AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: తహసీల్దార్ కార్యాలయం ACB అధికారులు దాడి.. ఆమ్యామ్యా తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వైనం

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేసారు. దాడుల్లో డిజిటల్ జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు, కోటేకల్ గ్రామం VRO శ్రీనివాసులు ఇద్దరు మూడు వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కోటేకల్ గ్రామానికి చెందిన తెలుగురాముడు అనే వ్యక్తి తన స్థల విషయంలో వాల్యుయేషన్ సర్టిఫికెట్ కొరకు గత 15 రోజులగా తిప్పుకుంటూ ఉండగా ఆ ఇద్దరు అధికారులు జూనియర్ అసిస్టెంట్ 1500 రూపాయలు, VRO 1500 రూపాయలు బేరం..

Andhra Pradesh: తహసీల్దార్ కార్యాలయం ACB అధికారులు దాడి.. ఆమ్యామ్యా తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వైనం
ACB officers raides Emmiganur MRO office
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Mar 07, 2025 | 2:41 PM

Share

అమరావతి, సెప్టెంబర్‌ 1: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేసారు. దాడుల్లో డిజిటల్ జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు, కోటేకల్ గ్రామం VRO శ్రీనివాసులు ఇద్దరు మూడు వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కోటేకల్ గ్రామానికి చెందిన తెలుగురాముడు అనే వ్యక్తి తన స్థల విషయంలో వాల్యుయేషన్ సర్టిఫికెట్ కొరకు గత 15 రోజులగా తిప్పుకుంటూ ఉండగా ఆ ఇద్దరు అధికారులు జూనియర్ అసిస్టెంట్ 1500 రూపాయలు, VRO 1500 రూపాయలు బేరం కుదుర్చుకున్నారు. కొన్ని రోజులగా తిప్పుకుంటూ ఇప్పుడు అధికారులు డబ్బులు డిమాండ్ చేయడంతో ఆ బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్టు ఏసీబీ DSP వేంకటాద్రి తెలిపారు. బాధితుడు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు బాధితుడు జూనియర్ అసిస్టెంట్, VRO కు లంచము ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

నిన్న తెలంగాణలోనూ MRO ఇంటిపై ఏపీబీ దాడులు.. భారీగా డబ్బు, ఆస్తి పత్రాలు స్వాధీనం

గుట్టలు గుట్టలుగా ఉన్న ఈ నోట్ల కట్టలు చూసి.. ఇదేదో బ్యాంక్ అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే ఇవి మర్రిగూడ ఎమ్‌ఆర్‌వో మహేందర్‌రెడ్డి కూడబెట్టిన అవినీతి డబ్బు. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మర్రిగూడ ఎమ్మార్వోగా విధులు నిర్వహిస్తోన్న మహేందర్‌రెడ్డి ఇంటిపై ACB అధికారులు శనివారం ఉదయం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎమ్‌ఆర్‌వో ఇంట్లో ఓ ట్రంకు పెట్టె నిండా నోట్ల కట్టలు భారీ ఎత్తున బయటపడ్డాయి. ఏకంగా నాలుగు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయల నగదు, ఆస్తి పత్రాలను అధికారులు గుర్తించారు. పట్టుబడ్డ మొత్తంలో రూ. రెండు కోట్ల ఏడు లక్షల నగదు, 259 గ్రాముల బంగారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ట్రంక్‌ పెట్టెలో దాచిన నోట్ల కట్టలను గ్యాస్‌ కట్టర్‌తో కట్‌ చేసి అధికారలు బయటకు తీశారు. పెట్టె నిండా 500 రూపాయల నోట్ల కట్టలు పెద్ద ఎత్తున బయటపడటంతో స్థానికంగా ఈ వ్యవహారం కలకలం రేపింది. ఆ డబ్బు అంతటినీ మిషన్‌ ద్వారా లెక్కించారు. ఎమ్‌ఆర్‌వో మహేందర్‌రెడ్డి ఇంటితో పాటు ఆయన సన్నిహితులు, స్నేహితులు, బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇలా మొత్తం 15 చోట్ల దాడి చేశారు. భారీగా అక్రమ ఆస్తులను కూడబెట్టినట్లు తేలడంతో అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.