోగ్యం ఇల్లాలి చేతిలో ఉంటుంది. ఎందుకంటే వంటింటి మహారాణి మహిళలే కాబట్టి. ఇంటి సభ్యుల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఇల్లాలి పాత్ర ముఖ్యం. ఇది సాధ్యం అవ్వాలంటే కిచెన్ ని ఎప్పుడూ నీటిగా క్లీన్ గా ఉంచుకోవాలి. వంట గది క్లీన్ గా ఉంటేనే బ్యాక్టీరియా, క్రిములు వంటివి దరి చేరకుండా ఉంటాయి. కిచెన్ ఎప్పుడూ క్లీన్ గా ఉంటేనే.. ఆ ఇంటి సభ్యులు కూడా ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఇప్పుడున్న బిజీ లైఫ్ కారణంగా కొంత మందికి కుదరదు. అలాంటి వారికి ఈ టిప్స్ బాగా హెల్ప్ అవుతాయి. దీంతో మీ కిచెనే కాకుండా మీరు కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు.
సాధారణంగా కిచెన్ లో ముఖ్యంగా గ్యాస్ స్టవ్, సింక్, కిచెన్ ఫ్టాట్ ఫామ్ (గ్యాస్ కట్టు) ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. కిచెన్ ఫ్టాట్ ఫామ్ పైనే చాలా పని ఉంటుంది. కూరగాయలు కట్ చేయడం, గిన్నెలు క్లీన్ చేసుకోవడం ఇలాంటివన్నీ దీనిపైనే చేస్తాం. ఇది నీటిగా లేకపోతే బ్యాక్టీరియా, బొద్దింకలు, ఈగలు వంటివి చేరతాయి. దీంతో రకరకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు కిచెన్ ని శుభ్రంగా ఉంచుకోవడం ఇంపార్టెంట్. మరి ఆ టిప్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం.
వెనిగర్:
సాధారణంగా వంట చేసేటప్పుడు గ్యాస్ స్టవ్ పై, కిచెన్ ఫ్లాట్ ఫామ్ పై మరకలు పడుతూ ఉంటాయి. ఇలాంటి వాటిని శుభ్రం చేయడంలో వెనిగర్ బాగా యూజ్ అవుతుంది. కొద్దిగా నీళ్లు తీసుకుని అందులో వెనిగర్ కలిపి స్టవ్ ని, ఫ్లాట్ ఫామ్ ని శుభ్రం చేస్తే.. మరకలు పోవడమే కాకుండా క్రిములు, బ్యాక్టీరియా వంటివి కూడా దరి చేరవు.
దుర్వాసన లేకుండా ఉండాలంటే:
మనం ఎక్కువగా ఉపయోగించేది కిచెన్ ఫ్లాట్ ఫామే. ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి దుర్వాసన వస్తూ ఉంటుంది. దీన్ని పోగొట్టుకోవాలంటే బేకింగ్ సోడా బాగా ఉపయోగ పడుతుంది. నీళ్లలో కొద్దిగా బేకింగ్ సోడా వేసి.. గ్యాస్ కట్టును తుడిస్తే మరకలు పోవడమే కాకుండా దుర్వాసన కూడా ఉండదు.
వెంటనే క్లీన్ చేసేయాలి:
చాలా మంది కూరగాయలు కట్ చేసిన చెత్తంతా గ్యాస్ కట్టుపైనే వదిలేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల తేమ చేరి అక్కడకు క్రిములు, బ్యాక్టీరియా వంటివి తొందరగా చేరే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కూరగాయలు కట్ చేస్తే వెంటనే తీసేసి చెత్త డబ్బాలో వేసుకోవడం బెటర్.
సింక్ ని ఇలా క్లీన్ చేస్తే దుర్వాసన రాదు:
కిచెన్ లో ఉండే సింక్ ని ఎప్పుడూ క్లీన్ గా ఉంచుకోవాలి. లేదంటే మురికి చేరి దుర్వాసన రావడమే కాకుండా.. బ్యాక్టీరియా, క్రిములు, బొద్దింకలు, ఈగలు చేరి వ్యాధులు ప్రబలేలా చేస్తాయి. దీంతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పాత్రలను తోమేసిన తర్వాత సబ్బుతో క్లీన్ చేసుకోవాలి. అలాగే అప్పుడప్పుడు వెనిగర్ వాటర్ ని కానీ, బేకింగ్ సోడా వాటర్ ని వేస్తూ ఉండాలి.
నూనె పడితే ఇలా క్లీన్ చేయండి:
వంట గదిలో అప్పుడప్పుడు నూనె పడుతూ ఉంటాయి. నూనె పడిన చోట గోధుమ పిండిని చల్లాలి. ఐదు నిమిషాల తర్వాత పేపర్ తో క్లీన్ చేసేయవచ్చు. ఇలా చేస్తే జిడ్డు లేకుండా ఉంటుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.