School Reopen: ఆ ఊరిలో 33 ఏళ్ల తర్వాత మోగిన బడి గంటలు.. పరుగు పరుగున వచ్చిన విద్యార్ధులు!
జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో దాదాపు 33 ఏళ్ల తర్వాత పాఠశాల పునఃప్రారంభం కావడంతో విద్యార్థుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. అక్కడి ఆర్యసమాజ్ పాఠశాల 1990లలో మిలిటెన్సీ కారణంగా మూసివేశారు. మూడు దశాబ్దాల తర్వాత డౌన్‌టౌన్‌లోని మహారాజ్ గంజ్‌లో ఈ చారిత్రక పాఠశాల తిరిగి ప్రారంభమైంది. ఈ పాఠశాల పునఃప్రారంభం కోసం చాలా మంది పిల్లలు, ఉపాధ్యాయులు ఆసక్తిగా ఎదురుచూడసాగారు. నేటితో వారి కోరిక తీరినట్లైంది. ఉగ్రదాడి కారణంగా మూతపడిన ఈ పాఠశాలను 1992లో స్థానికంగా ఓ వ్యక్తి స్వాధీనం చేసుకుని..

శ్రీనగర్, అక్టోబర్ 2: ఆ ఊరిలో 33 ఏళ్ల తర్వాత తొలిసారి బడి గంటలు మోగాయి. ఇన్నేళ్లకు పాఠశాల తిరిగి తెరవడంతో విద్యార్థుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. పిల్లలంతా తొలిసారి స్కూల్‌కి వెళ్లి సంబరపడిపోయారు. దీంతో ఊరంతా పండగ వాతావరణం నెలకొంది. ఇంతకీ ఎక్కడంటే..
జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో దాదాపు 33 ఏళ్ల తర్వాత పాఠశాల పునఃప్రారంభం కావడంతో విద్యార్థుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. అక్కడి ఆర్యసమాజ్ పాఠశాల 1990లలో మిలిటెన్సీ కారణంగా మూసివేశారు. మూడు దశాబ్దాల తర్వాత డౌన్‌టౌన్‌లోని మహారాజ్ గంజ్‌లో ఈ చారిత్రక పాఠశాల తిరిగి ప్రారంభమైంది. ఈ పాఠశాల పునఃప్రారంభం కోసం చాలా మంది పిల్లలు, ఉపాధ్యాయులు ఆసక్తిగా ఎదురుచూడసాగారు. నేటితో వారి కోరిక తీరినట్లైంది. ఉగ్రదాడి కారణంగా మూతపడిన ఈ పాఠశాలను 1992లో స్థానికంగా ఓ వ్యక్తి స్వాధీనం చేసుకుని ప్రైవేట్ పాఠశాలగా దానిని ప్రారంభించాడు.
ప్రైవేట్ పాఠశాలకు ‘నక్స్‌బంది పబ్లిక్ స్కూల్’ అనే పేరు కూడా పెట్టాడు. ఆ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నిరంతర నిరసనల కారణంగా స్థానిక అధికారులు మళ్లీ ట్రస్ట్‌కు ఆస్తిపై హక్కులను అప్పగించారు. అయితే, ట్రస్టు తిరిగి స్వాధీనం చేసుకునే సమయానికి ఈ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. దీంతో కొత్త భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ పాఠశాల కొత్త భవనంలో తిరిగి తరగతులు ప్రారంభమయ్యాయి. పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలను చేర్చుకునేందుకు సమీపంలోని తల్లిదండ్రులను సంప్రదించగా, వారు మొదట సంకోచించినా తర్వాత అంగీకరించారు. విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ పాఠశాల మళ్లీ ప్రారంభమైంది. 1990కి ముందు ఈ పాఠశాలకు వందలాది మంది పిల్లలు చదువుకునేందుకు వచ్చేవారని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. త్వరలో మళ్లీ అదే పరిస్థితి వస్తుందని ఆశిస్తున్నమని ఆశాభావం వ్యక్తం చేశారు.
పండిట్లకు బెదిరింపులు
1990లలో ఈ ఆర్యసమాజ్ పాఠశాలలో బోధిస్తున్న పండిట్ ఉపాధ్యాయులను తీవ్రవాదులు బెదిరించారు. ఆ తర్వాత పలువురు ఉపాధ్యాయులు ఒక్కొక్కరుగా పాఠశాల నుంచి వెళ్లిపోయారు. ఈ కారణంగా ట్రస్ట్ ఈ పాఠశాలను మూసివేయవలసి వచ్చింది. అయితే, ఇప్పుడు ఈ పాఠశాల మళ్లీ ప్రారంభమవడంతో ఆ ప్రాంతంలోని చాలా మంది పిల్లలకు విద్యను అందించడానికి అవకాశం లభించినట్లైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.