Moong Dal Soup: జ్వరంగా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ పెసరపప్పు సూప్ తాగండి.. త్వరగా కోలుకుంటారు!!
సాధారణంగా వాతావరణ పరిస్థితులు మారినప్పుడల్లా వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఆహారం అస్సలు సహించదు. ఏమీ తినాలని, తాగాలని కానీ అనిపించదు. కేవలం చిన్న కొద్దిగా పాలు, బ్రెడ్ లేదంటే టిఫిన్ చేస్తూంటారు. జ్వరంగా ఉన్నప్పుడు శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది తక్కువ ఉంటుంది. దీంతో వ్యాధితో పోరాడే శక్తి లభించదు. ఒక వైపు సరైన ఆహారం తీసుకోకపోతే త్వరగా కోలుకోము. అలాంటప్పుడు ఒక్కసారి ఇలా పెసర పప్పు సూప్ తాగండి. రిలీఫ్ తో పాటు ఎనర్జీ లెవల్స్ కూడా పెరుగుతాయి. దీంతో జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. ఈ సూప్ ని ఉదయం లేదా మధ్యాహ్నం..
సాధారణంగా వాతావరణ పరిస్థితులు మారినప్పుడల్లా వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఆహారం అస్సలు సహించదు. ఏమీ తినాలని, తాగాలని కానీ అనిపించదు. కేవలం చిన్న కొద్దిగా పాలు, బ్రెడ్ లేదంటే టిఫిన్ చేస్తూంటారు. జ్వరంగా ఉన్నప్పుడు శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది తక్కువ ఉంటుంది. దీంతో వ్యాధితో పోరాడే శక్తి లభించదు. ఒక వైపు సరైన ఆహారం తీసుకోకపోతే త్వరగా కోలుకోము. అలాంటప్పుడు ఒక్కసారి ఇలా పెసర పప్పు సూప్ తాగండి. రిలీఫ్ తో పాటు ఎనర్జీ లెవల్స్ కూడా పెరుగుతాయి. దీంతో జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. ఈ సూప్ ని ఉదయం లేదా మధ్యాహ్నం తాగితే బెటర్. సాయంత్రం తాగితే అరగదు. మరి ఈ పెసర పప్పు సూప్ ని ఎలా తయారు చేసుకుంటారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఒక్కసారి చూద్దాం.
పెసర పప్పు సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
పెసర పప్పు, నూనె లేదా నెయ్యి, జీలకర్ర, పచ్చిమిర్చి, కారం, పసుపు, సన్నగా తరిగిన అల్లం, క్యారెట్, గుమ్మడికాయ ముక్కలు, మిరియాలు, వాము, ఉప్పు, మెంతి కూర లేదా కొత్తి మీర, కరివేపాకు, అల్లం పొడి.
తయారీ విధానం:
ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి. ఇందులో నెయ్యి లేదా నూనె వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, తరిగిన అల్లం, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి ఆ నెక్ట్స్ పెసరపప్పు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకుని, క్యారెట్, గుమ్మడి కాయ ముక్కులు కూడా వేసుకుని మరి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు సూప్ కి సరిపడా నీళ్లు, ఉప్పు వేసుకుని కుక్కర్ మూత పెట్టుకోవాలి.
మూడు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మిరాయలు, అల్లం పొడి, వాము వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొత్తి మీరతో గార్నిష్ చేసుకోవడమే. అంతే ఎంతో సింపుల్ పెసర పప్పు సూప్ సిద్ధం. ఈ సూప్ తాగితే బాడీలో ఇమ్యూనిటీ లెవల్స్ పెరుగుతాయి. జ్వరం, జలుబు, దగ్గు ఉన్నప్పుడు తాగితే మంచి రిలీఫ్ రావడమే కాకుండా.. త్వరగా కోలుకుంటారు. ఈ సూప్ ని కేవలం జ్వరం ఉన్నప్పుడే కాకుండా.. అప్పుడప్పుడు తాగితే చలువ చేస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.