Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాహుబలి విమానం వచ్చేసింది.. ఇక శత్రువులకు గుండెదడే !!

బాహుబలి విమానం వచ్చేసింది.. ఇక శత్రువులకు గుండెదడే !!

Phani CH

|

Updated on: Sep 27, 2023 | 10:04 AM

భారత వైమానిక దళంలో బాహుబలి విమానం చేరింది. C-295 MW ట్రాన్స్‌పోర్ట్‌ విమానానికి హిండన్‌ ఎయిర్‌బేస్‌లో స్వాగతం పలికారు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌. సైనిక అవసరాల కోసం బాహుబలి విమానాన్ని భారత్‌ కొనుగోలు చేసింది. స్పెయిన్‌లో తయారైన C-295 మిలటరీ విమానాన్ని భారత్‌కు తీసుకొచ్చారు. ఈ బాహుబలి విమానానికి ప్రత్యేక పూజలు చేశారు రాజ్‌నాథ్‌సింగ్‌. C-295 MW విమానంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

భారత వైమానిక దళంలో బాహుబలి విమానం చేరింది. C-295 MW ట్రాన్స్‌పోర్ట్‌ విమానానికి హిండన్‌ ఎయిర్‌బేస్‌లో స్వాగతం పలికారు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌. సైనిక అవసరాల కోసం బాహుబలి విమానాన్ని భారత్‌ కొనుగోలు చేసింది. స్పెయిన్‌లో తయారైన C-295 మిలటరీ విమానాన్ని భారత్‌కు తీసుకొచ్చారు. ఈ బాహుబలి విమానానికి ప్రత్యేక పూజలు చేశారు రాజ్‌నాథ్‌సింగ్‌. C-295 MW విమానంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రెండో C-295 విమానాన్ని మే 2024లో భారత్‌కు తీసుకొస్తారు. స్పెయిన్‌ నుంచి 56 విమానాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలో కేంద్రం ఉంది. స్పెయిన్‌ లోనే 16 విమానాలను తయారు చేస్తారు. మిగతా విమానాలను ఎయిర్‌బస్‌ కంపెనీ సహకారంతో గుజరాత్‌ లోని వడోదరలో తయారు చేస్తారు. టాటా అడ్వాన్స్‌ సిస్టమ్‌ కంపెనీ భారత్‌లో ఈ విమానాలను తయారు చేస్తోంది. ఎమర్జెన్సీ సమయాల్లో ఈ విమానాలు ఎంతో ఉపయోగం.. సైనికులు , యుద్ద సామాగ్రి తరలింపులకు చాలా ఉపయోగపడుతుంది. విమానం ల్యాండ్‌ కావడానికి , టేకాఫ్‌ కావడానికి పెద్ద రన్‌వే అవసరం లేదు. పర్వత ప్రాంతాల్లో కూడా సులభంగా ఈ విమానం ల్యాండవుతుంది. C-295 విమానం 11 గంటల పాటు నిరంతరంగా ప్రయాణం చేస్తుంది. 7050 కిలోల బరువును ఈ విమానం మోసుకెళ్తుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోగులకు చేతబడి చేశారంటూ క్షుద్రపూజలు చేస్తున్న ఆయుర్వేద వైద్యుడు !! చివరికి ??

Navdeep: నవదీప్‌ గుట్టంతా ఆ మొబైల్‌ ఫోన్‌లోనే !! ఫోన్‌ తెరిస్తే హీరో పని ఔట్‌.

Elon Musk: ఎలాన్ మస్క్ మంత్రమేశాడు.. రోబో యోగా చేస్తోంది

Delhi Metro: మెట్రోలో మారని బుద్ధి.. బహిరంగంగా కౌగిలింతలు, ముద్దులు

Ram Charan: రామ్ చరణ్ ముఖానికి గాయం !! అసలేం జరిగిందంటే ??