Viral Video: మహిళపై స్పా మేనేజర్‌ అమానుష దాడి! జుట్టు పట్టి ఈడ్చుకెళ్లి.. బట్టలు చింపివేసి..

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని ఓ స్పా సెలూన్‌ బయట దారుణ ఘటన చోటు చేసుకుంది. స్పా మేనేజర్ ఓ మహిళపై దారుణంగా దాడి చేసి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లాడు. అనంతరం ఆమె ధరించిన దుస్తులు చింపివేసి సభ్యసమాజం తలదింపుకునేలా అమానుషంగా కొట్టాడు. ఈ ఘటన సెప్టెంబర్ 25న జరగగా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. పోలీసులు..

Viral Video: మహిళపై స్పా మేనేజర్‌ అమానుష దాడి! జుట్టు పట్టి ఈడ్చుకెళ్లి.. బట్టలు చింపివేసి..
Spa Manager Brutally Assaults Woman
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 28, 2023 | 1:52 PM

అహ్మదాబాద్‌, సెప్టెంబర్ 28: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని ఓ స్పా సెలూన్‌ బయట దారుణ ఘటన చోటు చేసుకుంది. స్పా మేనేజర్ ఓ మహిళపై దారుణంగా దాడి చేసి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లాడు. అనంతరం ఆమె ధరించిన దుస్తులు చింపివేసి సభ్యసమాజం తలదింపుకునేలా అమానుషంగా కొట్టాడు. ఈ ఘటన సెప్టెంబర్ 25న జరగగా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

అహ్మదాబాద్‌లోని సింధు భవన్ రోడ్‌లోని కాంప్లెక్స్‌లో మొహ్సిన్ అనే వ్యక్తి గెలాక్సీ స్పా నడుపుతున్నాడు. ఏం జరిగిందో తెలియదు గానీ ఓ మహిళ (25)పై స్పా యజమాని మొహ్సిన్‌ దారుణంగా దాడికి పాల్పడ్డాడు. దాడి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఘటనలో సదరు వ్యక్తి మహిళను కొట్టడం కనిపిస్తుంది. ఆమెను జుట్టు పట్టుకుని లాగడం, బట్టలు చింపడం వంటి దృశ్యాలు నమోదయ్యాయి. నిందితుడి నుంచి తనను తాను రక్షించుకోలేక నిస్సహాయంగా ఆమె ఆర్తనాదాలు చేయడం వీడియోలో కనిపిప్తుంది. సుమారు నాలుగు నిమిషాల నిడివికలిగిన ఈ వీడియోలో మొహ్సిన్ మహిళపై పదేపదే దాడి చేయడం కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఘటన జరిగి రెండు రోజులు గడిచిన నిందితుడిపై బాధిత మహిళ ఫిర్యాదు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై సెప్టెంబరు 27న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గెలాక్సీ స్పా యజమాని మొహ్సిన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వీడియో వైరల్‌ కావడంతో బోడక్‌దేవ్ పోలీసులు సామాజిక కార్యకర్త సహాయంతో మహిళ వద్దకు చేరుకుని ఆమెకు కౌన్సెలింగ్ అందించారు. విచారణలో బాధిత మహిళ స్పా వ్యాపారంలో భాగస్వామి అని తేలింది. ఏదో విషయమై ఇద్దరి మధ్య కొంత సమయంపాటు వాగ్వాదం జరిగింది. అనంతరం సహనం కోల్పోయిన నిందితుడు ఆమెను జుట్టు పట్టుకుని దారుణంగా కొట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.