AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ‘ఇదేందయ్యా ఇదీ.. నేనెక్కడా చూడలా! లోకోపైలెట్‌ నిద్రపోయినాడా ఏందీ’ ప్లాట్‌ ఫాంపైకి దూసుకొచ్చిన ట్రైన్‌!

సాధారణంగా ట్రైన్ పట్టాలు తప్పడం, రెండు రైళ్లు ఒకదాన్ని మరొకటి ఢీ కొట్టుకోవడం, మరొకడుగు ముందుకేసి ట్రైన్ బోగాలు పల్టీలు కొట్టడం మనం ఇంత వరకూ చూశాం. కానీ ఇది అంతకు మించిన సంఘటన. రైలు పట్టాల మీద నుంచి ఫ్లాట్ ఫాం మీదకు దూసుకు రావడం ఎప్పుడైనా చూశారా? అదేంటీ.. అని అనుకుంటున్నారా? ఉత్తర ప్రదేశ్‌లో ఓ ట్రైన్‌ పట్టాల మీద నుంచి ఏకంగా ప్లాట్‌ఫాం మీదకు ఓ ట్రైన్‌ దూసుకొచ్చింది. అయితే ఆ సమయంలో ట్రైన్‌లో ప్యాసెంజర్లు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అసలిది ఎలా జరిగిందో తమకు ఏమాత్రం..

Viral Video: 'ఇదేందయ్యా ఇదీ.. నేనెక్కడా చూడలా! లోకోపైలెట్‌ నిద్రపోయినాడా ఏందీ' ప్లాట్‌ ఫాంపైకి దూసుకొచ్చిన ట్రైన్‌!
Train Climbs Platform
Srilakshmi C
|

Updated on: Sep 27, 2023 | 10:18 AM

Share

మధుర, సెప్టెంబర్‌ 27: సాధారణంగా ట్రైన్ పట్టాలు తప్పడం, రెండు రైళ్లు ఒకదాన్ని మరొకటి ఢీ కొట్టుకోవడం, మరొకడుగు ముందుకేసి ట్రైన్ బోగాలు పల్టీలు కొట్టడం మనం ఇంత వరకూ చూశాం. కానీ ఇది అంతకు మించిన సంఘటన. రైలు పట్టాల మీద నుంచి ఫ్లాట్ ఫాం మీదకు దూసుకు రావడం ఎప్పుడైనా చూశారా? అదేంటీ.. అని అనుకుంటున్నారా? ఉత్తర ప్రదేశ్‌లో ఓ ట్రైన్‌ పట్టాల మీద నుంచి ఏకంగా ప్లాట్‌ఫాం మీదకు ఓ ట్రైన్‌ దూసుకొచ్చింది. అయితే ఆ సమయంలో ట్రైన్‌లో ప్యాసెంజర్లు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అసలిది ఎలా జరిగిందో తమకు ఏమాత్రం తెలియదంటున్నారు రైల్వే అధికారులు. యూపీలో చోటుచేసుకున్న ఈ విచిత్ర సంఘటన ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. అసలేం జరిగిందంటే..

ఉత్తర ప్రదేశ్‌లోని మధుర రైల్వే స్టేషన్‌లో ఈ రైలు ప్రమాదం జరిగింది. షకుర్ బస్తీ నుంచి వచ్చిన ఈఎంయూ (ఎలక్ట్రిక్‌ మల్టిపుల్‌ యూనిట్‌) రైలు మంగళవారం రాత్రి 10:49 గంటల సమయంలో మధుర స్టేషన్‌కు వచ్చింది. అదే చివరి స్టేషన్‌ కావడంతో ప్రయాణీకులందరూ రైలు దిగారు. అయితే ఉన్నట్టుండి ఏం జరిగిందో తెలియదు.. ఒక్కసారిగా రైలు ఫ్లాట్ ఫామ్ పైకి దూసుకువెళ్లింది. అయితే అప్పటికే ట్రైన్‌లో ప్రయాణికులందరూ దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊరిపి పీల్చుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని మధుర స్టేషన్ డైరెక్టర్ SK శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ ప్రమాదం ఎలా జరిగిందో ఇంకా అర్థం కావడం లేదు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. ఢిల్లీ నుంచి రాత్రి 11:49 గంటలకు మథుర జంక్షన్ వద్దకు రైలు చేరుకున్న 5 నిమిషాలకు ఈ సంఘటన జరిగింది. ఓవర్ హెడ్ ఎక్విప్‌మెంట్‌ను బద్దలు కొట్టుకొని ట్రైన్‌ ఫ్లాట్ ఫామ్ పైకి దూసుకు వచ్చింది. దీంతో ఫ్లాట్ ఫామ్ స్వల్పంగా దెబ్బతిందని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వీడియోను వీక్షించిన కొందరు నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అంత బరువైన ట్రైన్ మహా అయితే పట్టాల నుంచి కొద్దిగ పక్కకు తప్పుతుంది. అంతేకానీ ఏకంగా ఎతైన ఫ్లాట్ ఫామ్ మీదకి ఎలా ఎక్కుతుంది. బైక్ ముందు టైర్ పైకెత్తి విన్యాసాలు చేసినట్లు లోకో ఫైలెట్ కూడా అలా ఏదైనా స్టంట్‌ చేసినాడా ఏందీ..! అంటూ ఛలోక్తులు విసురుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!