Hibiscus Hair Mask: వారానికో సారి ఓ హెయిర్ మాస్క్ ట్రై చేశారంటే.. పట్టులాంటి జుట్టు మీసొంతం!
అందమైన, ఒత్తైన జుట్టు కావాలని ప్రతి ఆమ్మాయి కోరుకుంటుంది. కానీ కాలుష్యం, దుమ్మూ-ధూళి కారణంగా జుట్టు నిర్జీవంగా మారి రాలిపోతుంటుంది. అయితే ఆయుర్వేదంలో కొన్ని రకాల చిట్కాల ద్వారా జుట్టు సమస్యలకు లేలికగా చికిత్స చేయవచ్చు. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా, జుట్టు ఆరోగ్యంగా తిరిగి పెరగడానికి, బలమైన కుదుళ్ల పోషణకు కూడా సహాయపడతాయి. సాధారణంగా ఆయుర్వేదంలో జుట్టు సంరక్షణ కోసం హెర్బల్ పదార్థాలను ఉపయోగిస్తుంటారు. వాటిల్లో మెంతి, మందారం పువ్వులు, మందారం ఆకులు..
అందమైన, ఒత్తైన జుట్టు కావాలని ప్రతి ఆమ్మాయి కోరుకుంటుంది. కానీ కాలుష్యం, దుమ్మూ-ధూళి కారణంగా జుట్టు నిర్జీవంగా మారి రాలిపోతుంటుంది. అయితే ఆయుర్వేదంలో కొన్ని రకాల చిట్కాల ద్వారా జుట్టు సమస్యలకు లేలికగా చికిత్స చేయవచ్చు. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా, జుట్టు ఆరోగ్యంగా తిరిగి పెరగడానికి, బలమైన కుదుళ్ల పోషణకు కూడా సహాయపడతాయి. సాధారణంగా ఆయుర్వేదంలో జుట్టు సంరక్షణ కోసం హెర్బల్ పదార్థాలను ఉపయోగిస్తుంటారు. వాటిల్లో మెంతి, మందారం పువ్వులు, మందారం ఆకులు చాలా ముఖ్యమైనవి. వాటితో తయారు చేసిన హెయిర్ మాస్క్ జుట్టు సంరక్షణలో ఎంతో సహాయపడుతుంది.
మెంతులు
మెంతి గింజల్లో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టుకు సలు విధాలుగా సహాయపడతాయి. మెంతికూరలోని ప్రొటీన్, నికోటినిక్ యాసిడ్ జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. అలాగే తలకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. మెంతుల్లోని యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చుండ్రు సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
మెంతి హెయిర్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలంటే..
3 టీస్పూన్ల మెంతి గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం నానబెట్టిన మెంతి గింజలను మెత్తని పేస్టులా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత జుట్టుకు కొద్దిగా నూనె రాసుకోవాలి. తర్వాత మెంతి గింజల పేస్ట్‌ను తలకు, జుట్టుకు పట్టించి షవర్ క్యాప్ పెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేసుకుంటే సరి. ఇది జుట్టుకు కండీషనర్‌గా పనిచేస్తుంది. వారానికి ఒకసారి ఈ హెయిర్ మాస్క్‌ని ఉపయోగించవచ్చు. అలాగే మెంతి గింజల పేస్ట్‌తో పుల్లని పెరుగును కూడా కలపవచ్చు. కొబ్బరి నూనెలో కొన్ని మెంతులు వేసి మరిగించి ఆ నూనెను జుట్టుకు రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
మందారం ఆకులు, పువ్వులు
మందారం పువ్వులు, ఆకుల్లో విటమిన్ ఎ, సి అధికంగా ఉంటుంది. మందారం పువ్వులు, ఆకులు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. ఇది తలలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా మందారం పువ్వులు, ఆకులు సహజ కండిషనింగ్ కలిగి ఉంటాయి. ఇవి జుట్టును మృదువుగా చేస్తాయి. అంతేకాకుండా మందారంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ జుట్టు తెల్లబడకుండా నివారిస్తుంది. అంతేకాకుండా దీనిలోని సహజ పదార్ధాలు చుండ్రు, దురద, మంట నుంచి మాడును కాపాడుతుంది.
మందారం హెయిర్ మాస్క్
ఒక కప్పు మందారం ఆకులు, పూల రేకులను నీటిలో నానబెట్టి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేసుకోవాలి. కొబ్బరి నూనెలో మందారం పువ్వు రేకులు, ఆకులను వేసి మరిగించి హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు.
మెంతి-మందారం హెయిర్ మాస్క్
2 చెంచాల మెంతి గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టుకోవాలి. ఆ మరుసటి రోజు ఉదయం మందారం పువ్వు రేకులు, ఆకులతో మెంతి గింజనలు మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హెయిర్ మాస్క్‌గా వేసుకుని 30 నిమిషాలు అలాగే ఉంచి షాంపూ కడిగేసుకోవాలి. వారానికి ఒకసారి ఈ హెయిర్ మాస్క్‌ని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.