Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఇదేంది అయ్యోరూ..’ తప్పతాగి వచ్చి తరగతి గదిలోకి వెళ్లలేక నేలపై దొర్లుతోన్న హెచ్‌ఎం

ఆయన బాధ్యత కలిగిన ఓ ప్రధానోపాధ్యాయుడు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన మార్గదర్శి. విధి నిర్వహణలో బాధ్యత మరిచి ఫూటు మద్యం సేవించి పాఠశాలకు వచ్చాడు. మద్యం మత్తులో నడవలేని స్థితిలో తరగతి గదిలోకి కూడా వెళ్లలేక గది ముందే నేలపై పడి దొర్లుతున్న దృశ్యం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఒడిస్సాలోని కేంఝర్‌ జిల్లా హరిచందన్‌పూర్‌ సమితిలో ఉన్న గరదాహాబహాలోని ప్రాథమిక పాఠశాలలో బుధవారం (సెప్టెంబర్ 27) ఇందుకు..

'ఇదేంది అయ్యోరూ..' తప్పతాగి వచ్చి తరగతి గదిలోకి వెళ్లలేక నేలపై దొర్లుతోన్న హెచ్‌ఎం
Drunken Headmaster Lying At School
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 29, 2023 | 9:42 AM

భువనేశ్వర్‌, సెప్టెంబర్‌ 29: ఆయన బాధ్యత కలిగిన ఓ ప్రధానోపాధ్యాయుడు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన మార్గదర్శి. విధి నిర్వహణలో బాధ్యత మరిచి ఫూటు మద్యం సేవించి పాఠశాలకు వచ్చాడు. మద్యం మత్తులో నడవలేని స్థితిలో తరగతి గదిలోకి కూడా వెళ్లలేక గది ముందే నేలపై పడి దొర్లుతున్న దృశ్యం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఒడిస్సాలోని కేంఝర్‌ జిల్లా హరిచందన్‌పూర్‌ సమితిలో ఉన్న గరదాహాబహాలోని ప్రాథమిక పాఠశాలలో బుధవారం (సెప్టెంబర్ 27) ఇందుకు సంబంధించిన దృశ్యం కనిపించింది. వివరాల్లోకెళ్తే..

ఒడిశాలోని కియోంజర్ జిల్లాలోని కియోంజర్‌లోని హరిచందన్‌పూర్ బ్లాక్ పరిధిలోని గరగడబహల్ ప్రాథమిక పాఠశాలలో బసంత్ కుమార్ ముండ్ ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆ పాఠశాలలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు ఇక్కడ విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు వసంత ముండతోపాటు మరో ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు. మద్యం అలవాటు ఉన్న బసంత్ కుమార్ బుధవారం (సెప్టెంబర్ 27) తప్ప తాగి పాఠశాలకు వచ్చాడు. బుధవారం ఉదయం మత్తులో తూలుతూ వచ్చిన బసంత్‌ కుమార్ కనీసం తరగతి గదిలోకి కూడా వెళ్లలేక పాఠశాల ఆవరణలోనే మద్యం మత్తులో కింద పడి దొర్లుతూ కనిపించాడు.

కనీసం తరగతి గదిలోకి కూడా వెళ్లలేక నేలపైనే..

పాఠశాల ఆవరణలోని చెట్టు దగ్గర పడి ఉన్న ప్రధానోపాధ్యాయుడిని గమనించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలియజేశారు. వెంటనే గ్రామస్థులు అనేక మంది పాఠశాల వద్దకు చేరుకుని సోయలేకుండా పడిఉన్న ప్రధానోపాధ్యాయుడిని చూసి ముక్కున వేలేసుకున్నారు. అనంతరం ఆయనకు సపర్యలు చేశారు. అక్కడ ఉన్న కొందరు యవకులు ఈ దృశ్యాలను ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఆ వీడియో కాస్తా కియోంజర్‌లో వైరల్‌గా మారింది. ఈ విషయమై గ్రామస్థులు కొందరు బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (బీఈవో)కి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. దర్యాప్తు చేసి సదరు ప్రధానోపాధ్యాయునిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.